“శ్రవణయంత్ర శాలల్లో శాస్త్రీయ సంగీతం లాగ…” అని మహాకవి వెక్కిరిస్తే వెక్కిరించాడు కానీ, ఆ ఆకాశవాణే కనక పోషించి ఉండకపోతే మన తెలుగునాట సంగీతమూ సంస్కృతీ ఈ మాత్రం కూడా నిలబడి ఉండే కావు అని నాకు అనిపిస్తుంది. ఐనా ఆ మాటకొస్తే భారతీయ సంగీతపు లోతులు తెలిసిన వాళ్ళకి దాని ముందు ఈ రేడియోలాంటివి ఏ మాత్రం గొప్ప అద్భుతాలు అనిపించక మానదు. ఈ విషయంలో ఎవరికైనా సందేహాలుంటే నాగరాజు మేస్టారుని సంప్రదించండి. అసలు అయనే ఒక వ్యాసం రాస్తే అందరికీ ఉపయోగమని నా అభిప్రాయమూ, రాయమని ప్రార్ధనాను. (more…)
అక్టోబర్ 21, 2007
అక్టోబర్ 19, 2007
గురుదక్షిణగా…
గురువుగారి అభివృద్ధి కోరుకోవడమే నిజమైన గురుదక్షిణ అని పెద్దలు చెప్పగా విన్నాను. అంత కన్నా వేరే ఇవ్వగలిగేది కూడా ఏమీ లేదనుకోండి.
రేపు తమ భరతనాట్య కౌశలాన్ని మిషిగన్ నగరంలో ప్రదర్సించబోతున్న కొత్తపాళీ గురువు గారికి శుభాభినందనలు! మీ ప్రదర్శన దిగ్విజయం కావాలని కోరుకుంటున్నాను.