సంగతులూ,సందర్భాలూ….

జూలై 20, 2007

సంచలనాత్మక నవల: ఆవరణ

పుస్తకాలు చదవడం అనే అలవాటు ఈరోజుల్లో ఎంత తగ్గిపోయిందో మనందరికీ తెలిసినదే. అందులోనూ పుస్తకాన్ని కొని చదవడమంటే! అభిమాన హీరో సినిమా ఎంత చెత్తగా ఉన్నా పదిహేనోసారి చూడడానికి ఎటువంటి ఆలోచనా చేయని జనాలు పుస్తకం మీద పది రూపాయలు ఖర్చుపెట్టడానికి కూడా ఇష్టపడటంలేదు. అలాంటిది ఒక ప్రాంతీయ భాషలో రాసిన నవల విడుదలైన నాలుగు నెలలోనే తొమ్మిది సార్లు పునర్ముద్రింపబడింది అంటే నాకు ఆశ్చర్యం కలిగింది.

ఆ నవలే ప్రముఖ కన్నడ రచయిత, చరిత్రకారుడు అయిన ఎస్.ఎల్.భైరప్ప రాసిన “ఆవరణ” .

ఈ మధ్యకాలంలో పాశ్చాత్య సమాజాన్ని డావిన్సీ కోడ్ ఎంత ఊపు ఊపిందో కన్నడ సాహితీరంగాన్ని ఈ నవల అంతగా కుదిపివేసింది.

లౌకికవాదం ముసుగులో ఓటుబేంకు రాజకీయాలకు పాల్పడుతున్న మన రాజకీయనాయకులు చరిత్రని ఎలా వక్రీకరించి తమ పబ్బాన్ని గడుపుకుంటున్నారో కళ్ళకు కట్టిన నవల ఇది.

ఈ నవల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుంటే ఈ పుస్తకసమీక్షని చదవండి.

ప్రకటనలు

7 వ్యాఖ్యలు »

 1. yep, i’ve read a review on this book. Seems to be interesting. 🙂

  వ్యాఖ్య ద్వారా swathi — జూలై 21, 2007 @ 9:42 ఉద. | స్పందించండి

 2. ఓహ్! నిజంగానే సంచలనాత్మక నవల! ఆ రీవ్యూ చూసాక ఈ మాట అనకుండా ఉండలేకపోతున్నా!
  ఎం.ఎల్.భైరప్ప చాలా ఫేమస్ రచయిత కదూ కన్నడ సాహిత్యం లో…. ఈ నవల ఆంగ్లానువాదం ఎప్పుడొస్తుందో ఏమిటో!
  ఈ పుస్తకం గురించి రాసినందుకు ధన్యవాదాలు.

  వ్యాఖ్య ద్వారా vbsowmya — జూలై 21, 2007 @ 10:13 ఉద. | స్పందించండి

 3. తెలుగు అనువాదం వస్తే ఇంకా మంచిది.
  లేక పోతే కన్నడ నిఘంటువు పక్కన పెట్టుకోని మనమే అనువాదించుకోవచ్చు. 🙂

  వ్యాఖ్య ద్వారా రాకేశ్వర రావు — జూలై 21, 2007 @ 11:13 ఉద. | స్పందించండి

 4. Nice to see you back, swathi garu.

  సౌమ్య గారూ, స్వాగతం. ఔనండీ, ఆయన చాలా ప్రఖ్యాతి పొందిన రచయిత. అనేకభాషల్లో ఆయన పుస్తకాలు అనువదింపబడ్డాయి. ఆయన రాసిన “దాటు” అనే నవల హిందీలో ఉల్లంఘన్ అన్న టీవీ సీరియల్గా కూడా వచ్చింది.

  రాకేశ్వర్రావు గారూ, తెలుగులో కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇదివరకు కొన్ని భైరప్ప గారి నవలలు తెలుగులో అనువదించబడ్డాయి. ఆయన పేరున ఉన్న వికీ లంకె చూడండి. వ్యాసం చివరన అనువాదాల వివరాలు ఉన్నాయి.

  ఐనా మీరన్నట్టు తెలుగువాళ్ళకి కన్నడం చదవడం, అర్ధం చేసుకోడం పెద్ద కష్టం కాదు 🙂

  వ్యాఖ్య ద్వారా Sriram — జూలై 21, 2007 @ 11:36 ఉద. | స్పందించండి

 5. బెంగళూరు లో ఉన్నవారు,కన్నడా చదవగలరు,అర్ధమూ చేసుకోగలరూ
  కష్టమంతా మాదే
  కన్నడా చదవగలం గానీ,అర్ధం అవ్వదు
  శ్రీ రాం గారే ఆ తెలుగులో అనువాద కార్యక్రమం చేపట్టితే అందరికీ హ్యాపీస్ [:)]

  వ్యాఖ్య ద్వారా vaagdevi — జూలై 22, 2007 @ 9:51 సా. | స్పందించండి

 6. ఈ నవల గురించి చెప్పినందుకు థాంకులు. పనిలో పనిగా సందీప్ బ్లాగుని పరిచయం చేసినందుకు కూడా. త్వరలో తెలుగో ఆంగ్లమో అనువాదం వస్తే బాగుణ్ణు.

  వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — జూలై 23, 2007 @ 8:39 సా. | స్పందించండి

 7. వాగ్దేవి గారూ, కన్నడ నిఘంటువు హైదరాబాదులో కూడా దొరుకుతుంది. ఇలా అనువాదాలు చేసేఅంత శక్తి ఉన్నవాడిని కాదు నేను.

  గురువుగారూ నేను కూడా అదే అనుకుంటున్నాను.

  వ్యాఖ్య ద్వారా Sriram — జూలై 23, 2007 @ 10:37 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: