సంగతులూ,సందర్భాలూ….

సెప్టెంబర్ 15, 2007

వానపాటులు

మొన్న రాత్రి మా ఊళ్ళో ఎడతెగని వర్షం. నేను ఇంటికి చేరుకున్నాకే మొదలవ్వడంతో నేను చాలా ఆస్వాదించాను. చదువరిగారు చెప్పినట్టు చీమచతురత  చూసి కాదులెండి. నాకిష్టమైన వానపాటని గుర్తు చేసుకుంటూ. 

ప్రపంచ చలనచిత్ర చరిత్ర లో భారతీయచిత్రాలకి మాత్రమే ప్రత్యేకమైన ఈ వానపాటల్లో, నాకు ఈ పాటలో నేను నటించి ఉంటే బాగుండును అని అనిపించిన పాట అది. ఏమిటీ? మీ దృష్టి ఎటుపోయిందీ? ఈ పాట అనుకుంటున్నారా? ఐతే మీరు ఇది చూడలేదన్నమాటే!   

సలీల్ చౌధురి ఖమాజ్ రాగంలో అద్భుతంగా కట్టిన బాణీ – లతా మంగేష్కర్ మధురమైన స్వరం – మనసుదోచుకునే పరిసరాలూ – ఇంటి చూరునుండీ,కొబ్బరాకుల నుండీ లయబద్ధంగా జారుతున్న నీరూ – పున్నమి వెన్నెలలో ముత్యాల్లా మెరిసిపోతున్న చినుకులూ – ఎదురింటి వరండాలో పున్నమి చంద్రుడి ప్రతిబింబంలాంటి ముఖంతో వెలిగిపోతున్న ఒక నాజూకైన మెరుపుతీగా – వాహ్! ఇంకేం చెప్పమంటారు పరఖ్ చిత్రంలోని  ఈ పాటలోని నాయకుడికున్న భోగాలు.

నేను కూడా యూట్యూబులో ఫుల్ వాల్యూమ్‌లో ఈ పాటపెట్టుకుని, కాసేపు మా ఇంటి బాల్కనీలో నిల్చుని, ఎదురుగుండా ఉన్న అపార్ట్మెంటు బాల్కనీలవైపు ఆశగా చూసి, దోమలు కుట్టడం తప్ప వేరే ఏమీ జరగకపోవడంతో లోపలికెళ్ళి పడుకున్నాను, మనం తడవని వాన కన్నా మధురమే లేదూ అని పాడుకుంటూ.

మర్నాడు పొద్దున్నే అదే ఊపులో హుషారుగా లేచి, “ఓ! సజ్‌నా” అంటూ చిన్నగా ఈలవేసుకుంటూ బయటకెళ్ళేసరికి ఇదీ పరిస్థితి.

14092007051

ప్రపంచప్రఖ్యాత బెంగళూరు సిల్క్‌బోర్డ్ ఫ్లయ్యోవరు వద్ద పరిస్థితి చూడగానే తలకెక్కిన మత్తు వదిలింది. వానమీద ఇంత భ్రాంతి పెంచిన సలీల్ చౌధురి మీద పీకలదాకా కోపం వచ్చింది. అన్నట్టు, ఫోటోలో ఉన్న కారు రవికిరణం గారిదని నా అనుమానం. 

ప్రకటనలు

13 వ్యాఖ్యలు »

 1. మీరిక్కడ టపాలో అక్షింతలు వెయ్యగానే నాకక్కడ తెలిసిపోయింది. వెంటనే పరుగెత్తుకొచ్చేసా!

  వ్యాఖ్య ద్వారా చదువరి — సెప్టెంబర్ 15, 2007 @ 5:41 సా. | స్పందించండి

 2. అక్షింతలంటారా! ఎంతమాట! 🙂

  వ్యాఖ్య ద్వారా Sriram — సెప్టెంబర్ 15, 2007 @ 6:03 సా. | స్పందించండి

 3. ఈ రోజు వినాయక చవితి కదా! నిదర లేవగానే టిప్-టిప్‌మనిపించావు. ఆ తరవాత ఖమాజ్ కూడా కలుషితమైనట్లుగా తోచింది. మొదటిదానికి కేవలం ఆడియో ఇచ్చి, రెండవదాన్ని దానిపక్కన నిలబెట్టాల్సింది. పాపపుణ్యాలు నీకే చెందుగాక! 🙂

  వ్యాఖ్య ద్వారా రానారె — సెప్టెంబర్ 15, 2007 @ 10:56 సా. | స్పందించండి

 4. శ్రీరాం గారు, చదువరి గారు,
  ముందుగా మీఇద్దరికీ శుభాభినందనలు. నిజానికి ఈనాడు వాళ్లకి చెప్పాలేమో, ఇప్పటికైనా గుర్తించినందుకు.

