సంగతులూ,సందర్భాలూ….

ఫిబ్రవరి 13, 2007

ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం – శ్రీకాకుళం

Filed under: తెలుగు పద్యం,భారతదేశం — Sriram @ 9:50 ఉద.

మొన్న రాత్రి దూరదర్శన్ వారు ఈ దేవాలయాన్ని చూపించారు. కృష్ణాజిల్లాలో ఉందని చెప్పినట్టు గుర్తు. ఈ దేవాలయం క్రీ.పూ.3 వ శతాబ్దం నాటికే నిర్మించబడి ఉందని ఆధారాలున్నాయిట. మన భారతదేశంలోని అతి పురాతన దేవాలయాలలో ఇదీ ఒకటని చెప్పవచ్చు.

దేశభాషలందు తెలుగులెస్స! అని బోధించి కృష్ణదేవరాయలచే ఆముక్త మాల్యద రచింపచేసింది ఈ స్వామియే. ఈ విషయం ఎంతమంది తెలుగు వారికి తెలుసో నాకు అనుమానమే. ఐనా ఇప్పుడు తెలుగు వేరు, ఆంధ్రభాష వేరు అనుకుంటా.  ఆ కాలంలో ఇన్ని తెలివితేటలు లేవు మరి. 

ఈ స్వామి దేవాలయానికి సంబంధించి ఇంకొక ఆసక్తికరమైన ఇతిహాసం నాకు తెలిసింది ఉంది.  విజయనగర సామ్రాజ్య ప్రాభవంలో వెలిగిన ఈ దేవాలయం, తరువాత సరైన పాలన లేక నిర్లక్ష్యానికి గురి అయ్యిందిట.  అప్పుడు కాసుల పురుషోత్తమ కవి అనే ఆయన ఈ స్వామి పై నిందాస్తుతిగా ఆంధ్ర నాయక శతకాన్ని రచించాడుట. ఇది విని అప్పట్లోని జమీందారు ఈ ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరించాడని చెప్పుకుంటారు.

ఈ ఆంధ్రనాయక శతకం సీస పద్యాలతో రచించ బడింది. అద్భుతమైన ధార, ఆకట్టుకునే శైలి ఈ కవి సొత్తు. మీరు ఈ శతకాన్ని ఇక్కడ చదివి ఆనందిచవచ్చు. 

పద్యాలు చాలా సరళంగా ఉంటాయి. క్లిష్టమైన పదాలకోసం బ్రౌను నిఘంటువు వాడండి.  అర్ధం కాకపోవడం ఉండదు. 

ఈ కవి గురించి మరిన్ని విషయాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.

ప్రకటనలు

6 వ్యాఖ్యలు »

 1. ఎంత కాకతాళీయం! మొన్న విజయవాడ బస్ స్టాండులో పుణ్యక్షేత్రాల పట్టికలో ఈ గుడి గురించి చూశా. ఆప్పుడే తెలిసింది ఈ గుడి కృష్ణా జిల్లాలో ఉందని. మేము ఏడో క్లాసులో ఉన్నప్పుడు ‘చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ మకుటం’తో కొన్ని శతక పద్యాలు నేర్చుకొన్నాం. అప్పుడు నాకు తెలిసిన శ్రీకాకుళం ఒకటే- ఉత్తరాంధ్రాలోనిది. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కథ సినిమా కి, ఈ గుడికి ఏమైనా లంకె ఉందా?

  వ్యాఖ్య ద్వారా సత్యసాయి — ఫిబ్రవరి 13, 2007 @ 2:37 సా. | స్పందించండి

 2. ఆంధ్రమహావిష్ణువు దేవాలయం గురించి దూరదర్శన్ వారు చూపింఛటమూ, దాన్ని గురించి మీరు రాయటమూ చాలా సంతోషం. శ్రీకాకుళానికి దగ్గర్లోనే విజయవాడలో పెరిగినా, ఈ పట్టణం ఎప్పుడూ చూడలేదు.
  సత్యసాయి గారూ,
  ఈ ఆంధ్రవిష్ణువు ఎక్కణ్ణించి వచ్చాడో ఎవరికీ తెలీదు. ఒక జానపద వీరుడు తన వీరోచిత చర్యల వల్ల ప్రజలతో దేవుడిగా గుర్తింపబడ్డాడు అన్న కథ ఆధారంగా సినిమా తీశారు. ఆంధ్ర విష్ణువు ఆదేశంతో ఆముక్తమాల్యద ఎలా పుట్టిందో
  ఇక్కడ చదవండి.

  వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — ఫిబ్రవరి 13, 2007 @ 7:42 సా. | స్పందించండి

 3. ఇక్కడ

  వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — ఫిబ్రవరి 13, 2007 @ 7:43 సా. | స్పందించండి

 4. naaku ilaanti vishayaalu telusukoavadam caalaa ishtam.thanks.

  వ్యాఖ్య ద్వారా radhika — ఫిబ్రవరి 14, 2007 @ 12:55 ఉద. | స్పందించండి

 5. Saigaru & Radhika garu, Thanks.

  Swamygaru, Thanks for the link and the info.

  వ్యాఖ్య ద్వారా Sriram — ఫిబ్రవరి 16, 2007 @ 8:19 ఉద. | స్పందించండి

 6. శ్రీకాకుళం గ్రామం క్రిష్ణా నది ఒడ్డున, విజయవాడ కి 50 కి.మీ దూరంలో ఉంది. కాసుల పురుషోత్తమ కవి చల్లపల్లి జమీందారు ఆస్థానం లో కవి (చల్లపల్లి, శ్రీకాకుళం కి 9 కి.మీ దూరం). ఈ దేవాలయం సందర్సించాలి అంటే విజయవాడ నుండి బస్సు లో 2 గం. ప్రయాణం.
  -నేనుసైతం

  వ్యాఖ్య ద్వారా నేనుసైతం — జూలై 6, 2007 @ 4:28 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: