సంగతులూ,సందర్భాలూ….

ఫిబ్రవరి 8, 2007

అనంతా! భావ నారాయణా!

Filed under: తెలుగు పద్యం — Sriram @ 10:48 ఉద.

“లోకుల నాలుకలే ఆకులుగా” వర్ధిల్లేదే మంచి కవిత్వం అంటారు తిరుపతి వెంకటకవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు. నాకు నిజమే అనిపిస్తుంది.

కొన్ని కొన్ని పద్యాలు ఒకటి రెండు సార్లు వింటే మర్చిపోడం అంటూ ఉండదు. నిరక్షరాశ్యులు కూడా అర్ధం చేసుకోగలిగేలా ఉంటాయి. నా ఉద్దేశ్యంలో ఇలాంటి కవిత్వం రాయడం చాలా కష్టం. సమాసాల మీద సమాసాలు గుప్పించి సంస్కృత భూయిష్టంగా రాయడానికి శ్రమ పడి రాయచ్చేమో. కాని ఈ క్రింద ఉదాహరించిన పద్యంలాంటిది రాయడానికి తపస్సు చెయ్యాలి అనిపిస్తుంది.
 
కరినేలింది హుళక్కి, ద్రౌపదికి కోకల్ తెచ్చి ఇచ్చింది ద
బ్బర, కాకాసురునిన్ కటాక్షమున బ్రోచిందెల్లబధ్ధ, మహో!
శరణన్నన్ పగవాని తమ్మునికి రాజ్యంబిచ్చుటల్ కల్ల! ఇ  
త్తరి నన్నేలిన నిక్కమీ కధలు అనంతా! భావ నారాయణా!  

ఈ మత్తేభం రచించిన కవి ఎవరో నాకు తెలీదు. అనంతా! భావనారాయణా! అన్న మకుటంతో రాసిన శతకంలోది అని పెద్ద వాళ్ళు చెప్పగా వినడం.

గజేంద్రుడిని, ద్రౌపదిని,కాకాసురుని, విభీషణుని నువ్వు కాపాడావని చెప్తారు. కానీ, ఇప్పుడు నన్ను కాపాడితేనే ఈ కధలన్నీ నిజమని నమ్ముతానంటూ భగవంతుడినే  బెదిరిస్తున్నాడీ భక్తుడు. పద్యంలో ఏమి అందం! కవి ఏ సందర్భంలో ఇలాంటి పద్యం రాసుకున్నాడో కానీ, ఆ శ్రీమన్నారాయణుడి కృప సంపూర్ణంగా ఉండడం వల్లే ఇంత అందమైన పద్యం రాయగలిగాడనిపిస్తుంది.

ఈ పద్యంలో కఠినమైన పదం ఏదైనా ఉంది అంటే దబ్బర అనేది మాత్రమే. అది కూడా సందర్భాన్ని బట్టి అబధ్ధం అనే అర్ధం వచ్చేదిగా అర్ధమౌతుంది. కరి అంటే ఏనుగు అని తెలియని వాళ్ళు ఇప్పటి కాలంలో ఉన్నారనుకోండి. అది వేరే విషయం.
 
ఈ భావ నారాయణ స్వామి గుడి తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. అత్యద్భుతమైన శిల్ప సౌందర్యంతో అలరారే ప్రాచీన దేవాలయం ఇది. మరిన్ని వివరాలకై ఈ లింకు చూడండి. 

ప్రకటనలు

7 వ్యాఖ్యలు »

 1. బ్రహ్మాండం!! ఇంత సరళమైన చమత్కారం అరుదు. శ్రీనాధుని చాటువులున్నాయి గానీ వాటిలో ఆటవెలదులు, తేటగీతులే ఎక్కువ. దబ్బర అనే పదం మన తెలుగునాట ఎక్కడైనా వాడుకలో వుందేమో ఎవరైనా చెబితే తెలుసుకోవాలనుంది.

  వ్యాఖ్య ద్వారా రానారె — ఫిబ్రవరి 8, 2007 @ 10:58 సా. | స్పందించండి

 2. మంచి పద్యాన్ని పరిచయం చేసారు, శ్రీరామ్. మొదటిసారిగా ఇప్పుడే ఈ పద్యం చదివాను. చతురుడైన భక్తుడీ కవి. భావనారాయణస్వామి గుళ్ళు గుంటూరు జిల్లా బాపట్ల, పొన్నూరుల్లో కూడా ఉన్నాయి.
  ఇలాంటి చతుర భక్తి గురించి గతంలో నేనో జాబు రాసాను నా బ్లాగులో (http://pkblogs.com/chaduvari/2006/05/blog-post_17.html). ఓసారి చూడండి.

  వ్యాఖ్య ద్వారా చదువరి — ఫిబ్రవరి 9, 2007 @ 8:17 ఉద. | స్పందించండి

 3. తెలుగులోని దబ్బఱ, తమిళంలోని తప్పఱై, కన్నడలోని తబ్బరిసు – ఇవన్నీ “తప్పు”కు సంబంధించిన పదాలేనేమో!

  వ్యాఖ్య ద్వారా వార్త్తిక్ — ఫిబ్రవరి 10, 2007 @ 5:08 ఉద. | స్పందించండి

 4. రానారె గారూ,చదువరి గారూ, వార్త్తిక్ గారూ ధన్యవాదాలు.
  దబ్బరకి బ్రౌను నిఘంటువు ఇచ్చిన అర్ధం బొంకు అని…ఇక్కడ చూడండి.

  వ్యాఖ్య ద్వారా Sriram — ఫిబ్రవరి 10, 2007 @ 6:50 సా. | స్పందించండి

 5. ఒహో, దబ్బర అంటే బొంకు. కొత్తపదం తెలిసింది. థ్యాంక్యూ.

  వ్యాఖ్య ద్వారా రానారె — ఫిబ్రవరి 13, 2007 @ 3:44 సా. | స్పందించండి

 6. ఈ పద్యము చిన్నప్పటినుంచీ నాకూ కంఠతా వొచ్చు.
  పూర్తి శతకం వివరాలు తెలియరాలేదు. నేనూ వెతుకుతున్నాను.
  “భావనారాయణ” అనే మకుటంతో నా దగ్గిర ఒక శతకం ఉంది.
  కానీ, అందులో ఈ పద్యం లేదు.

  నా దగ్గిరగల శతకం పొన్నూరు లోని శ్రీభావన్నారాయణస్వామి పై
  రచింప బడింది. రచయిత “తురగ వెంకటాచలం”. ముద్రణా కాలం
  1911వ సంవత్సరం.

  వ్యాఖ్య ద్వారా A. Sai Prasad, Guntur — మార్చి 19, 2009 @ 11:03 ఉద. | స్పందించండి

 7. ఈ పద్యం ఎక్కడిదో తెలిసింది.
  అయితే ఇది “అనంతా! భావ నారాయణా!” అనే మకుటంతో కాక
  “కృష్ణా దేవకీనందనా” అనే మకుటంతో ” దేవకీనందన శతకంలో
  ఆఖరి పద్యంగా వుంది. ఈ శతకం నా దగ్గిర వుంది. కావలసిన వాలు
  sarisetty@hoతమిల్.com కు ఈ-మెయిల్ చెయ్యండి.
  అరిసెట్టి సాయి ప్రసాద్, గుంటూరు – ఫోన్: 9010522449

  వ్యాఖ్య ద్వారా ARISETTY SAI PRASAD, GUNTUR. — అక్టోబర్ 29, 2012 @ 10:41 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: