సంగతులూ,సందర్భాలూ….

ఆగస్ట్ 14, 2007

కొత్త సమస్యలు

పులిని చూసి నక్క వాతలు పెట్టుకోడం.

కొత్తపాళీగారిని చూసి నేను పద్యాలు రాయడం.

రాసిన తర్వాత దురదకొద్దీ వాటిని బ్లాగడం.

పర్యవసానంగా ఊకదంపుడుగారుబాంబు పట్టుకొచ్చి నా బ్లాగులో పడేసారు. మిడతంభొట్లు మీ చేతిలో చిక్కేసాడండీ అని పేరు చెప్పి శరణు కోరడానికి అహం అడ్డు. ఏమిటి కర్తవ్యం?

పోరాడడం తప్ప వేరే మార్గం కనపడలేదు. తప్పదు, మీరు భరించాల్సిందే!

సమస్య:

“గర్భముదాల్చెను పురుషుడు గంగలొ మునగన్”

నా పూరణ:

కం|| గర్భాధానపు తంతును
      నిర్భీతిగ శంతనుండు నీటనె నెరపెన్
      గర్భము పండగ గంగకు 
      గర్భము దాల్చెను, పురుషుడు గంగలొ మునగన్!

(మహాభారతంలో భీష్ముడి తండ్రి శంతన మహారాజు, గంగను వివాహం చేసుకుని పిల్లల్ని కన్నాడు. వాళ్ళు కాపరం ఎక్కడ చేసారో నేను చూడలేదు కానీ, మన సంప్రదాయం ప్రకారం ఆడపిల్ల ఇంట్లోనే ఈ గర్భాధానపు తంతు జరుగుతుంది.)

(From Brown: పురుషుడు (p. 0776) [ puruṣuḍu ] purushuḍu. [Skt.] n. A man. A husband)

ప్రకటనలు

14 వ్యాఖ్యలు »

  1. భీష్ముడి తండ్రి శంతన మహారాజు, గంగను వివాహం చేసుకుని పిల్లల్ని కన్నాడు
    Inter caste/religious marriages bring Social harmony and unity .

    without social harmony the country cannot make progress.we ought to have the feeling of brotherhood with
    the people who may appear different from us. This is called harmony or humanity.

    There should be unity among all the religious sects of the nation.

    No hatred for anyone, Hindu or Muslim.

    Social and economic discrimination is an evil force, standing on the path of our development, as the greatest hurdle.

    Our national resources are being drained to foreign countries and we are being exploited.

    The real freedom can only be achieved when fear and
    discrimination are completely banished.

    There should be no feeling of untouchability in our country.Let us conduct inter-caste / inter religious marriages for bringing social harmony.

    Social harmony is not possible until the feeling of caste ,religious discrimination is removed from the society.
    Our all activities should aim at bringing harmony in the
    society. It is good that all religious leaders are talking about
    social harmony .If all Hindus and Muslims are equal why these atrocities in our society?. Without the welfare
    of dalits/muslims the country cannot make progress.
    These are crucial points to be pondered.Fore fathers of Crores of Indian Muslims are Hindus only.They have embraced Islam due to caste discrimination only.

    The biggest challenge to humanity and humanism is the threat it faces from religious sectarian forces. They argue that their path alone is the right or valid one for the whole of mankind. They never recognize or acknowledge the right and freedom of other religions.

    All religions are equally true and whether you live as a Hindu or a Muslim or Christian not make much difference.

    We should realise that when the future mothers and fathers of the Hindu Muslim communities produce Hybrid children, it results in a strong Indian nation.

    inter caste, inter religious marriages build a strong nation.Many are the religions and many are the races flourishing in India,enduring as a nation.Inter-caste & Inter-religious marriages only can save our country.

    Inter religious married couples are balancing the religious hatredness and they act as shock absorbers and speed breakers among religious fundamentalists.

    Every human being is as equal as Anybody.

    దేవుడంటే ఎవరు? అనే ప్రశ్నకు ఈ పద్యము చక్కని సమాధానము. అన్ని మతములవారికి సరిపోగలదు.

    ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
    యెవ్వని యందు డిందు; పరమేశ్వరు డెవ్వడు; మూల కారణం
    బెవ్వ; డనాదిమధ్యలయుడెవ్వడు; సర్వము దానయైన వా
    డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.
    This Easwar is no other than Allah.We are His children.All of us are equal.We will be united if we abandone dicriminatory feelings of castes or creeds.

    “చిల్లర రాళ్ళకు మొక్కుతు ఉంటే చిత్తము చెడునుర ఒరే ఒరే
    ఒక్కడైన ఆ పరమేశ్వరునకు మొక్కి చూడరా హరే హరే “

    అనే పాట మన పల్లెటూళ్ళలో ప్రజలు ఎప్పుడో పాడారు.ఒక్కడైన ఆ పరమేశ్వరుడు”అంటే యేమిటీ?
    “ఒక్కడైన ఆ పరమేశ్వరుడు”అంటే దేవుడు ఒక్కడే అని ,హరుడు అంటే నాశనం కానివాడు అని అర్థం.

    Let us encourage inter-religious marriages to keep peace and religious tolerance in our country. Hindus and Muslims should mingle with all others and encourage them for inter religious marriages .

    The only way to beat a bad idea is to come up with good ideas.
    performing inter religious marriages on a large scale with
    Govt.sponsered incentives will remove bad ideas of
    nukes,terrorism,religious hatredness in our country.

    See Few examples of inter religious married prominent Indians who created visible actions:
    Emperor Akbar,
    Indira Gandhi-Feroz Gandhi (Zoroastrian, Parsee)
    Dr. Lakshmi Saleem,
    Pataudi-sharmila Tagore,
    Sunildath–Nargisdath,
    Asif Ali – Aruna Ali (Congress leaders of yester years),
    K L Mehta IFS – Nawabzadi of Hyderabad.
    Maharaja Kishan Pershad, Prime Minister Hyderabad Sate-Lady of Nizam
    family,
    Thalmeez Ahmed- Akbaruddin (IFS),
    Rajeev Gandhi–Sonia,
    Saif Ali Khan-,
    Shah Rukh Khan-Gowri,
    Jocky Shroff-Ayesha Dutt
    Hrithik Roshan – Suzanne Khan,
    Jyotsna-Ilyas couple (News readers)
    Azharuddin -Sangeetha Bijlani,
    Suneil Shetty and Mana Kadri,
    Mumtaz-,
    Feroze Khan-
    Sanjay Khan-
    Fardeen Khan-
    Zayed Khan-
    Waheeda Rehman-
    Zarina Wahaab-
    Shashi Kapoor-
    Salim Khan-

    Mahesh Bhatt

    Javed Akhtar-
    Raj Babbar-
    etc.,
    Can any body fill up their spouses names and inform some more names?

    వ్యాఖ్య ద్వారా rahamthulla — ఆగస్ట్ 14, 2007 @ 10:38 సా. | స్పందించండి

  2. వాతలు పెట్టుకోవడం ఏమీలేదు. మీరు రాస్తున్నవాటిలో చాలావరకూ బాగుంటున్నాయి, కొన్ని చాలాబాగా ఉంటున్నాయని నా అభిప్రాయం. ఇంకో అభిప్రాయం ఏమిటంటే, రాశాక బ్లాగకపోవడమే తప్పు. బ్లాగకపోతే తప్పొప్పులు ఎలా తెలుస్తాయి? సరే, ఇప్పుడు ఒక సందేహం – గర్భాదానపు తంతు అన్నారు కదా, అది గర్భ+ఆదానము అవుతుంది. ఆదానము (ప్ర)దానమునకు వ్యతిరేకపదం కదా!?

    వ్యాఖ్య ద్వారా రానారె — ఆగస్ట్ 15, 2007 @ 1:31 ఉద. | స్పందించండి

  3. garBhamu paMDaga gaMgaku
    garBhamu daalchen..

    okaTe bhavaM repeat chesinaTluMdi. ayinaa BaguMdi.
    Sriram garu, keep writing.

    వ్యాఖ్య ద్వారా teresa — ఆగస్ట్ 15, 2007 @ 7:00 ఉద. | స్పందించండి

  4. రహమతుల్లా గారూ, మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    రానారెగారూ, బాగున్నాయన్నందుకు కృతజ్ఞతలు. కానీ ఇలా బాంబులు మీద పడితే పోరాటం చెయ్యడానికి మనకి శక్తి ఉండాలి కదా. ఈసారేదో గట్టెక్కాను.

    అది “గర్భాధానం”. గర్భ+ఆధానం. ఆధానం అంటే చెయ్యడం అని అర్ధం.

    “గర్భాదానం” నా అప్పుతచ్చు మాత్రమే. చూపినందుకు కృతజ్ఞతలు.

    ఈ పదం గురించి సుమారు 70 యేళ్ళనాడు తిరుపతి వెంకటకవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారు ఒక వ్యాసమే రాసారు. ఎప్పుడైనా కుదిరితే చదవండి. కధలు-గాధలు అన్న పుస్తకం దొరికితే.

    తెరెస గారూ, ధన్యవాదాలు. కడుపుపండడం అంటే సంతానభాగ్యం కలగడం అన్న అర్ధంలో వాడతారు కనక అక్కడ పునరుక్తి లేదనుకున్నాను. ఐనా ఈ దుష్కర ప్రాసతో వచ్చిన పాట్లు ఇవి. పోనీ ఇది ఎలా ఉందో చెప్పండి:

    కం|| గర్భాధానపు తంతును
    నిర్భీతిగ శంతనుండు నీటనె నెరపెన్
    అర్భకులు పుట్ట గంగకు
    గర్భము దాల్చెను, పురుషుడు గంగలొ మునగన్!

    వ్యాఖ్య ద్వారా Sriram — ఆగస్ట్ 15, 2007 @ 10:53 ఉద. | స్పందించండి

  5. This one is much better.
    Congrats, twaralOne guruvuni miMchina sishyulayyeTlunnaru.

    వ్యాఖ్య ద్వారా teresa — ఆగస్ట్ 15, 2007 @ 8:39 సా. | స్పందించండి

  6. హమ్మయ్య, మెప్పించేసాను మిమ్మల్ని.
    గురువుగారికి చెడ్డపేరు తేకుండా ఉంటే చాలు 🙂

    వ్యాఖ్య ద్వారా Sriram — ఆగస్ట్ 15, 2007 @ 11:06 సా. | స్పందించండి

  7. అర్భుతం.., కాదు కాదు అద్భుతం ( ప్రాస కోసం వెతుక్కొని వెతుక్కొని ఇలా అయ్యాను, ఏమి అనుకోకండి).
    నేనేదో చాలా కష్టమైన సమస్య అనుకుంటే మీరు ఇట్టే పూర్తిచేశేశారు. పైగా దాన్ని శంతనుడి శోభనపు వర్ణన చేశారు. ఇంకా చెప్పేందుకేముంది.
    ఎత్తుగడ బాగుంది. కంద పద్యం లో పురాణ ఘట్టాన్ని జొప్పించటం కష్టం. చాలా సమర్ధంగా నిర్వహించారు.
    పూరణా బావుంది. ఇక గురువుగారి అనుమతి తో ‘స్నాతకో’త్సవ ఏర్పాట్లు చేయవచ్చు.

    [వే.వి: కర్బనం అంటం వల్ల ప్రాసభంగం కాలేదనే అనుకుంటున్నాను. ట ఠ లకు , ల ళ లకు ప్రాసవేయటం చూశాను. పెద్దలు చెప్పాలి.]

    తెరసా గారి సూచనమీద మార్పు చేసిన తరువాత పద్యం లో పునరుక్తి పోయింది గానీయండి, మూడో పాదం నాకు కొంచం ఇబ్బందిగా అనిపించింది. పండంటి బిడ్డలు అంటారుకదా, చూస్తూ చూస్తూ కవి అర్భకులు అనటం నాకు రుచించలేదు. మీరు రాసింది తప్పని కాదు, తోచినది చెబుతున్నాను అంతే ..అన్యధా భావించకండి. (ఐనా జలగర్భం లో గర్భాధానం జరిగితే అంతేనేమో లెండి) మూడో పాదాన్ని
    “ఆర్భాటమణగ; గంగయె” అని మార్చవచ్చు ననుకుంటాను.

