ఏంటెన్నాలు, బూస్టర్లు పెట్టుకుని టీవీ చూసిన తెలుగు వారందరికీ ఈ వాక్యం సుపరిచితం. ఈ వాక్యం హక్కుదారులు హైదరాబాదు దూరదర్శన్ వారికి కృతజ్జ్ఞతలు తెలియచేసుకుంటూ, నా బ్లాగు లో ఈ దీర్ఘమైన విరామానికి క్షమాపణలు చెప్పుకుంటున్నా.
ఖాళీ దొరకనందువల్ల చాలా రోజులుగా ఏమీ రాయలేదు.దీనినే బద్ధకం అని కూడా అంటారని తెలిసిన వాళ్ళు కొందరు అంటూ ఉంటారు. నేను దాన్ని పట్టించుకోను.అసలు బద్ధకం అనేది మానసికమైన విషయమని, శారీరికమైనది కాదని నా అభిప్రాయం.దీన్ని గురించి ఖాళీ దొరికినప్పుడెప్పుడైనా రాస్తాను.
అసలు ఏదైనా రాయాలంటే అల్లాటప్పా విషయం కాదు. పెద్దనగారంతటి ఆయనే “నిరుపహతి స్తలము…” అంటూ మొదలెట్టి చంపకమాలడు విషయాలు కావాలన్నారు. నాలాంటి వాడికి ఇంక చెప్పేదేముంది.
వీవెన్ గారి పుణ్యమాని ఎక్కడెక్కడ బ్లాగులూ చదవడం కుదురుతోంది.అసలు ఉన్న సమయం అంతా దానికే సరిపోతోంది.ఎంతైనా చదివేవాడికి రాసేవాడు లోకువ…:)