సంగతులూ,సందర్భాలూ….

సెప్టెంబర్ 2, 2007

క్రమాలంకారం కాళ్ళు మళ్ళీ పట్టుకుని…

తాంత్రిక శాస్త్రం చదువుకునే రోజుల్లో మా కళాశాల విద్యార్ధులందరికీ గౌతమ బుద్ధుడు ఆదర్శం. నిజమైన జ్ఞానం చెట్టుకిందే లభిస్తుందని గట్టిగా నమ్మేవాళ్ళం. అందుకే ఎక్కువ సమయం కళాశాల ఆవరణలో మా విభాగపు భవనానికి ఎదురుగా ఉన్న చెట్టుకింద గడిపేవాళ్ళం.

అలా చెట్టుకింద కూచుని జ్ఞానం కోసం ఎదురుచూసే రోజుల్లో మేము కాలక్షేపంకోసం చేసే పనుల్లో ముఖ్యమైనది Dumb Charades   (మూకాభినయం) అనే ఒక ఆట. దానికోసం ఎక్కడెక్కడ కష్టమైన సినిమాపేర్లూ వెతికి సంపాదించడం, వాటిని అమ్ములపొదిలో సిద్ధంగా ఉంచుకోడం మాకు అలవాటుగా ఉండేది. ఇప్పటికీ ఆ పేర్లు నాకు ఠకీమని గుర్తొస్తాయి ఎప్పుడు కావాలన్నా.

ఉదాహరణకి:  Butch Cassidy and the Sundance Kid ,  Schindlers List ఇలాగన్నమాట.

ఊకదంపుడు గారిని చూస్తే బహుశః వాళ్ళ కళాశాలలో చెట్టుకింద  సమస్యాపూరణం ఆటగా ఆడుకునేవారేమో అనిపిస్తుంది. ఎక్కడెక్కడి దుర్మార్గపు సమస్యలూ ఈయన దగ్గర సిద్ధంగా ఉంటాయి. ఒకటి అయ్యిందిరా అనుకుంటే వెంటనే ఇంకోటి పేల్చారు.
సమస్య చూడండి: “పూతన సీతకున్ సవతి; పూజలుసేయరె భక్తిశ్రద్ధలన్!” 

ఇలాంటి సమస్యనే ఇదివరకు ఒకసారి రాఘవ గారిస్తే నేను క్రమాలంకారం వాడి పూర్తి చేసాను. ఈసారి ఎలాగైనా క్రమాలంకారం వాడకుండా పూర్తి చెయ్యాలనుకున్నాను కానీ నావల్ల కాలేదు. మళ్ళీ క్రమాలంకారం కాళ్ళు పట్టుకుని, ముప్పతిప్పలూ పడితే ఇదిగో ఇలా పూర్తయ్యింది:

ఉ||  భూతకి  నంపెనెవ్వతెను కంసుడు కృష్ణు వధింప? కోతితా
        నాతికి నేరికిన్ తెలిపె నాధుని గాధను? భర్త భార్యయో?
        రాతిని నాతిగన్ మలచు రాముని పాదము నెట్లుకొల్చుటో?
        పూతన, సీతకున్, సవతి, పూజలుసేయరె భక్తిశ్రద్ధలన్!

ఏమైనా, ఇలాంటివాట్లలో సమస్యలో ఉన్న అందం పద్యంలో ఉండదు!

(పద్య భావం:
– కంసుడు కృష్ణుని చంపడం కోసం పంపిన రాక్షసి ఎవరు? పూతన
 – ఏ స్త్రీకి ఒక వానరం వల్ల  భర్త జాడ తెలిసింది? సీతమ్మకు
 – భర్తకున్న మరో భార్య? సవతి
 – రాతిని స్త్రీగా మార్చిన రామచంద్రమూర్తి పాదాలని ఎలా సేవించాలి? భక్తిశ్రద్ధలతో పూజచేయాలి)

18 వ్యాఖ్యలు »

 1. పద్యం అందంగా అమరింది గానీ మొట్టమొదట చదవగానె సవతికి పూజలు చెయ్యమంటున్నారా అంపించింది! బాగుంది పూరణ.

  వ్యాఖ్య ద్వారా teresa — సెప్టెంబర్ 2, 2007 @ 5:48 ఉద. | స్పందించండి

 2. భలే భలే అండీ…….బాగా పూరించారు……
  ఇక నుంచీ నేను కూడా మా కాలేజీ చెట్లకిందకు నా మకాం మారుస్తాను…..

  వ్యాఖ్య ద్వారా Lalitha Sravanthi — సెప్టెంబర్ 2, 2007 @ 10:11 సా. | స్పందించండి

 3. చాలా బాగుంది పూరణ

  వ్యాఖ్య ద్వారా Matalababu — సెప్టెంబర్ 3, 2007 @ 4:22 ఉద. | స్పందించండి

 4. ఇరగ తీసావు బాబాయ్,ఇంక కుమ్ముధాం మనల్ని కూద కలిపెసుకొ……………….
  మన బ్లొగ్ అద్ద్రెస్స్ “సుధీర్థొసరదగ.బ్లొగ్స్పొత్.చొం”…….
  మరి ఎంతి బాబాయ్ చుద్దమాఆఅ.

  వ్యాఖ్య ద్వారా sudheer — సెప్టెంబర్ 3, 2007 @ 10:38 ఉద. | స్పందించండి

 5. ఒక్క దెబ్బతొ touch చెసావు గురు “touch లొ వుందు చెప్థ”………….
  మన బ్లాగ్ అద్ద్రెస్స్ చూసావుగ ఇక కుమ్ము.

  వ్యాఖ్య ద్వారా chandrika — సెప్టెంబర్ 3, 2007 @ 10:47 ఉద. | స్పందించండి

 6. శ్రీరాం గారు,

  చాలా బావుంది. చక్కగా ఉంది. మీరు చూసే స.రి.గ.మ.ప లోని శైలజ గారి శైలి లో చెప్పాలి అంటే Clean and Neat. ప్రతి పదం చక్కగా అమరింది.పద్యం హాయి గా ఉంది.
  సమస్య లో చాలా అసందర్భాలు ఉన్నాయి. పూతన ది ఒక యుగం, సీతది మరో యుగం. పూతన రాక్షసి, సీత దేవతాంశ .. వీళ్ళిద్దరికి సపత్నీకం అంటగట్టామెట్టా? పోని ఎలాగో అంటగట్టుదామన్నా .. రాముడుది ఏకపత్నీవ్రతం ..ఓప్పుకోడాయా..పోని ఆయని ఎట్టాగో ఒప్పిద్దామంటే పూజలు చేయమంటుంటిరి.. మాకు దేవతలకే పూజలు చేయ్యటానికి సమయం లేకపోతే ..పూతనకుకూడా ఎక్కడ చేస్తాం చెప్పండి ..
  ఇన్ని అసంధర్భాలమధ్య క్రమాలంకారమే తోడొస్తుందని అనుకున్నాను .. మీరూ అలానే పూరణ చేశారు .. సమర్ధవంతంగా..
  ఇతరత్రా:
  నేను కూడా చెట్టుకింద కూర్చొని మూకభినయం ఆడినవాడినే, ఐతే అక్కడ కూడా నేను తెలుగుకే పరిమితం. అపూర్వ సహస్ర శిరఛ్చేధ చింతామణి, సుబ్బారావుకి కోపం వచ్చింది .. ఇలా ఉండేవి మా కష్టాలు. ఈ సమస్యలు ట్రాఫిక్ జాం లో పుట్టినవే ( అందుకే నాకు అన్ని జామ్‍ల్లోకి ట్రాఫిక్ జాం ఇష్టం. నడి రోడ్డు మీద బండి ఆపి కాసేపు మనకి కావాల్సినలోకం లో విహరించి రావచ్చు.)..

  నేను ఈ తూరి రానారే గారు అడుగుతారులే, చూసి వినోదిద్దాం అనుకున్నాను కానీ మీరు ” ఎక్కడెక్కడి దుర్మార్గపు సమస్యలూ ఈయన దగ్గర సిద్ధంగా ఉంటాయి. ” ( విశేషణం సమస్యలముందు వేశారు, సంతోషం 🙂 )అన్నారు కాబట్టి ఈసారికి కూడా సమస్య నేనే ఇచ్చి, తరువాత అవకాశం వేరేవారికిస్తాను.
  రాముల వారి ఏకపత్నీ వ్రతం తో వచ్చిన ‘సమస్యలు’ అన్ని ఇన్నీ కాదు, శూర్పణఖ ముక్కుచెవులు కోల్పోవాల్సి వచ్చింది, అశ్వమేధంలో బంగారు ప్రతిమ చేయాల్సి వచ్చింది, వాల్మీకి సీతమ్మను నమ్మబలకాల్సివచ్చింది..ఆ పైన అవధానులకి సమస్యలు. ముందు అడిగినవానికి, పూరించేటప్పుడు అవధానికి, తరువాయి అందరకీ వినోదం . సరే చిత్తగించండి:

  ధరణీ సుతగనెనుపతిని తరుణుల మధ్యన్.

  (చంధస్సు సరిపోయిందనే అనుకుంటున్నాను)

  అన్నట్టు, మీరీసారి కొంచం త్వరపడాలండోయ్, లలితాస్రవంతి గారు చెట్టుకింద ( తాళపత్రం, ఘంటం పట్టుకొని?) సిద్ధంగా ఉన్నారు, వారి పూరణ ముందు రాగలదు సుమా!

  వ్యాఖ్య ద్వారా vookadampudu — సెప్టెంబర్ 3, 2007 @ 11:42 సా. | స్పందించండి

 7. అన్నట్టు చెప్పటం మరిచానండీ, రెండో పాదంలో చివరి రెండు గణాలకి ‘భర్త భార్యయో?’ బదులు ‘కుంతి మాద్రికిన్?’ అనవచ్చుననుకుంటా.. ( ఏకపత్నివ్రతులకి కోపం రాకుండా)

  వ్యాఖ్య ద్వారా vookadampudu — సెప్టెంబర్ 3, 2007 @ 11:48 సా. | స్పందించండి

 8. తెరెసా గారూ…ధన్యోస్మి! ఈసారి కూడా ఏమైనా సవరణలు చెప్తారేమో అనుకున్నా… 🙂

  లలితగారూ…మీ ప్రయత్నానికి మా ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది. ఆల్దబెస్ట్!

  మాటలబాబుగారూ, స్వాగతం. రాకేశ్వరుడి మాటవిని మీరూ ఒక పద్యం రాయాలని నా కోరిక!

  ఊ.దం. గారూ…ధన్యోస్మి! మీరు చెప్పిన సవరణ బాగుంది.
  క్రమాలంకారం కాకుండా కిట్టిద్దామంటే వల్ల కాలేదు. మరి ఎవరైనా చెయ్యగలరేమో!

  నా నోరూ ఊరుకోదూ, మీ బుర్రా ఊరుకోదు. కొత్త సమస్య వచ్చిపడింది.

  ధర”ణీ” అంటే మరి తేటగీతి ఛందస్సు తప్పినట్టే ఉంది. లేక ఇందులో ఏమైనా దుర్మార్గం ఉందా?? ఈసారి కూడా విశేషణం సమస్యముందేనండోయ్!

  వ్యాఖ్య ద్వారా Sriram — సెప్టెంబర్ 4, 2007 @ 12:18 ఉద. | స్పందించండి

 9. శ్రీరాం గారు,
  కందానికి కుడా కుదరటం లేదా?

  వ్యాఖ్య ద్వారా vookadampudu — సెప్టెంబర్ 4, 2007 @ 12:37 ఉద. | స్పందించండి

 10. సరిపోయిందండోయ్! ఏమిటో నడక చూస్తే ఎక్కడా కందం అనే అనిపించలేదు. చాలా ఉంది ఇందులో దుర్మార్గం!

  వ్యాఖ్య ద్వారా Sriram — సెప్టెంబర్ 4, 2007 @ 12:45 ఉద. | స్పందించండి

 11. రక్షించారు. ఈ మధ్య అలవోకగా గణ భంగమౌతుంటే ఇక్కడా అదేవరస అనుకున్నాను. ( చూ:http://vasundhararam.wordpress.com/2007/08/17/%e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b1%82-%e0%b0%a8%e0%b0%be-%e0%b0%95%e0%b0%be%e0%b0%ab%e0%b1%80-%e0%b0%aa%e0%b0%bf%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a%e0%b0%bf/)
  లలితాస్రవంతి గారు ,
  న్యాయస్థానాలో చెట్టుకింద ప్లీడర్లు, విద్యాస్థానాల్లో చెట్టుకింద పీడర్లు ( పీడించేవాళ్లు, ఆకతాయిమూకలు అని అర్ధం చెప్పుకోమని కవి బాధ)ఉంటారు జాగ్రత్త.

  వ్యాఖ్య ద్వారా vookadampudu — సెప్టెంబర్ 4, 2007 @ 1:07 ఉద. | స్పందించండి

 12. పద్య భావం మాత్రమే అర్థం అయ్యింది. నా దృష్టిలో ఈ ప్రయత్నమే గొప్ప విషయం. అభినందనలు.

  వ్యాఖ్య ద్వారా నాగరాజా — సెప్టెంబర్ 4, 2007 @ 7:02 ఉద. | స్పందించండి

 13. శభాషో!! అల్పపీడనం బలమైన వాయుగుండంగా మారినట్లు మొత్తానికి యువకవులతో ఇక్కడొక నవ భువనవిజయం తయారౌతున్నట్లుందే! ఈ వాయుగుండం తీరాన్ని దాటకుండా, ఎప్పటికీ తీరప్రజలను ఊరిస్తూ, మిగతాప్రాంతాలవారి కడగండ్లను తీరుస్తూ ఉండాలని ఆశిస్తున్నాను. ఇందులో పాల్గొంటున్న అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు.

  వ్యాఖ్య ద్వారా రానారె — సెప్టెంబర్ 5, 2007 @ 3:16 ఉద. | స్పందించండి

 14. నాగరాజా గారూ, ధన్యవాదాలు.

  రానారె, తథాస్తు!

  వ్యాఖ్య ద్వారా Sriram — సెప్టెంబర్ 5, 2007 @ 2:13 సా. | స్పందించండి

 15. శ్రీరామ్ గారూ, మీరిలా అలవోకగా పద్యాలు రాసేస్తోంటే ముచ్చటేస్తోంది; ఊకదంపుడు గారు సమస్యల మీద సమస్యలిచ్చేస్తున్నారంటే ఇవ్వరూ మరి! కొత్త సమస్యకు పూరణ వచ్చేసిందా?

  వ్యాఖ్య ద్వారా చదువరి — సెప్టెంబర్ 25, 2007 @ 10:04 ఉద. | స్పందించండి

 16. […] అందుకే ఇప్పటికీ ఎవరికైనా సమస్యలొస్తే రాముడి గుడిలో కళ్యాణం చేయిస్తే తీరతాయి అని నమ్ముతారు. ఊకదంపుడుగారి దెబ్బకి నాకు కూడా నా బ్లాగులో ఇది జరపక తప్పలేదు. ఊకదంపుడు పేరే కానీ ఈయన పోటు చాలా గట్టిగా వేస్తారు. మచ్చుకి ఈయనిచ్చిన సమస్య చూడండి: […]

  పింగ్ బ్యాక్ ద్వారా పెళ్ళి తీర్చిన సమస్య! « సంగతులూ,సందర్భాలూ…. — సెప్టెంబర్ 26, 2007 @ 9:49 సా. | స్పందించండి

 17. శ్రీరాంగారూ, భక్తిశ్రద్ధలన్ అన్నపుడు “క్తి” లఘువేనంటారా?

  వ్యాఖ్య ద్వారా vookadampudu — ఆగస్ట్ 22, 2010 @ 10:39 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: