సంగతులూ,సందర్భాలూ….

ఆగస్ట్ 12, 2007

తప్పెవరిది?

Filed under: Uncategorized — Sriram @ 1:20 ఉద.

నేను రాసిన దాన్ని చూసి గురువుగారు ఒవైసీని సమర్ధిస్తున్నట్టు ఉందోయ్ అన్నారు. అందుకే ఈ వివరణ. నేను అనేది ఏమిటంటే ఒవైసీయే కాదు, ఆ స్థానంలో ఎవరున్నా అదే పని చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటినుంచీ హైదరాబాదు ప్రాంతాలలో మజ్లిస్ ఏ ప్రాతిపదికన గెలుస్తోంది? కేవలం మతం అడ్డుపెట్టుకు నెగ్గుకొస్తోంది తప్ప, వాళ్ళు చేసిన అభివృద్ధి ఏముంది? మతం వారికి బంగారు గుడ్లు పెట్టే బాతు. దానిని వాడుకుంటున్నారు. ఇది కేవలం మజ్లిస్ కే పరిమితం కాదు. మన దేశం మొత్తం మీద ఉన్న పరిస్థితి ఇదే. మన కులం వాడనో, మన మతం వాడనో, మన ప్రాంతం వాడనో తప్పితే, అభ్యర్ధి నిజమైన అర్హత ఉన్నవాడా కాదా అన్నది ఎవరకీ అక్కర్లేదు. అభ్యర్ధులని నిలబెట్టే విషయంలో కూడా పార్టీలు ఇవే విషయాలు ఆలోచిస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి.

ఒవైసీ గారికి కూడా అదే నమ్మకం. అందుకే ఈ పని చేస్తే తప్పకుండా నెగ్గుతాననుకున్నాడు. చేసాడు. ఈ సారి భారీ మెజారిటీతో మజ్లిస్ గెలుపు ఖాయం చూస్కోండి.

అంతే కాదు, తామేం చేసినా ఎవరూ ఏమి చెయ్యలేరనీ, ప్రభుత్వానికి తామంటే భయమనీ ఈయన విశ్వాసం. అది నిజమేనని మనకి ఋజువయ్యింది కూడా. ఇంక ఆయన దేనికి వెనకాడాలి?

నా ఉద్దేశంలో కాంగ్రెస్సు వాళ్ళూ, వారికి మద్దతిస్తోన్న వామపక్షాల వాళ్ళూ దీనికి అసలైన కారకులు. మైనారిటీలని ఓటుబేంకుగా వాడుకుంటూ ఇలాంటి నాయకులని నెత్తికెక్కించుకుని వాళ్ళు ఆడినది ఆటగా జరగనిచ్చింది వీళ్ళే. ప్రభుత్వం ఎంత లోకువకాకపోతే మజ్లిస్ ఎమ్మెల్యేలు అలా ప్రవర్తించగలిగారు. తమనోటికొచ్చినట్టు మాట్లాడి ఇంకా ధైర్యంగా స్వేచ్చగా తిరుగుతున్నారంటే, ప్రభుత్వం చేతకానితనం కాదా? ఇప్పుడు వీళ్ళని ఖాసిం రజ్వీ వారసులంటూ వ్యాసాలు రాస్తున్న వామపక్షాలవాళ్ళకి ఇప్పటిదాకా ఈ విషయం గుర్తులేదా? అందుకే నాకు ఒవైసీలోకన్నా వాళ్ళకి లోకువైన వీళ్ళలోనే ఎక్కువ తప్పు కనిపించింది. దీనిగురించే నేను నఫీసా ఆలీ గారిని చూసి నవ్వుకున్నది. అంతేకానీ ఒవైసీ పనిని సమర్ధించి కాదు.

ప్రకటనలు

8 వ్యాఖ్యలు »

 1. శ్రీరాం గారూ, మీ అభిప్రాయాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. ప్రతి పౌరుడు తమ ఓటు హక్కు విలువను గుర్తించి పరిణతి చెందిన ఆలోచనలు చేసేవరకు పరిస్థితిలో ఏ మార్పు ఉండదు. ఓటు బ్యాంకు రాజకీయాలు లేని నవ భారతాన్ని ఎప్పుడు చూస్తామొ ఏమిటొ..?

  వ్యాఖ్య ద్వారా trajarao — ఆగస్ట్ 12, 2007 @ 2:14 ఉద. | స్పందించండి

 2. శ్రీ రాం గారూ,

  బహుశా మీరన్న వ్యాఖ్యలు నన్నుద్దేశించే అనిపించి ఈ రెండు మాటలు రాస్తున్నాను.

