సంగతులూ,సందర్భాలూ….

మార్చి 6, 2010

ఆపాతమధురం…4(రీతిగౌళ రీతులు)

చా…లా రోజుల తర్వాత ఆమధ్య కూడలివైపు రాగానే “తెలుగు అభిమాని” గారి టపా కనపడింది. ఆయన అన్నట్టు, ఔను! రీతిగౌళ లో ఏదో లాక్కొచ్చే మాయ ఉంది! పండితపామరులనందరినీ కట్టిపడేసే శక్తీ ఉంది. అందుకే అలనాటి ఘంటసాల నుంచి ఈనాటి రహ్మాన్ వరకూ అన్నితరాల సంగీత దర్శకులనీ తన మాధుర్యంతో ముగ్ధుల్ని చేసి తన అందాలకి కొత్త నగిషీలు చెక్కించుకుంటూనే ఉంది.

నాకు తెలిసి సినిమా పాటల్లో ఈ రాగంలో వచ్చిన మొదటి పాట ఘంటసాల గారు స్వయంగా నటించి, తన ప్రియదైవానికి భక్తిగా సమర్పించుకున్న “శేషశైలావాస శ్రీవేంకటేశా…”.

“శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు….” అన్న చరణపు పాదంలోనే ఈ పాటమొత్తం అందం ఉంది అనిపిస్తుంది నాకు. అమితమైన చనువు, అంతకుమించిన ప్రేమ వీటికి తోడు కాస్త చిలిపితనం – వీటన్నింటిని కలిపి పలికించడానికి రీతిగౌళకి మించిన రాగం లేదనే కాబోలు ఘంటసాలగారు ఈ రాగంలో స్వరపరచారు. మధ్య మధ్యలో వినిపిచే జలతరంగంలాంటి వాయిద్యం చాలా హృద్యంగా ఉంటుంది ఇందులో. ఈ పాటని స్వరపరిచిన విధానం రీతిగౌళరాగంలోని సుబ్బరాయశాస్త్రి గారి ప్రసిద్ధ కీర్తన “జననీ నిన్నువినా దిక్కెవరమ్మా….” కి చాలా దగ్గరగా ఉంటుంది అనిపిస్తుంది నాకు.

ఐతే ఘంటసాలగారు ఈ రాగంలో ఇంకే పాటలూ చేసినట్టు లేదు. దానికి కారణం బహుశా ఈ రాగంలో వైవిధ్యం చూపించడం కష్టమని కావచ్చు. కానీ సంగీతంలో ఇళయరాజాకి అసాధ్యమంటూ ఉండదు కదా! బాలు,ఇళయరాజాల ద్వయం ఈ రాగంలో చూపించిన అందాలు అద్వితీయం అని చెప్పచ్చు. స్వాతిముత్యం చిత్రంలోని “రామా కనవేమిరా….” అన్న పాటతో జరిపించిన సీతాస్వయంవరం ఎంత అందమైనది!

అయితే, స్వచ్చమైన రీతిగౌళలో ఒక కీర్తనలాగ స్వరపరచిన ఈ కింది తమిళపాట ఒక ఆణిముత్యం. అన్నట్టు సుమలతతో పాటు ఇందులో నటించినది కుర్రవయసులో ఉన్న రఘువరన్‌ట!

మరి ఇళయరాజా స్వరానికి మంగళంపల్లి వారే పాడితే!

ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి, రీతిగౌళ అనగానే నాకు గుర్తొచ్చేది రహ్మాన్ స్వరపరిచిన “అందాల రాక్షసివే …” అన్నపాటే. బహుశా అది మాతరం పాట అవ్వడం వల్ల కావచ్చు. మురళీగానానికి ఘట వాయిద్యాన్ని జోడించి ప్రారంభించి అద్భుతమైన వాయిద్యమేళనంతో మనసుని మైమరిపించే వింటేజ్ రహ్మాన్ బాణీ ఇది. “చిలకా! రామచిలకా…..” – బాలూకి వందనాలు!

అలాగే, బహుశా ప్రస్తుత కాలేజీ విద్యార్ధులకి అనంతపురం చిత్రంలోని ఈ పాటే ఎక్కువగా నచ్చుతుందేమో!నాకు మాత్రం ఈ పాటలో ఏదో కాస్త లోపం ఉందనిపిస్తుంది… 🙂

కర్ణాటక సంగీతంలోని రక్తిరాగాలలో రీతిగౌళ ముందువరసలోని రాగం. నాకు తెలిసి హిందుస్తానీ సంగీతంలో సమాన లక్షణాలున్న రాగం లేదు. ఈ రాగ ఆరోహణ, అవరోహణలు:

స గ రి గ మ ని ద మ ని ని స
స ని ద మ గ మ ప మ గ రి స

చూసారా ఎన్ని వంకరలున్నాయో! ఈ వక్రాలే ఈ రాగానికి అందం. ముఖ్యంగా “ని ని స”, “ని ద మ ని ని స” వంటి ప్రయోగాలు ఈ రాగాన్ని ఇట్టే కనిపెట్టగలిగేలా చేస్తాయి. ఒక్కసారి “చిలకా! రామచిలకా” విని చూడండి మళ్ళీ.
శాస్త్రీయ సంగీతంలో ఈ రాగాన్ని బాగా ప్రాముఖ్యంలోకి తెచ్చింది త్యాగరాజస్వామేనని చెప్పాలి. నన్ను విడచి కదలకురా, ద్వైతము సుఖమా…అద్వైతము సుఖమా, రాగరత్నమాలికచే….లాంటి అద్భుతమైన కీర్తనలెన్నో స్వరపరిచారు ఈ రాగంలో. పైన ఉదహరించిన సుబ్బరాయశాస్త్రి గారి కీర్తన కూడా చాలా ప్రాముఖ్యం పొందినదే. రీతిగౌళ రాగంలోని శాస్త్రీయ సంగీతాన్ని ఇక్కడ వినచ్చు.

*కొత్తవారికోసం:ఆపాతమధురం,  ఆపాతమధురం(కొనసాగింపు…),  శారదా….!,  ఆపాతమధురం – 3

12 వ్యాఖ్యలు »

 1. Very nice. సుమలత, రఘువరన్ పాట .. అంబుజం కృష్ణగారి కర్నాటక కృతి గురువాయూరప్పనేయప్పన్ బాణీకి నకలుగా ఉంది

  వ్యాఖ్య ద్వారా కొత్తపాళీ — మార్చి 6, 2010 @ 7:04 సా. | స్పందించండి

 2. Wonderful Blog! I dont know how I missed seeing this all this while. Thanks for giving such detailed description sir.

  వ్యాఖ్య ద్వారా Abhijnana — మార్చి 6, 2010 @ 9:24 సా. | స్పందించండి

 3. ఎన్నాళ్ళకెన్నాళ్ళకి! 🙂
  రాగాలు తెలీకపోయినా పాటలు ఎంజాయ్‌ చేశాను.

  వ్యాఖ్య ద్వారా teresa — మార్చి 6, 2010 @ 10:01 సా. | స్పందించండి

 4. తెలుగు సినిమాలో వచ్చిన పాటలు ఏ ఏ రాగాల్లో ఉన్నాయో, పరిశీలన చేసి, వాటన్నిటినీ ఓ బ్లాగ్గులో సమీకరించారు. అద్భుతమైన సంకలనం
  ఒకసారి చూడండి.

  http://www.astrojyoti.com/5_Siva_SNT/Raga_Index.htm

  వ్యాఖ్య ద్వారా భమిడిపాటి ఫణిబాబు — మార్చి 7, 2010 @ 10:04 ఉద. | స్పందించండి

 5. Nice!!!
  Welcome back Sriram garu!
  Hope to see more such posts from u!!

  వ్యాఖ్య ద్వారా Sowmya V.B. — మార్చి 10, 2010 @ 7:34 ఉద. | స్పందించండి

 6. అంటే, నాకేదో ’సాపాసా’లు అర్థమౌతాయనుకునేరు. మీబోటి వారి సావాసాలు పర్లేదు కానీ, సాపాసాలు కష్టమే.. 😉 పాటలు మాత్రం బాగున్నాయి..అని చెప్తున్నా, అంతే!!

  వ్యాఖ్య ద్వారా Sowmya V.B. — మార్చి 10, 2010 @ 7:48 ఉద. | స్పందించండి

 7. కొ.పా గారూ, అభిజ్ఞాన గారూ, తెరెసా గారూ….నచ్చినందుకు ధన్యవాదాలు.
  ఫణిబాబు గారూ…చాలా మంచి సమాచారం పంచుకున్నందుకు ధన్యవాదాలు.
  సౌమ్య గారూ…ధన్యవాదాలు.అర్ధమవడం పెద్దకష్టమేమీ కాదు. ప్రయత్నించడమే ఆలస్యం.

  వ్యాఖ్య ద్వారా Sriram — మార్చి 11, 2010 @ 3:19 సా. | స్పందించండి

 8. శ్రీరామ్ గారు. నెనర్లు . more of them for తలయై కునియుం. మీ నుంచి తరచుగా టపాలు రావాలని నా విన్నపం.

  వ్యాఖ్య ద్వారా తెలుగు అభిమాని — మార్చి 12, 2010 @ 11:53 సా. | స్పందించండి

 9. Welcome back sriram….pls do write more posts

  వ్యాఖ్య ద్వారా Deepthi — మార్చి 18, 2010 @ 2:44 సా. | స్పందించండి

 10. Hi Sriram, Nice to see you back with a bang. Most of them are my favorites especially the Tyagaraja kritis you mentioned, although I did not knew about the technicalities involved in them. Nice post here.Keep posting.
  Cheers
  JOSH

  వ్యాఖ్య ద్వారా JOSH — మార్చి 19, 2010 @ 2:31 ఉద. | స్పందించండి

 11. “గ మ ని ద మ ని ని సా” , “గ మ ప మ గ “రీమ గ గా గ సా” కూడ ఈ రాగానికి ప్రత్యేకతలు
  ఇంకా వున్నాయి “బృందావన నిలయే రాధే” , “చేర రావదే మిరా” లాంటి మధురాను కీర్తనలు వున్నాయి.
  చాల బాగుంది మీ పొస్త్

  వ్యాఖ్య ద్వారా phanibala — జూన్ 11, 2010 @ 2:54 సా. | స్పందించండి

 12. ధన్యవాదాలు ఫణిబాలగారు!

  వ్యాఖ్య ద్వారా Sriram — జూలై 8, 2010 @ 1:11 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: