సంగతులూ,సందర్భాలూ….

జూలై 10, 2007

సింహఘడ్, శివాజీ, సీసపద్యం…

Filed under: కబుర్లు,భారతదేశం — Sriram @ 12:12 ఉద.

గమనిక: ఈ పోస్ట్ సినిమాలగురించి కాదు.
DSCN1307

ఈ ఫోటోలో మీరు చూస్తున్నది పూనే సమీపంలోని సింహఘడ్ కోట ప్రవేశద్వారం (మరిన్ని చిత్రాలకై నా ఫోటోబ్లాగు చూడండి).

ముష్కరమూకల దారుణాలని అడ్డుకుని భారతజాతికి ఆత్మగౌరవాన్ని గుర్తుచేసిన వీర శివాజీ అనుచరులు దుష్కరమైన పశ్చిమకనుమల ఇరుకు మార్గాలనుంచి ప్రయాణించి, ఉడుములని కోటగోడలెక్కించి, వాటిని పట్టుకు ఎక్కి, ఔరంగజేబు సైన్యాన్ని కకావికలం చేసిన అద్భుత సాహసకృత్యానికి నిలువెత్తు నిదర్శనం.

అక్కడ కోటగోడలు చూసిన నాకు, వారి ధైర్యాన్ని, సాహసకృత్యాన్ని తలచుకుంటే వళ్ళు గగుర్పొడిచింది. గుండెధైర్యం అంటే ఇది కదా అనిపించింది.
 
ఇంక ఆ పరిసరాల్లో తిరుగాడుతుంటే చిన్నప్పుడు శివాజీని గురించి విన్న వీరగాధలన్నీ ఒక్కొక్కటిగా గుర్తొచ్చాయి. దొంగదెబ్బ తీసిన అఫ్జల్ఖాన్ ని ఉక్కుగోళ్ళతో చీల్చడం, ఔరంగజేబు ఖైదు నుండి పళ్ళబుట్టలో తప్పించుకోడం వంటి సాహసకృత్యాలన్నీ కళ్ళముందు కదిలాయి.

ఒక అందమైన స్త్రీని సైనికులు బంధించి తెచ్చినప్పుడు ఆవిడ కాళ్ళమీదపడి, “నేను నీ కొడుకునైతే ఎంత అందంగా ఉండేవాడినో” అన్న శివాజీ సంస్కారం గుర్తొచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి.

ఎంత తలుచుకున్నా తనివితీరక ఇలా సీసపద్యం చెప్పుకుని ఆనందించాను:

సీ: భారతకధలను బలుమారు తెలుపగ
                         భక్తితో వినినట్టి బాలుడతడు
     విన్నకధలలోని వివరము మేల్కొల్ప
                         విక్రమించిన మహా వీరుడతడు
     భారతావనికున్న బానిసత్వముగని
                         తిరగబడిన గొప్ప ధీరుడతడు
     కన్నబిడ్డలకన్న గారముతోడను
                         ప్రజలనుగాచిన ప్రాజ్ఞుడతడు

గీ: అతడు హైందవజాతిని ఆదుకొనగ
    వీరమాతకు పుట్టిన విచ్చుకత్తి
    ధర్మరక్షణ చేసిన దార్శనికుడు
    ఛత్రపతియనబడు శివ చక్రవర్తి!

(గురుస్మరణతో…)

ప్రకటనలు

17 వ్యాఖ్యలు »

 1. అంతా బానే వుంది. వీరమాతకు విచ్చు కత్తి పుట్టటం తప్పించి.

  వ్యాఖ్య ద్వారా rajesh — జూలై 10, 2007 @ 11:00 ఉద. | స్పందించండి

 2. చాలా బాగుంది పద్యం.

  వ్యాఖ్య ద్వారా రాకేశ్ — జూలై 10, 2007 @ 1:23 సా. | స్పందించండి

 3. ee blog sreeram, aa photoblog sriram okarena? sangeetham gurinchi sahityam gurinchi intha andam ga vrase meeru photos endukandi antha ekkuva process chesestunnaru? anyway its your view. good luck!

  వ్యాఖ్య ద్వారా chetana — జూలై 10, 2007 @ 8:24 సా. | స్పందించండి

 4. nice insight of things.. nice poem.. and thanks to those links..went an hour with all those battle stories..nice post.

  వ్యాఖ్య ద్వారా josh — జూలై 10, 2007 @ 8:43 సా. | స్పందించండి

 5. రాజేష్ గారూ, ధన్యవాదాలు. మీకు శివాజీని కత్తితో పోల్చడం ఎందుకు నచ్చలేదో కూడా చెప్పాల్సింది.

  రాకేశ్ గారూ, ధన్యవాదాలు.

  chetana gaarU, ofcourse, thats my view. idivaraku okasaari manavi chEsinattu, naa phOTOlu kEvalam naa expressionski medium maatramE. nEnu technical gaa goppa photographerni kaanu. ainaa i just do basic processing with picasa and dont even have photoshop. but i blv post processing is an imptnt part of digital photography, ofcourse each one to one’s views. good luck to you too!

  Thanks deepti, hope you had a good time reading them.

  వ్యాఖ్య ద్వారా Sriram — జూలై 11, 2007 @ 12:03 ఉద. | స్పందించండి

 6. ##thats my view. idivaraku okasaari manavi chEsinattu, naa phOTOlu kEvalam naa expressionski medium maatramE##
  True!!. I apologize. I didn’t want to offend you, though.

  వ్యాఖ్య ద్వారా chetana — జూలై 12, 2007 @ 7:15 సా. | స్పందించండి

 7. Offend and Apologize! never for these trifles…
  light teeskondi.

  వ్యాఖ్య ద్వారా Sriram — జూలై 12, 2007 @ 9:59 సా. | స్పందించండి

 8. బాగుంది టపా, పద్యం. ఉత్తేజింపజేసింది…

  వ్యాఖ్య ద్వారా Nagaraja — జూలై 13, 2007 @ 1:10 ఉద. | స్పందించండి

 9. ధన్యవాదాలు నాగరాజాగారూ!

  వ్యాఖ్య ద్వారా Sriram — జూలై 15, 2007 @ 3:31 సా. | స్పందించండి

 10. సానబెట్టినాక పద్యం ఇంకొంచెం మెరుస్తోంది 🙂
  పైన రాజేష్ గారి అభ్యంతరమే బహుశా నాది కూడా – విచ్చుకత్తి పోలిక తెచ్చాక, ఆ పోలికకి సరిపోయే పనేదైనా చేయించాలి, వీరమాతకి పుడితే సరిపోదు 🙂

  తప్పులెన్నడానికేంలే, బియ్యంలో రాళ్ళేరినట్టు ఏరచ్చు – స్పందన, భావన, రసజ్ఞ (అమ్మాయిల పేర్లు కావు) ముఖ్యం. ఆ మూడూ పుష్కలంగా ఉన్నాయి నీ పద్యంలో.

  వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — జూలై 20, 2007 @ 8:32 సా. | స్పందించండి

 11. గురువుగారూ ధన్యోస్మి! మీరు చెప్పిన అమ్మాయిల అందాలని కొంత వరకైనా చూపించగలిగితే…నా పద్యమూ నేనూ ధన్యులమే 🙂

  ఇంక విచ్చుకత్తి విషయం, అది ఆదుకోడానికి పుట్టిందని అనేసాను కదా మీరు ఇంక పట్టుకోరు అనుకున్నాను. కానీ పాచిక పారలేదు….పోనీ ఇదెలా ఉంది:

  అతడు హైందవజాతికి ఆయుధముగ
  వీరమాతకు పుట్టిన విచ్చుకత్తి

  ఓకేనా?

  వ్యాఖ్య ద్వారా Sriram — జూలై 20, 2007 @ 10:14 సా. | స్పందించండి

 12. mee lanti vaaru ilanti kathalu cheppi goppa inspiration nu kaligisthunnaru, sivaajiki inka prachaaram ivvalsindi chaala undi.

  వ్యాఖ్య ద్వారా koresh — సెప్టెంబర్ 5, 2007 @ 4:31 సా. | స్పందించండి

 13. ధన్యవాదాలు కోరేష్ గారూ!

  వ్యాఖ్య ద్వారా Sriram — సెప్టెంబర్ 6, 2007 @ 4:22 సా. | స్పందించండి

 14. chala bacundandi shivaji veeratvanni ,, haindavajathi pourushanni rhchi chupincharu ,,,enka emaina unte naa ku mail cheyandi sir this is my mail id vijayanandchary@gmail.com..my name is vijayanand kani nannu andaru anand antaru andi ….bye cu ,,, and i want to know more stuff abt india …

  వ్యాఖ్య ద్వారా anand — ఏప్రిల్ 17, 2008 @ 2:19 ఉద. | స్పందించండి

 15. పద్యం చదివి “వీరమాతకు పుట్టిన విచ్చుకత్తి” అన్న మాట అన్నిటికన్నా బాగుందనుకొని, కిందకొచ్చి వ్యాఖ్యలు చూసేసరికి ఖంగు తిన్నాను! రాజేష్, కొత్తపాళి గార్లకి ఇందులో నచ్చనిదేముందో?

  శివాజీ అనగానే గుర్తొచ్చేది చేతిలో కత్తితో గుఱ్ఱమెక్కిన వీరయోధుడు కదా. అంచేత అతన్ని విచ్చుకత్తితో పోల్చడం నాకయితే చాలానచ్చింది.

  వ్యాఖ్య ద్వారా కామేశ్వర రావు — ఏప్రిల్ 18, 2008 @ 8:34 సా. | స్పందించండి

 16. ఆనంద్ గారూ, ధన్యవాదాలు.

  కామేశ్వర రావు గారూ, రాజేష్ గారికి ఎందుకు నచ్చలేదో నాకు తెలీదు కానీ కొత్తపాళీ గారి అభ్యంతరం మాత్రం విచ్చుకత్తి ఉపమానానికి కాస్త సార్ధకత చూపమని. అందుకే ఆయుధముగా అని మార్చాను.

  నాకు కూడా ఈ పద్యం లో వీరమాతకు పుట్టిన విచ్చుకత్తి అన్న వాక్యం చాలా ప్రీతి. మీకు నచ్చిందని చెప్పినందుకు ధన్యవాదాలు.

  అన్నట్టు మీరు గడి కూర్పరి కామేశ్వర రావు గారేనా?

  వ్యాఖ్య ద్వారా Sriram — ఏప్రిల్ 19, 2008 @ 11:18 ఉద. | స్పందించండి

 17. అవునండీ, నేను ఆ కామేశ్వరరావునే.

  వ్యాఖ్య ద్వారా కామేశ్వరరావు — ఏప్రిల్ 20, 2008 @ 3:40 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: