కొంతమందికి పెళ్ళికాక సమస్య. చాలా మందికి పెళ్ళయ్యాకా ప్రతీదీ సమస్యే. మరి పెళ్ళివల్ల సమస్య తీరడం ఏమిటి అంటారా, నేను చెప్పేది లోకకళ్యాణం కోసం జరిగిన పెళ్ళిగురించి. అదే సీతారామకళ్యాణం. (more…)
సెప్టెంబర్ 26, 2007
సెప్టెంబర్ 19, 2007
హేపీ డేస్ – పాటల పరిచయం
తెలుగునాట మిగిలిన ఏకైక కళ సినిమా అంటూ వాపోయాడు రాకేశ్వరుడు ఈమధ్యే. ఐతే, ఈ సినిమా అనేది 64 కళల సమ్మేళనం అన్న విషయం తెలియని వాళ్ళందరూ సినిమాలు తీస్తుండడమే పెద్ద సమస్య అనిపిస్తుంది నాకు. తెలుగుసినిమా ప్రపంచంలో ప్రస్తుతం ఈ విషయాన్ని కాస్త వంటబట్టించుకున్నది శేఖర్ కమ్ముల అనిపిస్తుంది. సినిమాకి సంబంధించిన వేరే విషయాల గురించి నాకు పెద్దగా తెలియదు కానీ, సంగీతం విషయంలో మాత్రం తన ఉత్తమ అభిరుచిని శేఖర్ తన సినిమాల ద్వారా ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆనంద్, గోదావరి – ఈ రెండు సినిమాలకీ సంగీతం అందించిన రాధాకృష్ణన్ శాస్త్రీయంగా సంగీతం నేర్చుకున్నవాడు. భారతీయ సంగీతం ఆధారంగా శాస్త్రీయ సంగీతపు రాగాలని వాడి మంచి సంగీతం అందించాడు. (more…)
సెప్టెంబర్ 15, 2007
వానపాటులు
మొన్న రాత్రి మా ఊళ్ళో ఎడతెగని వర్షం. నేను ఇంటికి చేరుకున్నాకే మొదలవ్వడంతో నేను చాలా ఆస్వాదించాను. చదువరిగారు చెప్పినట్టు చీమచతురత చూసి కాదులెండి. నాకిష్టమైన వానపాటని గుర్తు చేసుకుంటూ. (more…)
సెప్టెంబర్ 5, 2007
అనానిమాసురుని ఆంతర్యమేమిటి?
గత నాలుగు సంవత్సరాలుగా భారతదేశంలో ఉగ్రవాదుల విధ్వంసాలు పదికన్నా ఎక్కువే జరిగాయి. ఇదివరకటిలా ఏ ఉగ్రవాదసంస్థా మేమే చేసామంటూ ప్రకటించటంలేదు. అసలు ఎందుకు చేస్తున్నారో కూడా తెలీదు. మతకలహాలు రేపడమే ప్రధాన ఉద్దేశం అనడానికి ఆధారం లేదు. ఎందుకంటే వారణాసిలో బాంబు పేలినప్పుడూ హైదరాబాదులో పేలినప్పుడూ కూడా ఎప్పుడూ మనదేశంలో మతకలహాలు చెలరేగలేదు. ఐనా ఎందుకు చేస్తున్నట్టు? (more…)
సెప్టెంబర్ 3, 2007
మధురాధిపతే రఖిల మధురం…
కరారవిందేన పదారవిందం
ముఖారవిందే వినివేశయంతం
వటస్య పత్రస్య పుటేశయానం
బాలం ముకుందం మనసాస్మరామి|| (more…)