సంగతులూ,సందర్భాలూ….

ఫిబ్రవరి 9, 2008

నవతరంగంలో సంగీతం

Filed under: కబుర్లు,ప్రకటనలు,సంగీతం — Sriram @ 4:15 సా.

నవతరంగంలో (సినిమా)సంగీతానికి సంబంధించిన మొదటి వ్యాసం. నా మొదటివ్యాసం కూడా.

ప్రకటనలు

జనవరి 26, 2008

ఏమి కృతజ్ఞత!

Filed under: కబుర్లు — Sriram @ 12:45 ఉద.

రాజ్‌దీప్ సర్దేసాయ్ కి పద్మశ్రీ.
గుజరాత్ లో కనక నెగ్గి ఉంటే ఏకంగా భారతరత్నే ఇచ్చి ఉండేవారేమో! ఏమైతేనేం ఆంగ్ల మాధ్యమాల వాళ్ళు కాంగ్రెస్ కి చేసిన సాయం ఊరికే పోలేదు.

జనవరి 23, 2008

కోతుల్ని కొనే వాళ్ళుంటారు జాగ్రత్త!

Filed under: కబుర్లు,తోటి బ్లాగర్లు — Sriram @ 2:31 సా.

షేర్ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాల గురించి.
ఐనా ఇదేమైనా కొత్తగనకనా!
ఎంత తెలిసినా ఆశ చెడ్డది.

జనవరి 21, 2008

అంతా మాయ!

Filed under: కబుర్లు — Sriram @ 11:02 సా.

ఇది చెబుతున్నది ఏ అద్వైతపు వేదాంతో కాదు. సాక్షాత్తూ శాస్త్రవేత్తలేట! ఈ “మహా మేధ” సిద్ధాంతం వినగానే నాక్కూడా “అన్నీ మన వేదాల్లోనే ఉన్నాయిష” అనాలనిపించింది.

మనవాళ్ళు ఎంతైనా అఖండులు!

అక్టోబర్ 21, 2007

శ్రవణయంత్ర శాలల్లో శాస్త్రీయ సంగీతం…

Filed under: కబుర్లు,సంగీతం — Sriram @ 11:23 సా.

శ్రవణయంత్ర శాలల్లో శాస్త్రీయ సంగీతం లాగ…” అని మహాకవి వెక్కిరిస్తే వెక్కిరించాడు కానీ, ఆ ఆకాశవాణే కనక పోషించి ఉండకపోతే మన తెలుగునాట సంగీతమూ సంస్కృతీ ఈ మాత్రం కూడా నిలబడి ఉండే కావు అని నాకు అనిపిస్తుంది. ఐనా ఆ మాటకొస్తే భారతీయ సంగీతపు లోతులు తెలిసిన వాళ్ళకి దాని ముందు ఈ రేడియోలాంటివి ఏ మాత్రం గొప్ప అద్భుతాలు అనిపించక మానదు. ఈ విషయంలో ఎవరికైనా సందేహాలుంటే నాగరాజు మేస్టారుని సంప్రదించండి. అసలు అయనే ఒక వ్యాసం రాస్తే అందరికీ ఉపయోగమని నా అభిప్రాయమూ, రాయమని ప్రార్ధనాను. (more…)

« గత పేజీతర్వాత పేజీ »