  మీరు అన్నట్టుగా నిజంగానే నేను వామపక్ష వాదినే. అయిటే మీరు జాగ్రత్తగా గమనిస్తే వామపక్షాలు ముస్లిముల పట్ల సానుభూతి ప్రకటిస్తాయే కానీ ముస్లిం మతోన్మాదుల పట్ల కాదు. వామపక్షాలు హిందూ మతోన్మాదుల పట్ల కూడా కఠినంగానే వ్యవహరిస్తారు. మొన్నటి సంఘటనను అటు కాంగ్రెస్, ఇటు తెలుగు దేశం కన్న గట్టిగా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలే ఖండించిన విషయం కూడా మీరు గమనించే ఉంటారు.

  ఇటీవల పాత బస్తీలో సీపీఎం, సీపీఐ రెండూ చాలా క్రియాశీలక పోరాటాలు చేసి మజ్లిస్ ఆధిపత్యానికి గండి కొట్టడం మీకు తెలిసే ఉంటుంది. ఒక వేళ మీరన్నట్టు అవి వోటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడేట్టయితే ఆ పని మెజార్టీ హిందువుల ఓట్ల కోసమే చెయ్యొచ్చు కదా?

  ఒకటి మాత్రం నిజం. వామపక్షాల వాళ్లు కూడా తప్పులు చేస్తారు. మిగతా వారి కన్నా వారు గుడ్డిలో మెల్ల అనేదే నా అభిప్రాయం.

  వ్యాఖ్య ద్వారా Dil — ఆగస్ట్ 13, 2007 @ 1:11 సా. | స్పందించండి

 3. శ్రీరామా, బాగా చెప్పావు. వామపక్షాలైనా ఎన్నికల బరిలో దిగాక మరి వోట్ల జూదం ఆడక తప్పదు. రెండు విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నై – ఒకటి) హైదరాబాదులో మతమౌఢ్యం చాలా వరకు తగ్గుమొహం పట్టింది. పాతబస్తీలో ఎర్రపార్టీలు ఏమి క్రియాశీలక పోరాటాలు చేశాయో నాకు తెలీదుగానీ మొత్తం మీద నగరంలో MIM పట్టు సడలింది. రెండు) ఈ “దాడి” వారి మత విశ్వాసాన్ని ప్రకటించుకోవటానికో ఆమెని నిజంగా గాయపరచటానికో కాదు – దిగజారిపోతున్న తమ పరపతిని కాస్త పైకెత్తుకోడానికి ఒక డ్రామా.

  వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — ఆగస్ట్ 13, 2007 @ 6:13 సా. | స్పందించండి

 4. రాజారావుగారూ, స్వాగతం. మీరు చెప్పింది నిజం.

  దిల్ గారూ, స్వాగతం.
  మొదటగా, నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు రాయలేదు. తస్లిమాపై దాడి అనంతరం వివిధ ప్రసార మాధ్యమాలలో(ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమాలలో, ఆంగ్ల బ్లాగులలో) మజ్లిస్ పుట్టుపూర్వోత్తరాల గురించిన చర్చ చూసి నాకు కలిగిన భావన మాత్రమే అది. ఆ వాక్యం రాసాకా మీ వ్యాసం గుర్తొచ్చిన మాట మాత్రం వాస్తవం. కానీ ఇంకో మంచి పదం దొరకక, మార్చడానికి మనసొప్పక అలా వదిలేసాను. దయచేసి వ్యక్తిగతంగా తీసుకోవద్దు.

  ఇంక మీ వ్యాఖ్యలో రెండో భాగం గురించి:
  – మీరు వామపక్షవాదులు మాత్రమే అయ్యుంటే మీకు వివరణ ఇవ్వవలసిన అవసరం లేదు. వారి పనులన్నింటికీ మీరు సంజాయిషీ ఇవ్వక్కల్లేదు.

  – మీరు క్రియాశీలక సభ్యులయ్యుంటే, మీరిచ్చిన సమాధానం నా ప్రశ్నకి బదులు కాదు. బీజేపీ, శివసేనలని మతతత్వ పార్టీలంటూ ఈసడించుకునే వామపక్షాలూ, వారి మిత్రబృందాలూ మజ్లిస్ ని మాత్రం ఎప్పుడూ పల్లెత్తు మాటనడం నేనెప్పుడూ వినలేదు. పైగా వాళ్ళని సాధ్యమైనంత దువ్వడానికి ప్రయత్నిస్తాయి. దీనిగురించే నేను రాసింది.

  తస్లిమా పై దాడిని వామపక్షాలు ఎంతగా ఖండిచాయా అని మీరు చెప్పాకా అంతర్జాలంలో వెతికాను. మొక్కుబడిగా పోలిట్ బ్యూరో తరపున ఒక ప్రకటన ఇచ్చి ఊరుకున్నారు(http://cpim-news.blogspot.com). ప్రకాష్ కారత్ కానీ, సీతారాం గారు కానీ టీవీల్లో ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఎట్లీస్ట్ నేనుచూసినంత వరకూ.

  మీరువేసిన మరో ప్రశ్న, హిందూ ఓటుబేంకుకే ప్రయత్నించవచ్చు కదా అని. హిందూ ఓటుబేంకు అన్నది సాధ్యమయ్యుంటే బీజేపీ ప్రతిపక్షంలో ఎందుకు కూచుంటుంది? పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న గుజరాత్ వంటి రాష్ట్రాలలో తప్పితే వేరే చోట హిందూ ఓటుబేంకు అనేది పనిచెయ్యదు. మతం అనేది హిందువులకి చాలా వ్యక్తిగత విషయం. దాన్ని వాళ్ళు రాజకీయాలకి చాలా దూరంగా ఉంచుతారు.

  వామపక్షాల వాళ్ళు గుడ్డిలో మెల్లా లేక గాఢాంధకారమా అన్నది మనమన వ్యక్తిగత అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది కాబట్టి దాని మీదా వాదించుకుని ఉపయోగలేదు. విభేదాలని ఒప్పుకుని అక్కడితో వదిలెయ్యడం శ్రేయస్కరం.

  గురువుగారూ, హమ్మయ్య! 🙂

  వ్యాఖ్య ద్వారా Sriram — ఆగస్ట్ 13, 2007 @ 10:06 సా. | స్పందించండి

 5. Inter caste/religious marriages bring Social harmony and unity .

  without social harmony the country cannot make progress.we ought to have the feeling of brotherhood with the people who may appear different from us. This is called harmony or humanity.

  There should be unity among all the religious sects of the nation.

  No hatred for anyone, Hindu or Muslim.

  Social and economic discrimination is an evil force, standing on the path of our development, as the greatest hurdle.

  Our national resources are being drained to foreign countries and we are being exploited.

  The real freedom can only be achieved when fear and
  discrimination are completely banished.

  There should be no feeling of untouchability in our country.Let us conduct inter-caste / inter religious marriages for bringing social harmony.

  Social harmony is not possible until the feeling of caste ,religious discrimination is removed from the society.
  Our all activities should aim at bringing harmony in the society.Fore fathers of Indian Muslims are Hindus only.They have embraced Islam due to caste discrimination.

  The biggest challenge to humanity and humanism is the threat it faces from religious sectarian forces. They argue that their path alone is the right or valid one for the whole of mankind. They never recognize or acknowledge the right and freedom of other religions.

  All religions are equally true and whether you live as a Hindu or a Muslim or Christian not make much difference.

  We should realise that when the future mothers and fathers of the Hindu Muslim communities produce Hybrid children, it results in a strong Indian nation.

  inter caste, inter religious marriages build a strong nation.Many are the religions and many are the races flourishing in India,enduring as a nation.Inter-caste & Inter-religious marriages only can save our country.

  Inter religious married couples are balancing the religious hatredness and they act as shock absorbers and speed breakers among religious fundamentalists.

  Every human being is as equal as Anybody.

  దేవుడంటే ఎవరు? అనే ప్రశ్నకు ఈ పద్యము చక్కని సమాధానము. అన్ని మతములవారికి సరిపోగలదు.

  ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
  యెవ్వని యందు డిందు; పరమేశ్వరు డెవ్వడు; మూల కారణం
  బెవ్వ; డనాదిమధ్యలయుడెవ్వడు; సర్వము దానయైన వా
  డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.
  This Easwar is no other than Allah.We are His children.All of us are equal.We will be united if we abandon discriminatory feelings of castes or creeds.

  “చిల్లర రాళ్ళకు మొక్కుతు ఉంటే చిత్తము చెడునుర ఒరే ఒరే
  ఒక్కడైన ఆ పరమేశ్వరునకు మొక్కి చూడరా హరే హరే “

  అనే పాట మన పల్లెటూళ్ళలో ప్రజలు ఎప్పుడో పాడారు.ఒక్కడైన ఆ పరమేశ్వరుడు”అంటే యేమిటీ?
  “ఒక్కడైన ఆ పరమేశ్వరుడు”అంటే దేవుడు ఒక్కడే అని ,హరుడు అంటే నాశనం కానివాడు అని అర్థం.

  Let us encourage inter-religious marriages to keep peace and religious tolerance in our country. Hindus and Muslims should mingle with all others and encourage them for inter religious marriages .

  The only way to beat a bad idea is to come up with good ideas.
  performing inter religious marriages on a large scale with Govt.sponsered incentives will remove bad ideas of nukes,terrorism,religious hatredness in our country.

  See Few examples of inter religious married prominent Indians who created visible actions:
  Emperor Akbar,
  Indira Gandhi-Feroz Gandhi (Zoroastrian, Parsee)
  Dr. Lakshmi Saleem,
  Pataudi-sharmila Tagore,
  Sunildath–Nargisdath,
  Asif-Aruna Ali(Congress leaders of yesteryears),
  K L Mehta IFS – Nawabzadi of Hyderabad.
  Maharaja Kishan Pershad,P.M.Hyderabad State-Lady of Nizam family,
  Thalmeez Ahmed- Akbaruddin (IFS),
  Rajeev Gandhi–Sonia,
  Saif Ali Khan-,
  Shah Rukh Khan-Gowri,
  Jocky Shroff-Ayesha Dutt
  Hrithik Roshan – Suzanne Khan,
  Jyotsna-Ilyas couple (News readers)
  Azharuddin -Sangeetha Bijlani,
  Suneil Shetty and Mana Kadri,
  Mumtaz-,
  Feroze Khan-
  Sanjay Khan-
  Fardeen Khan-
  Zayed Khan-
  Waheeda Rehman-
  Zarina Wahaab-
  Shashi Kapoor-
  Salim Khan-
  Mahesh Bhatt
  Javed Akhtar-
  Raj Babbar-
  etc.,
  Can any body fill up their spouses names and inform some more names?

  వ్యాఖ్య ద్వారా rahamthulla — ఆగస్ట్ 14, 2007 @ 10:48 సా. | స్పందించండి

 6. తస్లీమా ఘటనకు రాష్ట్రం లోనయితే వామపక్షాలు, వాటి అనుబంధ సంఘాలు చాలా స్పందించాయి. అవన్నీ అంతర్జాలంలో రాక పోయుండవచ్చు. సీపీఎం ఎంపీ ఒకరు ఆ సంఘటనను పార్లమెంటులో కూడా ప్రస్తావించారు.

  ఇక హిందూ ఓటు బ్యాంకు ఉన్నదనడానికి బీజేపీకి ఆ మధ్య పెరిగిన సీట్లే సాక్ష్యం. రామ జన్మ భూమి వివాదం తలకెత్తుకున్న తొలి రోజుల్లో ఆ పార్టీ రెండు పార్లమెంటు స్థానాలనుండి 80 పై చిలుకు స్థానాలకు ఎదిగిందని నాకు గుర్తు. హిందువులను ఓటు బ్యాంకుగా మార్చడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు చాలా చోట్ల తాత్కాలిక ఫలితాలు ఇచ్చాయి.

  వ్యాఖ్య ద్వారా Dil — ఆగస్ట్ 15, 2007 @ 1:03 సా. | స్పందించండి

 7. మత రాజకీయాల విషయంలో వామపక్షాలు మిగతా అందరి కంటే ఖచ్చితంగా మెరుగనే చెప్పాలి. అయితే అనేక ఇతర విషయాల లాగానే ఈ విషయంలోనూ వారిది పక్షపాత ధోరణే. ఎక్కడో సద్దామును ఉరితీసినపుడు, నిరసనగా వాళ్ళు (సీపీఎమ్) పాతబస్తీలో ఊరేగింపు చేసారు. తస్లీమా కేసులో విలేకరుల ముందు కళ్ళు తుడుచుకున్నారేగానీ.. దాన్ని నిరసిస్తూ, పాతబస్తీలో ముస్లిములను సంఘటితపరుస్తూ ప్రదర్శన చెయ్యలేదు. ఎంచేత? (ఇప్పుడు జరుగుతున్న పాదయాత్ర నిరసన ప్రదర్శన కాదు)

  వ్యాఖ్య ద్వారా చదువరి — ఆగస్ట్ 29, 2007 @ 2:10 సా. | స్పందించండి

 8. చదువరిగారూ, మతతత్త్వానికి వ్యతిరేకం అని చెప్పుకునే వామపక్షాలు కొన్ని మతాల విషయంలో మాత్రం పెద్దగా నోరు విప్పవు.

  బహుశః శత్రువుకి శత్రువు మనకి మిత్రుడు అనుకుంటారేమో. వీళ్ళకి మొదటి శత్రువు అమెరికా కదా!

  వ్యాఖ్య ద్వారా Sriram — ఆగస్ట్ 29, 2007 @ 3:24 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: