సంగతులూ,సందర్భాలూ….

జూలై 8, 2010

ఎందరో మహానుభావులు….

Filed under: కబుర్లు,సంగీతం — Sriram @ 1:06 ఉద.

శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి తో పరిచయం, సాక్షిటీవీలో:
మొదటి భాగం

రెండవ భాగం

వయసుమీదపడినా తాను యవ్వనంలోనే ఉంటానన్నమాట ఆయన సంగీతానికి తప్పకుండా వర్తిస్తుంది కానీ, పెద్దవయసు వల్ల వచ్చే చాదస్తం వల్ల ఆత్మవిశ్వాసం స్వోత్కర్షగా మారడం ఆయన మాటలలో తప్పకుండా కనిపించింది. ఏమైనా, ఆయన మాటలు వినడం భలే సరదాగా ఉంటుంది. ఇరవైరెండువేల కచేరీల తరవాత కూడా ఆ గొంతులో మాధుర్యం ఎక్కడా తగ్గకపోవడం నన్ను అబ్బురపరుస్తూ ఉంటుంది. ఆయన నిజంగా కారణజన్ముడు.

గాయకుడిగా రావలసినంత పేరు వచ్చినా, అయన కృతులు మాత్రం ఇంకా ప్రచారం పొందవలసినవి అని మాత్రం అనిపించింది. కర్ణాటక సంగీత ప్రపంచంలో ఆయనకి ఎక్కువమంది మిత్రులు లేకపోవడం, ఆయనస్థాయికి తగిన విధంలో శిష్యులని తయారు చేయకపోవడం కారణాలు కావచ్చు. తెలుగువాడిగా పుట్టడం కూడా. ఐతే ఈ మధ్య కేరళ రాజవంశీయులు రామవర్మగారు ఆయన బాణీని బాగా ప్రచారం చేస్తున్నారు. మంచి గాయకులూ, వీణ విద్వాంసులు ఐన ఈయన యూట్యూబు ద్వారా కూడా బాలమురళీగారి సంగీతాన్ని, కొన్ని అరుదైన వీడియోలనూ అందరికీ అందిస్తున్నారు.

ప్రకటనలు

4 వ్యాఖ్యలు »

  1. ఓహ్ లింకులిచ్చినందుకు చాలా థాంక్సండీ. నేనూ నిన్ననే బాలమురళీ గారితో నాకున్న కొన్ని అనుభవాలు రాసాను, వీలైతే చూడండి.
    http://vivaha-bhojanambu.blogspot.com/2010/07/m.html

    వ్యాఖ్య ద్వారా సౌమ్య — జూలై 8, 2010 @ 9:14 ఉద. | స్పందించండి

  2. Mangalampalli Confidence is highlight. Comments over them are not very good. We still believe that still he is young by heart and mind.No contradictions on it. I remeber one sanskrit sloka:- “Jayanti te sukruti no rasasiddhaaha sukaveeshwaraaha| naasti tesham yashaha kaayam amangalam”. Means great people will never perish and their body of fame is always young and alive.This is applicable to “Sri Mangalmpalli BalaMurali Krishna”. OK

    K. Nageswara Prasad,
    POWERGRID.
    GURGAON.9650293187

    వ్యాఖ్య ద్వారా KOTA NAGESWARA PRASAD — జనవరి 8, 2013 @ 6:52 సా. | స్పందించండి

  3. మంచి విషయాలు చెప్పారు.
    ‘కుమారుని వలెనూ కావవే గిరికుమారీ సుకుమారీ ‘ అన్న ఒక అద్భుత మైన కృతిని ఆయన పద్నాలుగేళ్ల వయసులో రాశారట. దాన్ని రామ వర్మ గారు ఒక వర్క్ షాప్ లో నేర్పగా విన్నాను. కూర్చిన రాగం హృద్యమైనది.

    వ్యాఖ్య ద్వారా వానా — నవంబర్ 27, 2014 @ 12:36 సా. | స్పందించండి

  4. nice article
    hi
    We started our new youtube channel : Garam chai . Please subscribe and support
    https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg

    వ్యాఖ్య ద్వారా kiran — జనవరి 3, 2017 @ 4:02 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: