సంగతులూ,సందర్భాలూ….

సెప్టెంబర్ 19, 2007

హేపీ డేస్ – పాటల పరిచయం

తెలుగునాట మిగిలిన ఏకైక కళ సినిమా అంటూ వాపోయాడు రాకేశ్వరుడు ఈమధ్యే. ఐతే, ఈ సినిమా అనేది 64 కళల సమ్మేళనం అన్న విషయం తెలియని వాళ్ళందరూ సినిమాలు తీస్తుండడమే పెద్ద సమస్య అనిపిస్తుంది నాకు. తెలుగుసినిమా ప్రపంచంలో ప్రస్తుతం ఈ విషయాన్ని కాస్త వంటబట్టించుకున్నది శేఖర్ కమ్ముల అనిపిస్తుంది. సినిమాకి సంబంధించిన వేరే విషయాల గురించి నాకు పెద్దగా తెలియదు కానీ, సంగీతం విషయంలో మాత్రం తన ఉత్తమ అభిరుచిని శేఖర్ తన సినిమాల ద్వారా ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆనంద్, గోదావరి – ఈ రెండు సినిమాలకీ సంగీతం అందించిన రాధాకృష్ణన్ శాస్త్రీయంగా సంగీతం నేర్చుకున్నవాడు. భారతీయ సంగీతం ఆధారంగా శాస్త్రీయ సంగీతపు రాగాలని వాడి మంచి సంగీతం అందించాడు.

శేఖర్ కొత్త సినిమా “హేపీ డేస్”కి కొత్త సంగీత దర్శకుడిని ఎంపిక చేసుకున్నాడని వినగానే నాకు కాస్త ఆసక్తి పెరిగింది. మిక్కీ జే మేయర్ అనే ఇతను కూడా శాస్త్రీయంగా సంగీతాన్ని నేర్చుకున్నవాడే. చిన్నప్పుడు కర్ణాటక సంగీతం, తర్వాత ట్రినిటీ కళాశాలలో పాశ్చాత్య సంగీతం నేర్చుకున్నాడని చదివాను. దానితో ఈ చిత్రపు సంగీతంపై మరింత ఆసక్తి పెరిగింది.

ఈ చిత్రపు పాటలు విడుదలైన వెంటనే విన్నాను. మొత్తం మీద 6 పాటలూ,1 శ్లోకమూ ఉన్నాయి ఇందులో. రెండుపాటలు వేటూరీ, మూడుపాటలు వనమాలీ రాయగా ఒకటి వెంకటేష్ పట్వారి అనే ఆయన రాసారు.

అరెరే అరెరే మనసే జారే: నాకు అన్నిటిలోనూ బాగా నచ్చిన పాట ఇది. మాధుర్య ప్రధానమైన చక్కని బాణీ. సాహిత్యం స్పష్టంగా వినిపించేలా వాయిద్యాల నియంత్రణ. గిటార్ నాదాల సొగసులకి మధ్యమధ్యలో భారతీయ సంగీత  సొబగులనద్దిన సంగీతం. ఈ పాటకి ముఖ్య ఆకర్షణ యువగాయకుడు కార్తీక్ గొంతు. శ్రావ్యమైన గాత్రం ఇతని సొంతం. కాకపోతే “స్మరణే” అనడానికి “స్మరనే” అని పలకడం వంటివి అక్కడక్కడా కొద్దిగా బాధిస్తాయి. వనమాలి రాసిన సాహిత్యం పర్వాలేదు. బాణీకి తగినట్టుగా అంత్య ప్రాసలతో మరీ ఎబ్బెట్టుగా లేకుండా అందించాడు. “చిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే” వంటి నాకు అర్ధంకాని ఉపమానాలున్నాయి కానీ మొత్తం మీద అర్ధవంతమైన సాహిత్యం. 

జిల్ జిల్ జింగా: ఇదే పల్లవితో రెండు పాటలున్నాయి. ఒకటి వేటూరి రాయగా ఇంకొకటి వెంకటేష్ పట్వారి రాసారు. నేటి కాలేజీ విద్యార్ధుల జీవన విధానాన్ని వర్ణిస్తూ కుర్రకారుని ఆకట్టుకునేలా రాసిన సాహిత్యం. “బస్సులకై వెయిటింగూ, బస్టాపులో చాటింగూ” అంటూ తెలుగు పదాలూ ఇంగ్లీషు పదాలు కలిపి రాసారు. ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన “యువ” సినిమాలోని “ఢక్కా లగా బుక్కా” అన్నపాటని బాగా గుర్తుకు తెస్తుంది ఈ పాట బాణీ. రంగ్ దే బసంతి సినిమాతో వెలుగులోకి వచ్చిన నరేష్ అయ్యర్ తో పాటు మిక్కీ మేయర్ కూడా గొంతు కలిపాడు. వినడానికి పర్వాలేదు.

ఓ మై ఫ్రెండ్: స్నేహంయొక్క గొప్పతనాన్ని గురించిన ఈ పాటని కార్తీక్ చాలా బాగా పాడాడు. మిక్కీ అందించిన సంగీతం కూడా బాగుంది కానీ ఏ ఆర్ రెహ్మాన్ పాటలని మళ్ళీ గుర్తు చేస్తుంది. ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. వనమాలి సాహిత్యం అద్భుతంగాలేకపోయినా అందంగా ఉంది. కాకపోతే ఒక చోట “మొదలో తుదలో తెలియకుందే” అనడం నిరాశపరిచింది. “మొదలో తుదయో” అనాల్సిన చోట ప్రాసకోసం “మొదలో తుదలో” అని వాడడం ఏ మాత్రం సమంజసం?

వీడుకోలే: రాక్ సంగీతపు శైలిలో ఉన్న ఈపాట వేటూరి రాసారు. ఫేర్‌వెల్ బ్లూస్ ని గుర్తుచేస్తుందీ పాట. హర్షిక, మిక్కీ పాడిన ఈ పాట మళ్ళీ వినాలనిపించే పాటే. బహుశః ఈ చిత్రానికి టైటిల్ సాంగ్ అయ్యుండచ్చు ఇది. మిక్కీ అందించిన బాణీ నాకు బాగా నచ్చింది.

ఏ చీకటీ: రంజిత్, సునీత సారధీ  పాడిన ఈ పాట గురించి పెద్దగా చెప్పుకోవల్సిందేమీ లేదు. వనమాలి సాహిత్యం. డిస్కోథెక్ లలో సాధారణంగా వినిపించే పాటల శైలిలో ఉంది. వినడానికి పర్వాలేదు.

యాకుందేందు: కాలేజీ నేపధ్యంలో సినిమా అనగానే వెకిలితనాన్ని పరాకాష్టకి తీసుకెళ్తున్న ఈ రోజుల్లో ఒక “యూత్ ఫిల్మ్” లో సరస్వతీ ప్రార్ధనని వినిపించినందుకు శేఖర్ అభినందనీయుడే. ప్రణవి అనే అమ్మాయి పాడింది. ఈ గాయనికి అద్భుతమైన గాత్రం ఉంది. ఉఛ్ఛారణకూడా స్పష్టంగా ఉంది. ముందు ముందు ఇంకా మంచి అవకాశాలు వస్తే బాగుంటుంది. ఐతే మిక్కీ అందించిన సంగీతం నాకు అంత తృప్తినివ్వలేదు. మరింత అందంగా పాడించవచ్చు అనిపించింది. దానికితోడు “యా వీణావరదండమండిత కరాం” అన్న సమాసాన్ని “యా వీణాం, వరదండమండితకరాం” అంటూ రెండుగా చీల్చి పాడించడంతో భావం కూడా దెబ్బతింది.

మొత్తంమీద “హేపీ డేస్” సంగీతం బానే ఉందని చెప్పాలి, ప్రస్తుతం వస్తున్న చిత్రాలతో పోలిస్తే. మాధుర్యప్రధానమైన సంగీతం, సాహిత్యం వినిపించే పాటలతో శేఖర్ కమ్ముల ప్రభావం స్పష్టంగా కనపడుతోంది. మిక్కీ జే మేయర్ కి మంచి అవకాశాలు వస్తాయనే అనిపిస్తోంది. ఈయన రెహ్మాన్ సంగీతాన్ని కొద్ది రోజుల పాటు వినడం మానెయ్యాలని నా ఉచితసలహా!    

ప్రకటనలు

17 వ్యాఖ్యలు »

 1. hi..nice review..i am listening to the songs daily too… not excellent music..but good one..my fav is arey re too! somehow i like anand music better.
  nice post.

  వ్యాఖ్య ద్వారా josh — సెప్టెంబర్ 19, 2007 @ 12:54 ఉద. | స్పందించండి

 2. నమస్తే అన్నా! ఈ కాలంలో ఒక సినిమా ఆడియో రివ్యూ ఇంత బాగా ఎవ్వరూ రాయలేదనుకుంటా. సంగీతంతో పరిచయము, భాషపై కాసింత అవగాహన ఉన్నవాళ్ళు రివ్యూలు రాస్తే ఇలా ఉంటాయన్నమాట. బ్లాగులమ్మ పుణ్యమాని ఇవి సాధ్యమయ్యాయి. లేకపొతే ఆ శ్లోకం లో సమాసం విరిగిన సంగతీ అందువల్ల దాని భావం మారిపోయిన సంగతీ ప్రస్తావించే నాథుడెవడు?

  వ్యాఖ్య ద్వారా iamramuhere — సెప్టెంబర్ 19, 2007 @ 2:29 ఉద. | స్పందించండి

 3. విమర్శ బాగుంది. <> ఇది బాగా పట్టారు. వాద్యాల్లో దాదాపు కలిసిపోయింది ఆ ఒక్క అక్షరం.

  వ్యాఖ్య ద్వారా వికటకవి — సెప్టెంబర్ 19, 2007 @ 5:07 ఉద. | స్పందించండి

 4. ఇదొకటుందా. మధ్యలో పెట్టిన కామెంట్స్ ఎగిరిపోతాయని తెలియదు. నా ఉద్ధేశ్యం “స్మరణే అనడానికి స్మరనే” అన్నది బాగా పట్టారు.

  వ్యాఖ్య ద్వారా వికటకవి — సెప్టెంబర్ 19, 2007 @ 5:10 ఉద. | స్పందించండి

 5. హ్మ్మ్… అదే…ఈ సినిమా పాటలు వినడానికి బాగున్నాయి….హాయిగా వినొచ్చు… అనవసరపు బీట్లు, శబ్దాలు లేకుండా.. వినదగ్గవి గా అనిపించే లిరిక్స్ తో…. ఈ మధ్య ఈ మాత్రం వస్తున్న సినిమాలేవీ అసలు??

  వ్యాఖ్య ద్వారా vbsowmya — సెప్టెంబర్ 19, 2007 @ 7:29 ఉద. | స్పందించండి

 6. అవునండీ నేను ఈ సినిమా పాటలు విన్నాను.. మొదటిసారి విన్నప్పుడు అంత అనిపించలేదు.. కానీ తరువాత నుండీ బావున్నాయి అని అనిపించింది.. నేను మొదట్లో శేఖర్ కమ్ముల గారి సినిమా అంటే, రాధాకృష్ణగారు అనుకున్నాను.. తరువాత చూస్తే వేరే వాళ్ళు.. అయ్యో ఇదేంటి అనుకున్నాను కానీ ఎప్పటిలానే ఈ పాటలు బావున్నాయి.. ఐతే రాధాకృష్ణగారు సంగీతం అందించిన “చందమామ” పాటలు మాత్రం అంత బాలేదు..

  ఇక భాష విషయానికి వస్తే, సాధారణంగా, శేఖర్ కమ్ముల గారి సినిమాలలో కూడా(కేవలం పాటలలోనే కాదు), తెలుగు వచ్చీ రానట్లు మాట్లాడుతుంటారు… అలా ఎందుకో కారణం ఆయనకే తెలియాలి..

  వ్యాఖ్య ద్వారా మేధ — సెప్టెంబర్ 19, 2007 @ 9:10 ఉద. | స్పందించండి

 7. చాల బావుంది మీ రివ్యు ఆ పాటల్లానే…నాకు చాలా నచ్చాయి ఈ పాటలు

  వ్యాఖ్య ద్వారా deepthi — సెప్టెంబర్ 19, 2007 @ 9:22 ఉద. | స్పందించండి

 8. చాలా చక్కని రివ్యూ శ్రీరాం గారు …. ఏ మెగజీనో లోనో వెతకాల్సిన అవసరం తప్పింది… మీరు చెప్పినట్టుగా మిక్కీ జీ మేయర్ క్రొత్తవాడు కాదు.. ఇదివరకే ’10th క్లాస్’, ‘నోట్‌బుక్’ అనే సినిమాలకి సంగీతం అందించాడు.

  వ్యాఖ్య ద్వారా నంద — సెప్టెంబర్ 19, 2007 @ 12:00 సా. | స్పందించండి

 9. చాలా చక్కని రివ్యూ శ్రీరాం గారు …. ఏ మెగజీన్‌లోనో వెతకాల్సిన అవసరం తప్పింది… మీరు చెప్పినట్టుగా మిక్కీ జీ మేయర్ క్రొత్తవాడు కాదు.. ఇదివరకే ’10th క్లాస్’, ‘నోట్‌బుక్’ అనే సినిమాలకి సంగీతం అందించాడు.

  వ్యాఖ్య ద్వారా నంద — సెప్టెంబర్ 19, 2007 @ 12:01 సా. | స్పందించండి

 10. […] పాటల గురించి శ్రీరాం గారు రాసిన సమీక్షను చదవండి. శేఖర్ కొత్త సినిమా “హేపీ […]

  పింగ్ బ్యాక్ ద్వారా తెలుగు సినిమాకి హ్యాపీడేస్! | DesiPundit — సెప్టెంబర్ 19, 2007 @ 5:34 సా. | స్పందించండి

 11. Thanks Josh…Anand was a breathe of fresh air in all aspects and its music was no exception. KM radhakrishnan demonstrated the power of indian classical music with excellent tunes and reminded us of the forgotten way of making music, the indian way.

  రానారె, థేంకులు!

  వికటకవి గారు, మీరు ఆ గుర్తులు ఉపయోగిస్తే బ్రౌజరు హెచ్టీఎమ్మెల్ అనుకునుంటుంది పాపం. నచ్చినందుకు ధన్యవాదాలు.

  సౌమ్యగారూ, నిజమే!

  మేధగారూ, బహుశః ఆయన ఈరోజుల్లో హైదరాబాదులో ఆంగ్లమాధ్యమం జనాలు మాట్లాడే భాష వాడతారేమో. గోదావరి సినిమాలో బాగానే ఉంది అనిపించింది నాకు.

  దీప్తి గారూ, థేంక్స్!

  నంద గారూ, ధన్యవాదాలు. నేనన్నది శేఖర్కి మిక్కీ కొత్త అని. మీరు చెప్పిన సినిమాల పేర్లు నేనూ విన్నాను. పాటలు ఎలా ఉన్నాయో చూడాలి మరి.

  దేశిపండిట్లో ప్రకటించినందుకు వెంకట్గారికి కృతజ్ఞతలు!

  వ్యాఖ్య ద్వారా Sriram — సెప్టెంబర్ 19, 2007 @ 8:18 సా. | స్పందించండి

 12. నాకు కూడా “అరెరే అరెరే మనసే జారే” పాట బాగా నచ్చింది. రివ్యూలకు ఇది ఒక ఉదాహరణగా నిలువగలగేంత బాగుంది ఈ టపా… వావ్!

  వ్యాఖ్య ద్వారా నాగరాజా — సెప్టెంబర్ 19, 2007 @ 9:37 సా. | స్పందించండి

 13. రెండు పాటలే విన్నా ఇందులో…
  రివ్యూ బాగా చేసారు అంటాననుకున్నారా… లేదు చాలా బాగా చేసారు 🙂

  వ్యాఖ్య ద్వారా ప్రవీణ్ గార్లపాటి — సెప్టెంబర్ 19, 2007 @ 10:29 సా. | స్పందించండి

 14. nagaraja and praveen, thanks a lot 🙂

  వ్యాఖ్య ద్వారా Sriram — సెప్టెంబర్ 22, 2007 @ 10:10 ఉద. | స్పందించండి

 15. సినిమా నిన్నే చూశా! “రాజేష్” రోల్ అదుర్స్! నిఖిల్ డైలాగులు చెప్తుంటే హాలంతా గొల్లు గొల్లుమని నవ్వుతున్నారు. నా వెనక కుర్చున్న అమ్మాయైతే మధ్యలో గ్యాప్ కూడా ఇవ్వలేదు, నవ్వుతూనే ఉంది. నా సంగతి చెప్పక్కర్లేదు లెండి!

  ఇలాంటి కాలేజ్ సినిమాలో ఏమేమి ఉండాలో ఆ ఎలెమెంట్స్ అన్నీ కరెక్టుగా సద్దేశాడు “శేఖర్ కమ్ముల”. గత సంవత్సర కాలంలో ఇదే ఒకింత సరైన హిట్ movie.

  వ్యాఖ్య ద్వారా madhus — అక్టోబర్ 8, 2007 @ 8:30 సా. | స్పందించండి

 16. pATalu parvAledu anipinchAyi nAku. inkO mUDu nelallO marchipOtAnu.

  intakI nIku cinema elA nachchindO vrAyalEdu…mA college lO kada nAku nostalgic gAnE anipinchindi. good work by the director.

  వ్యాఖ్య ద్వారా Sirisha — అక్టోబర్ 13, 2007 @ 5:35 సా. | స్పందించండి

 17. cinema paravaledu bagane unnadi,kani college age lo students antha nemmadiga untara? college students antha alage unte chala baguntundi

  వ్యాఖ్య ద్వారా ramesh — నవంబర్ 2, 2007 @ 10:13 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: