సంగతులూ,సందర్భాలూ….

జూలై 8, 2010

ఎందరో మహానుభావులు….

Filed under: కబుర్లు,సంగీతం — Sriram @ 1:06 ఉద.

శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి తో పరిచయం, సాక్షిటీవీలో:
మొదటి భాగం

రెండవ భాగం

వయసుమీదపడినా తాను యవ్వనంలోనే ఉంటానన్నమాట ఆయన సంగీతానికి తప్పకుండా వర్తిస్తుంది కానీ, పెద్దవయసు వల్ల వచ్చే చాదస్తం వల్ల ఆత్మవిశ్వాసం స్వోత్కర్షగా మారడం ఆయన మాటలలో తప్పకుండా కనిపించింది. ఏమైనా, ఆయన మాటలు వినడం భలే సరదాగా ఉంటుంది. ఇరవైరెండువేల కచేరీల తరవాత కూడా ఆ గొంతులో మాధుర్యం ఎక్కడా తగ్గకపోవడం నన్ను అబ్బురపరుస్తూ ఉంటుంది. ఆయన నిజంగా కారణజన్ముడు.

గాయకుడిగా రావలసినంత పేరు వచ్చినా, అయన కృతులు మాత్రం ఇంకా ప్రచారం పొందవలసినవి అని మాత్రం అనిపించింది. కర్ణాటక సంగీత ప్రపంచంలో ఆయనకి ఎక్కువమంది మిత్రులు లేకపోవడం, ఆయనస్థాయికి తగిన విధంలో శిష్యులని తయారు చేయకపోవడం కారణాలు కావచ్చు. తెలుగువాడిగా పుట్టడం కూడా. ఐతే ఈ మధ్య కేరళ రాజవంశీయులు రామవర్మగారు ఆయన బాణీని బాగా ప్రచారం చేస్తున్నారు. మంచి గాయకులూ, వీణ విద్వాంసులు ఐన ఈయన యూట్యూబు ద్వారా కూడా బాలమురళీగారి సంగీతాన్ని, కొన్ని అరుదైన వీడియోలనూ అందరికీ అందిస్తున్నారు.