  చీమ చతురత తదితర టపాలతో పాటు గా మీ వానపాటలని ఆస్వాదించాను. ఇక వాన పాటుల్లో బెంగాలూరుది మొదటిస్థానము, భాగ్యనగరిది రెండోస్థానము అనుకుంటా.
  నాకో అనుమానం, మీరు ఈ టపా అచ్చొత్తే టప్పుడు, “ఈ పాట” “ఇది” ల లంకెలు తారుమారు గా ఇచ్చారేమో అని .. 🙂

  వ్యాఖ్య ద్వారా vookadampudu — సెప్టెంబర్ 15, 2007 @ 11:22 సా. | స్పందించండి

 5. రానారె, చవితి నాడు చూడకూడనిది చంద్రుడిని మాత్రమే! టిప్-టిప్ లు ఎప్పుడు చూసినా పాపపుణ్యాల ఖాతాలో తేడా ఏమీ ఉండదు 🙂

  ఊ.దం గారూ, ధన్యోస్మి! సౌతిండియాలో మోస్ట్ కరప్ట్ స్టేట్ అవార్డుకోసం పోటీ పడుతున్నాయి లెండి ఈ రెండూ.
  మీరు ఎంఛమాత్రం అనుమాన పడద్దు. నేనేమీ తికమక పడలేదు… 🙂

  వ్యాఖ్య ద్వారా Sriram — సెప్టెంబర్ 16, 2007 @ 11:18 సా. | స్పందించండి

 6. Youtube banned in my college! 😦

  వ్యాఖ్య ద్వారా vbsowmya — సెప్టెంబర్ 17, 2007 @ 10:48 సా. | స్పందించండి

 7. Hello… Youtube banned…but, I am able to download videos. 🙂
  “o sajhna” is nice. Thanks for introducing that.

  వ్యాఖ్య ద్వారా vbsowmya — సెప్టెంబర్ 19, 2007 @ 8:59 ఉద. | స్పందించండి

 8. ఎప్పుడో మరిచిపోయిన ఈ ఖమాజ్ పాటను మీద పడేసారు, కనీసం ఒక వారం పాటు నెత్తి మీద పాడుతూనే ఉంటుంది… చాలా థాంకులు…

  వ్యాఖ్య ద్వారా నాగరాజా — సెప్టెంబర్ 19, 2007 @ 10:11 ఉద. | స్పందించండి

 9. sowmya, am glad u could download and also liked it.

  nagraja garu, my pleasure.

  వ్యాఖ్య ద్వారా Sriram — సెప్టెంబర్ 19, 2007 @ 9:13 సా. | స్పందించండి

 10. […] గారి వానపాట్లు చదివి, రానారె గారి కరికో ను […]

  పింగ్ బ్యాక్ ద్వారా 24ఫ్రేములు, 64కళలు » వానపాటల్తో నా పాట్లు — సెప్టెంబర్ 20, 2007 @ 6:24 ఉద. | స్పందించండి

 11. శ్రీరాం గారు

  రాధిక గారి బ్లాగ్ లో చదివాను మీ వ్యాఖ్య..మీరేదో research చేస్తున్నారు.. చలంగారి పుస్తకాల గురించి అని.. మంచి అలోచన.. మీరు మీ research పూర్తి చేసినతరువాత.. కొంచం ఆ బ్లాగ్ లింక్ నాకు పోస్ట్ చేస్తే.. చలంగారి రచనలనై పునరావృతం చేసుకొనే సదవకాశాన్ని కలగజేసిన వారవుతారు…ముఖ్యంగా చలం గారి “ప్రేమలేఖలు”, “మైదానం” చాల బాగుంటాయండి..

  ధన్యవాదములతో..

  వ్యాఖ్య ద్వారా rama — సెప్టెంబర్ 21, 2007 @ 11:41 ఉద. | స్పందించండి

 12. రమగారూ, మీరు పొరబడ్డారు. ఆ వ్యాఖ్య రాసినది శ్రీధర్ గారు. నా పేరు శ్రీరామ్.

  రాధికగారి బ్లాగులో శ్రీధర్ గారి పేరు మీద నొక్కండి. మీకు లంకె దొరుకుతుంది.

  వ్యాఖ్య ద్వారా Sriram — సెప్టెంబర్ 21, 2007 @ 12:27 సా. | స్పందించండి

 13. నాకు మాత్రం వర్షం అంటే గుర్తు వచ్చే పాట ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే ,
  ‘జిందగీ భర్ నహీ బూలేంగే ఓ బరసాత్ కి రాత్ ఏక్ అంజాన్ హసీనాసే ములాకాత్ కి రాత్ ‘ (బర్సాత్ కి రాత్..,మధుబాలా , భరత్ భుషన్ )అవి వినండి.

  బాగుంది…మీ వర్షం పాటులు..అదే పాటలు…

  వ్యాఖ్య ద్వారా ragamanzari — మే 11, 2009 @ 9:35 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: