సంగతులూ,సందర్భాలూ….

జూలై 21, 2007

ఆకాశదేశాన ఆషాఢమాసాన…

తెలుగులో మనకి నెలల పేర్లు ఉన్నా, ఈ రోజుల్లో లౌకిక వ్యవహారాలలో వీట్లని మనం అనుసరించకపోవడం వల్ల, ఏ నెల ఎప్పుడొస్తుందో ఎప్పుడు వెళ్తుందో మనకి తెలీదు. కానీ వీటికి ఉన్న ఒక మినహాయింపు ఆషాఢమాసం. దానికి కారణం ఆషాఢమాసం పేరుతో దండిగా వ్యాపారం చేసుకునే బట్టల దుకాణాలవాళ్ళ వ్యాపార ప్రకటనలే.

ఈ సంవత్సరం ఆషాఢమాసం వచ్చిందని తెలియగానే నాకు మేఘసందేశం సినిమాలోని ఈ పాట గుర్తొచ్చింది. దానితో కాళిదాసు మేఘసందేశం గురించి తెలుసుకోవాలని ఉత్సాహం కలిగింది. ఉండబట్టలేక సాహిత్యం గూగుల్ గుంపులో అడిగేసరికి పద్మ గారు ఆ కావ్యం గురించిన వివరాలు అందచేసారు.

ఆవిడ మాటల్లో : “మేఘదూతా కావ్యానికి తెలుగులో అతి చక్కని, సరళమైన వ్యాఖ్యానం రాసింది రామవరపు శరత్ బాబు, శోంఠి శారదాపూర్ణ గార్లు. వీళ్లిద్దరూ విశ్వనాథవారికి శిష్య ప్రశిష్యులు, వరుసగా. ఈ పుస్తకంలో ప్రతి శ్లోకానికి ప్రతిపదార్థ తాత్పర్యాలే కాకుండా, పదచ్ఛేద, అన్వయాలు, “శ్రీకాళా” వ్యాఖ్య కూడా ఉంది. ఆనందలహరి, విశాఖపట్టణం వారి ప్రచురణ. ఈ పుస్తకం నేను ’98 లో అట్లాంటాలో జరిగిన మొదటి అమెరికా తెలుగు సాహితీ సదస్సులో కొన్న గుర్తు. విశాలాంధ్రలో కూడా దొరకచ్చు.”

ఈ వివరం చూసి నేను ఆన్లైన్ గ్రంధాలయంలో వెతికితే శరత్బాబుగారి పుస్తకం దొరికేసింది.

మేఘదూతం కావ్యాన్ని చదవాలనీ, కాళిదాసు “ఉప్మా” రుచి చూడాలనీ ఆసక్తి ఉండి, సంస్కృతానికీ గ్రాంధికానికీ భయపడే నాలాంటి వాళ్ళకి గొప్ప కానుక ఈ పుస్తకం. ప్రతీ శ్లోకానికీ సరళమైన వ్యావహారిక భాషలో  అర్ధం,వ్యాఖ్యానం ఉన్నాయి. దీనివల్ల కావ్యాన్ని సంపూర్ణంగా ఆస్వాదించగలగడమే కాక, మన భాషాజ్ఞానాన్ని కూడా  పెంచుకోగలుగుతాం. ఇటువంటి పుస్తకాలు మరిన్ని రావాలని నా ఆశ.
 

ప్రకటనలు

7 వ్యాఖ్యలు »

 1. మంచి పుస్తకం అందించినందుకు కృతఙ్ఞతలు

  వ్యాఖ్య ద్వారా vaagdevi — జూలై 22, 2007 @ 9:53 సా. | స్పందించండి

 2. శ్రీరామ్ నువ్విచ్చిన లింకులో ఏమీ రావట్లేదు. కొంచెం చూసి సరైన లింకు ఇవ్వగలవా? ఇదే కాదు…అముక్తమాల్యద కూడా సరళ తెలుగు అర్థాలతో చదవాలని ఆశ.

  వ్యాఖ్య ద్వారా నవీన్ గార్ల — ఆగస్ట్ 5, 2007 @ 4:46 సా. | స్పందించండి

 3. నేనిచ్చిన లంకె సరి ఐనదేనండీ. సర్వర్ పనిచేయట్లేదు అంతే.
  ఒక పని చెయ్యండి: http://dli.iiit.ac.in/ కి వెళ్ళి Author= ramavarapu అని వెతకండి దొరుకుతుంది.

  వ్యాఖ్య ద్వారా Sriram — ఆగస్ట్ 5, 2007 @ 11:33 సా. | స్పందించండి

 4. శ్రీరామా, మీ సమావేశపు వివరాలు ఈ తెలుగులో చాలా చక్కగా రాశావు. మీరు చర్చించిన విషయాలు ఆసక్తికరంగానూ, కార్యాచరణలో పెట్త వలసినవిగానూ అనిపించాయి. కాస్త ఓపిక చేసుకుని ఆ విషయాల గురించి ఇంకొంచెం రాస్తే బావుంటుంది.

  వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — ఆగస్ట్ 7, 2007 @ 12:21 ఉద. | స్పందించండి

 5. గురువుగారూ తప్పకుండా. గృహిణుల గురించిన విషయంపై తెలుగుబ్లాగరుల గుంపులో రాసాను చూడడి. మిగిలిన అంశాలపై త్వరలో నాబ్లాగులోనే రాస్తాను.

  వ్యాఖ్య ద్వారా Sriram — ఆగస్ట్ 8, 2007 @ 12:37 ఉద. | స్పందించండి

 6. sriram garu,

  plese try for cd MEGHADUTHAM released by musictoday.kalidasa slokas were sung by Hariharan and kavithakrishnamuthy and music rendered by chowrasia if Iam correct.listening it was a great experience
  SRIRAM VELAMURI

  వ్యాఖ్య ద్వారా sriram velamuri — ఆగస్ట్ 8, 2007 @ 4:04 సా. | స్పందించండి

 7. Thanks sriram for this wonderful piece of information. i shall try for this CD sometime…

  వ్యాఖ్య ద్వారా Sriram — ఆగస్ట్ 8, 2007 @ 6:28 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: