సంగతులూ,సందర్భాలూ….

మార్చి 1, 2007

ఆనందోదయం !

Filed under: కబుర్లు — Sriram @ 6:48 ఉద.

DSCN0932

తెలతెలవారుతుండగా పెరటి గోడ పై కూర్చుని చెరువులో ఈదులాడే చేపపిల్లల చేష్టల్లోని చిత్రాలు చూస్తుంటే, ఆనందానికి అసలు అర్ధం ఇదేనేమో అనిపిస్తుంది.

ఆలయ శిఖరాల నుండి “గంగాతరంగ రమణీయ జటా కలాపం…” అంటూ వెలువడిన శివస్తుతి వినగానే మనస్సుకి ఆ ఆనందపు అనుభవం ఏమిటో తెలుస్తుంది. “ప్రాణానల సంయోగం” వల్ల పుట్టిన నాదం ఆకాశ మార్గాన ప్రయాణించి, నీటి అలలపై తేలియాడి, భూమాత పాదాలని స్పృశించి….పంచభూత సమ్మిళతమైన ప్రణవరూపంగా సాక్షాత్కరిస్తుంది.

పాడిఆవుల వరప్రసాదమైన గుమ్మపాలు, వాటిని కడవలలో నింపి తీసుకెళ్ళే పల్లె పడచుల అందాలకి ఆఘ్రాణత్వాన్ని అద్దుతున్నాయా అనిపిస్తుంది.

కొమ్మల గుబురుల నుండి తీయటి తేట తెలుగు గానాలు వినిపించే కోయిల పాటలు వింటుంటే, పంచమ స్వరానికి గమకాలు అద్దే కొత్త ప్రయోగం చేసి భళీ అనిపించుకున్న గాయక శిరోమణియా అనిపిస్తుంది. మూడే స్వరాలతో రాగాలు కనిపెట్టిన బాలమురళీ కృష్ణ గారి కన్నా కేవలం ఒకే ఒక్క స్వరంలో ఇంత అందమైన రాగం ఆలపిస్తున్న ఈ కోయిల విద్వత్తు ఎంతగొప్పదో అనిపిస్తుంది.

తల్లి వెనుకనే ఛంగు ఛంగు మని గెంతుతూ… ఆటగా, అంబా అనే పాటగా సాగిపోయే లేగదూడల ముఖాలలోని అమాయకత్వాన్ని చూసినప్పుడు జనించే భావానికి అక్షర రూపాన్ని ఇవ్వలేను అనిపిస్తుంది.

ఈ క్షణం కదలక ఇలాగే నిలచి ఉంటే ఎంత బాగుండును అనిపిస్తుంది.

*స్వాతిగారికి కృతజ్ఞతలతో….

*ఫోటో సేకరణ – నా ఫోటో బ్లాగు నుండి.

ప్రకటనలు

6 వ్యాఖ్యలు »

 1. నిజమే ఈ క్షణం కదలకుండా వుంటే బాగుండును.మీకవిత నన్ను ఒక ప్రశాంత వనం లోకి తీసుకెళ్ళింది.అందుకే ఈ క్షణం నాకు కావాలి.

  వ్యాఖ్య ద్వారా radhika — మార్చి 1, 2007 @ 10:05 ఉద. | స్పందించండి

 2. Sriram… Bagundhi nee ananda sandhoham, appudappudu ila kalam patti nee manasuloni udveganni ma mundu ila paruchu,appudu maku authundi anandodayam 🙂

  వ్యాఖ్య ద్వారా Srujana — మార్చి 1, 2007 @ 10:44 ఉద. | స్పందించండి

 3. పోలికలూ భావనలూ బాగున్నై.
  గుమ్మపాలు పడుచుల అందాలకి సువాసన నివ్వటం గమ్మత్తైన భావన. ఆఘ్రాణత్వం అద్దటం ఇంతకు ముందు చూడని కొత్తప్రయోగం.
  కోయిఒలల గానం తెలుగు గానమే అని తీర్మానించడం మీ గడుసుదనం 🙂

  వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — మార్చి 1, 2007 @ 7:05 సా. | స్పందించండి

 4. radhika garu, Srujana gaaru…thanks.

  kottapaaLI gaarU…dhanyavaadaalu. your comments are special to me.

  annaTTu, telugu kOkilalu kadanDI telugulO paaDaayi anthE 🙂

  వ్యాఖ్య ద్వారా Sriram — మార్చి 1, 2007 @ 11:43 సా. | స్పందించండి

 5. చాలా బాగుంది సార్. మీ ఆనందోదయంలో మాకు సౌందర్యోదయం అయ్యింది. చాలా అందంగా, మధురంగా, లలితంగా ఉంది ఎంకి పాటలా. దన్యవాదాలు.
  –నాగరాజు.

  వ్యాఖ్య ద్వారా Nagaraju Pappu — మార్చి 5, 2007 @ 11:15 ఉద. | స్పందించండి

 6. నాగరాజు గారు, ధన్యోస్మి. మీకు అందం కనిపించడం వల్ల నాకు ఆనందం కలిగింది.

  వ్యాఖ్య ద్వారా Sriram — మార్చి 7, 2007 @ 4:25 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: