నవతరంగంలో (సినిమా)సంగీతానికి సంబంధించిన మొదటి వ్యాసం. నా మొదటివ్యాసం కూడా.
ఫిబ్రవరి 9, 2008
అక్టోబర్ 19, 2007
గురుదక్షిణగా…
గురువుగారి అభివృద్ధి కోరుకోవడమే నిజమైన గురుదక్షిణ అని పెద్దలు చెప్పగా విన్నాను. అంత కన్నా వేరే ఇవ్వగలిగేది కూడా ఏమీ లేదనుకోండి.
రేపు తమ భరతనాట్య కౌశలాన్ని మిషిగన్ నగరంలో ప్రదర్సించబోతున్న కొత్తపాళీ గురువు గారికి శుభాభినందనలు! మీ ప్రదర్శన దిగ్విజయం కావాలని కోరుకుంటున్నాను.
సెప్టెంబర్ 3, 2007
మధురాధిపతే రఖిల మధురం…
కరారవిందేన పదారవిందం
ముఖారవిందే వినివేశయంతం
వటస్య పత్రస్య పుటేశయానం
బాలం ముకుందం మనసాస్మరామి|| (more…)
సెప్టెంబర్ 13, 2006
అంతరాయానికి చింతిస్తున్నాం!
ఏంటెన్నాలు, బూస్టర్లు పెట్టుకుని టీవీ చూసిన తెలుగు వారందరికీ ఈ వాక్యం సుపరిచితం. ఈ వాక్యం హక్కుదారులు హైదరాబాదు దూరదర్శన్ వారికి కృతజ్జ్ఞతలు తెలియచేసుకుంటూ, నా బ్లాగు లో ఈ దీర్ఘమైన విరామానికి క్షమాపణలు చెప్పుకుంటున్నా.
ఖాళీ దొరకనందువల్ల చాలా రోజులుగా ఏమీ రాయలేదు.దీనినే బద్ధకం అని కూడా అంటారని తెలిసిన వాళ్ళు కొందరు అంటూ ఉంటారు. నేను దాన్ని పట్టించుకోను.అసలు బద్ధకం అనేది మానసికమైన విషయమని, శారీరికమైనది కాదని నా అభిప్రాయం.దీన్ని గురించి ఖాళీ దొరికినప్పుడెప్పుడైనా రాస్తాను.
అసలు ఏదైనా రాయాలంటే అల్లాటప్పా విషయం కాదు. పెద్దనగారంతటి ఆయనే “నిరుపహతి స్తలము…” అంటూ మొదలెట్టి చంపకమాలడు విషయాలు కావాలన్నారు. నాలాంటి వాడికి ఇంక చెప్పేదేముంది.
వీవెన్ గారి పుణ్యమాని ఎక్కడెక్కడ బ్లాగులూ చదవడం కుదురుతోంది.అసలు ఉన్న సమయం అంతా దానికే సరిపోతోంది.ఎంతైనా చదివేవాడికి రాసేవాడు లోకువ…:)
జూన్ 30, 2006
శ్రీ మహాగణాధిపతయే నమః!
తెలుగులో ఇదే నా తొలి బ్లాగు. ఎన్నాళ్ళనుంచో అనుకుంటున్నా ఇప్పటికి కాని కుదరలేదు.ముఖ్యంగా తెలుగు సాహిత్యానికి సంబంధించిన విషయాలు, నేను చిన్నప్పుడు విన్నవి, పుస్తకాల్లో చదివినవి ఇక్కడ నలుగురితో పంచుకోవాలని నా ప్రయత్నం. ఇంకా ఎప్పుడు ఏమి తోస్తే అది గిలుకుతూ ఉంటాననుకోండి. సమయం దొరికినపుడు వచ్చి వెళ్తుండండి…