    నేను ఒక్క సమస్యే ఇస్తే మీరు కొత్త సమస్య’లు’ అని బహువచనం వాడారు.
    మీకు అబద్ధం ఆడిన దోషం అంటకుండావుండటానికి, నేను ఇంకో సమస్య ఇవాల్సిందే మరి.

    పూతన సీతకున్ సవతి; పూజలు సేయరె భక్తిశ్రద్ధలన్.
    [ఇది మీకు నల్లేరు మీద నడక]

    వ్యాఖ్య ద్వారా vookadampudu — ఆగస్ట్ 16, 2007 @ 1:25 సా. | స్పందించండి

  8. ఊ.దం. గారూ, ధన్యోస్మి. మొత్తానికి బయటపడ్డాను.

    ట,ఠ లకూ ల,ళ లకే కాదు ర,ఱ లకి కూడా ప్రాస వెయ్యడం చూసాను. కానీ ఇలా బ కి భ కి వెయ్యచ్చాలేదా అని అనుమానం అంతే. ఎవరినైనా అడగాలి.

    నేను అర్భకులు అని వాడడానికి కారణం శంతనుడి మొదటి 7గురు సంతానాన్నీ నీళ్ళల్లో వదిలేస్తుంది కదా గంగాదేవి, ఆ ఉద్దేశంతో వాడాను. నిఘంటువులో కూడా అర్భక పదానికి శిశువు,చిన్నవాడు అనే అర్ధమే ఉంది. మన వాడుకలో మాత్రం ఆ అర్ధం మారిన విషయం నిజమే. ఐనా మీరు చెప్పిన సవరణ బాగుంది.

    అసలు ఈ దుష్కరప్రాస వల్ల నేను శోభనపు వర్ణన చెయ్యాల్సి రాడం, దానికి మీరు ఆర్భాటమణగడమంటూ వివరించడం, ఏంటో కొంచెం ఇబ్బందిగానే ఉంది సుమండీ… 🙂

    నా సత్యసంధత సంగతి దేవుడెరుగు, మీరిలా ఒకదాని వెనక దుర్మార్గపు సమస్యలు గుప్పించడం న్యాయమా! ఈ సమస్యకి చేతులెత్తెయ్యడం తప్పితే ఏమీ మార్గం ఉన్నట్టులేదు. ఐనా రోటిలో తలపెట్టాకా తప్పదు…చూద్దాం!

    వ్యాఖ్య ద్వారా Sriram — ఆగస్ట్ 16, 2007 @ 2:04 సా. | స్పందించండి

  9. ఆధానము అనే పదమొకటుందని నాకు తెలీదు. థాంక్సో (బెంగళూరు స్టైల్లో). గర్భాధానము అంటే the nuptials అని బ్రౌణ్యములో నేరుగానే చెప్పేశారు.

    వ్యాఖ్య ద్వారా రానారె — ఆగస్ట్ 17, 2007 @ 5:59 ఉద. | స్పందించండి

  10. […] సమస్యలూ ఈయన దగ్గర సిద్ధంగా ఉంటాయి. ఒకటి అయ్యిందిరా అనుకుంటే వెంటనే ఇంకోటి పేల్చారు. […]

    పింగ్ బ్యాక్ ద్వారా క్రమాలంకారం కాళ్ళు మళ్ళీ పట్టుకుని… « సంగతులూ,సందర్భాలూ…. — సెప్టెంబర్ 2, 2007 @ 1:02 ఉద. | స్పందించండి

  11. […] ఈ తంతులో తల్లివికావా ఈ ఆటలో ప్రణయకేళి బాధా? […]

    పింగ్ బ్యాక్ ద్వారా ఉల్లముంచవా ఈ తంతులో « Vooka Dampudu — సెప్టెంబర్ 2, 2007 @ 10:09 ఉద. | స్పందించండి

  12. […] క్రితంసారి ఈయన దెబ్బకి ఎక్కడాలేనిది శంతనుడి శోభనపు వర్ణన చెయ్యాల్సివచ్చింది నాకు. ఈసారి కాస్త […]

    పింగ్ బ్యాక్ ద్వారా పెళ్ళి తీర్చిన సమస్య! « సంగతులూ,సందర్భాలూ…. — అక్టోబర్ 24, 2007 @ 10:07 సా. | స్పందించండి

  13. శ్రీ రాం గారు,
    “అర్భకులు” గురించి నేను కొంచం అతి చేశానేమో –
    ఈమధ్య ఒకటి రెండు చోట్ల ‘శిశువులు’ అనే అర్ధం లో ప్రయోగించటం చూశాను.

    వ్యాఖ్య ద్వారా vookadampudu — డిసెంబర్ 3, 2007 @ 10:54 సా. | స్పందించండి

  14. […] సెప్టెంబరు 10, 2008 · అభిప్రాయములు ఇప్పటి వరకూ మాకందాలకే ఋతువుంటుండనుకునేవాడిని గానీ, కందాలకి కూడ ఋతువుంటుందని మాంఛి రాజీకయపునెలలో చదువరి గారు కందపద్యాల టపా వత్తితేనూ, అందులో కామేశ్వరరావు గారి వ్యాఖ్య చూస్తేనూ తెలిసింది. మా అయ్యవారిని అడిగితే అబ్బే, ఆ ఋతువు రావడానికి ఇంకా సమయం ఉందే అన్నారు గాని, తొందరపడి ఓ కవి కోయిల ముందే కూసింది అని బ్లాగులు చూసిన నాకు అర్ధమైపోయింది. ఈ కోయిల కూతలు అంటు వ్యాధులు అవ్వటం చేత, అవి తొందరగా నలుబ్లాగులకి వ్యాపించాయి. పైగా, ఇంతకుముందు కందం ముట్టని గిరి గారి చేత కూయిస్తే , అలానే మరి కొంత మంది కొత్త కోయిలలు కూడ గొంతు కలిపాయి.. సరే ఇదుగో నా వంతూ అందామని, గొంతు కలుపుదామని మా బాస్ చేత ఎంత తన్నించుకున్న ఓ కందమన్నా రాలితే నా? ( ఇప్పుడు తెలిపోయిందా నే ముద్దు కుర్రణ్ని కానని ) పోనీ మెదలకుండా కూర్చుందామంటే,కందబలంగలవారే కవులోయ్ అని ప్రచారం చేస్తుంటిరి.. పంది కొట్టలేవని ముందే తెలుసు అంటుంటిరి. మరి ఏమి చేయాలీ? ఏమి చేయాలేమిటండి అది కూడ తెలియదా? ఈ వేసవి లో మావిడి పళ్లు తినలేకపోతే, ఏంచేస్తాం, క్రితం వేసవిలో, ఆ సీనుగాడు చిత్తూరునుంచి బుట్టేసుకొచ్చాడురా, అప్పుడు తిన్నాం చూడు ,ఇంకో మూడేళ్లదాక మామిడి కాయ తినగూడదు అన్నంత మొహం మొత్తిందనుకో .. అంటామా? నేను అదే చేశాను …. ఇంతకు ముందు కందాలన్నీ ఏరుకొచ్చి పేర్చాను చూడండి.. అవునయ్యా, ఎవరో కందాలు రాస్తుంటే, నీకెందుకయ్యా దురదా అంటారా? ఆ పేరింటే నాకు తెలియకుండానే దురదొచ్చేస్తుంది. అసలు , నే బ్లాగులో అడుగెట్టింది, కంద సమస్యతోటే.. […]

    పింగ్ బ్యాక్ ద్వారా మా కందాలు – మాకందాలు « ఊక దంపుడు — ఫిబ్రవరి 9, 2010 @ 11:58 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: