సంగతులూ,సందర్భాలూ….

ఫిబ్రవరి 5, 2007

ఈయన నిజంగానే లెజెండ్!

Filed under: Uncategorized — Sriram @ 10:33 ఉద.

వజ్రోత్సవ సభల్లో ఎక్కడా ఎవ్వరూ పట్టించుకున్నట్టు చూడలేదు. నా దృష్టిలో మాత్రం ఈయనొక లెజెండ్. ఇంటకన్నా రచ్చనే ఎక్కువ గెలిచిన డాక్టర్ పి బి శ్రీనివాస్ గారిని దూరదర్శన్ లో చాలా సార్లే చూసాను. చేతిలో నల్లటి బౌండ్ పుస్తకం, తలపైన ఊలు టోపీతో ఆయన పాడుతుంటే భలే గమ్మత్తుగా ఉంటుంది.

ఆయన ఎన్ని భాషలలో పాడారో నాకు తెలీదు కానీ, ఈ రోజే ఈ అద్భుతమైన విషయం చదివాను. ఎనిమిది భాషలలో ఆయన రచించిన కవితలని పుస్తకంగా ప్రచురించారుట. అదీ ఆయన స్వదస్తూరీలో.

మరిన్ని వివరాలకై ఈ లింకు చూడండి. 

ఆయన పాడిన కొన్ని ఆణిముత్యాలని విని ఆనందించడానికి ఇదొక చక్కని సందర్భం. ఏమంటారు? 

ప్రకటనలు

12 వ్యాఖ్యలు »

 1. “జగమేరిగిన………” అన్నట్లు, శ్రీ ప్రతివాద భయంకర శ్రీనివాస్ (శ్రీ పి.బి.శ్రినివాస్) గారికి, ఈ అత్మస్తుతి, పరస్తుతి, పరనిందలతో కొట్టుకుచచ్చిన ఆర్భాటవేదిక వజ్రోత్సవ సభ నుంచి ఎలాంటి సత్కారం ఆశించజాలము. ఆ బహుభాషాకోవిదుడు, మధురగాయకుడు అభిమానుల మనస్సులలో ఎప్పటికి వుండిపొతారు.

  వ్యాఖ్య ద్వారా valluri — ఫిబ్రవరి 5, 2007 @ 3:58 సా. | స్పందించండి

 2. Valluri gArU, chaalaa correctgaa cheppaaru.

  వ్యాఖ్య ద్వారా Sriram — ఫిబ్రవరి 5, 2007 @ 5:30 సా. | స్పందించండి

 3. పి.బి.శ్రినివాస్ అంటే కేమేరా మేన్ కాదా?నేను మణి రత్నం సినిమాల్లో ఎక్కువ గ చూస్తూవుంటా పి.బి.శ్రినివాస్ అన్న పేరు.మీరు చెప్పే ఈయన గురించి నాకస్సలు తెలీదు.

  వ్యాఖ్య ద్వారా radhika — ఫిబ్రవరి 5, 2007 @ 5:54 సా. | స్పందించండి

 4. పి.బి.శ్రీనివాస్ గారు. గొప్ప గాయకులే కానీ లెజెండ అంత పేరున్న గాయకులంటారా?

  రాధిక గారు,

  మీరు మాట్లాడుతున్నది పి.సి. శ్రీరాం గురించి. ఈయన వేరు ఆయన వేరు.

  విహారి
  http://vihaari.blogspot.com

  వ్యాఖ్య ద్వారా విహారి — ఫిబ్రవరి 5, 2007 @ 8:22 సా. | స్పందించండి

 5. కన్నడభాషలో ఈయన ఎక్కువపాటలు పాడారు. కంఠీరవ డా.రాజ్‌కుమార్ కు ఈయన పాడిన పాటలు చాలా ప్రఖ్యాతి. రాజ్‌కుమార్ స్వయానా మంచిగాయకులు. అయినా పీబీయస్ గారి గాత్రమాధుర్యం కన్నడిగులకు మరింతగా నచ్చినట్లుంది.

  వ్యాఖ్య ద్వారా రానారె — ఫిబ్రవరి 5, 2007 @ 8:54 సా. | స్పందించండి

 6. “మీరు మాట్లాడుతున్నది పి.సి. శ్రీరాం గురించి. ఈయన వేరు ఆయన వేరు.”మహా దారుణం గా తప్పులో కాలేసాను.తెలియ చెప్పినందుకు విహారి గారికి థ్యాంక్స్.పి.బి.శ్రినివాస్ అంటే “అయ్యయ్యొ..జేబులో డబ్బులుపోయనే”అన్న పాట పాడిన వారిలో ఒకరా?

  వ్యాఖ్య ద్వారా radhika — ఫిబ్రవరి 5, 2007 @ 11:54 సా. | స్పందించండి

 7. రాధిక గారూ, మంచి సంగీతం పట్ల అభిరుచి ఉంటే ఈ మధుర గాయకుడి పాటలు విని చూడండి. నేను లింకు ఇచ్చాను వ్యాసంలో. మీరు తప్పక ఆనందిస్తారు.

  విహారి గారూ, పేరుప్రఖ్యాతులకీ లెజెండత్వానికి(ఈ పదమేదో బాగుంది) సంబంధం లేదని నా అభిప్రాయం.

  అనేక భాషలలో (పదికి పైనే అనుకుంటా) వందల పాటలు పాడడం లెజెండత్వం కాదా? ఆ రోజుల్లోనే బాలీవుడ్ సంగీత దర్శకులని కూడా మెప్పించడం లెజెండత్వం కాదా? లాంటి వాదనలు నేను చెయ్యదలుచుకోలేదు. అది ఆయనకే అవమానం.

  నేను “నా దృష్టిలో” అని మాత్రమే రాసాను. అయినా కన్నడంలో ఆయనకి అంత పేరూ ఉంది కూడా. తెలుగులో ఎక్కువ పేరు రాకపోడానికి కారణం ఆయన అగ్ర హీరోలకి ఎక్కువ పాడకపోడమే. దీనికి కారణం ఏమిటి అన్నది రాస్తే కందిరీగల తుట్ట కదిపినట్టౌతుంది. డా. రాజ్‌కుమార్ కూడా అగ్ర హీరోనే అయినా స్వతహాగా గాయకుడవ్వడం వల్ల కాబోలు ఈయన ప్రతిభ గుర్తించి పాడించుకున్నారు. అది ఆయన గొప్పతనం అని ఈ మధ్యనే ఎస్పీబీ గారు చెప్తే విన్నాను.

  వ్యాఖ్య ద్వారా Sriram — ఫిబ్రవరి 6, 2007 @ 5:45 ఉద. | స్పందించండి

 8. శ్రీరామ్ గారు అన్నట్లు పీబీశ్రీనివాస్ గారు నిజంగానే లెజెండ్. ఆమధ్య ఆయన ఇంటర్వ్యూ చూసాను మాటీవీ గుర్తుకొస్తున్నాయి లో. చక్కగా మాట్లాడారు. పాటలు పాడటమే కాదు, రాస్తారు కూడాను. నేను లెజెండును కానా అని దేబిరించే వారికి, ఆయన వంటి వారికీ హస్తిమశకాంతరం ఉంది.

  ఈ లెజెండనేది క్రమేణా బూతుపదమైపోతోంది, పొల్లు మాటైపోతోంది. ఎవరినైనా లెజెండు అని మన్నించబోతే నన్నలా అనకండి అని బతిమిలాడుతారేమో, భావిలో!

  వ్యాఖ్య ద్వారా చదువరి — ఫిబ్రవరి 6, 2007 @ 2:43 సా. | స్పందించండి

 9. నాకు తెలిసి…లెజెండు అంటే ప్రజల్లో, వయో బేదం లేకుండా, ఒక బలమైన(చనిపొయిన తరువాత కూడా) ముద్ర వేశిన వ్యక్తి అని అర్థం.

  “నేను లెజెండు కు అర్హుడిని” అని డబ్బా కొట్టుకునే మోహన్ బాబు తో పోల్చితే పి.బి శ్రీనివాస్ గారికి ఓ పది లెజెండ్రీ అవార్డులు ఇవ్వచ్చు.

  విహారి
  http://vihaari.blogspot.com

  వ్యాఖ్య ద్వారా విహారి — ఫిబ్రవరి 6, 2007 @ 5:31 సా. | స్పందించండి

 10. “ఈ లెజెండనేది క్రమేణా బూతుపదమైపోతోంది, పొల్లు మాటైపోతోంది.”
  హహహా…చదువరిగారూ, చక్కగా సెలవిచ్చారు…

  విహారి గారూ…నేను ఇక్కడ లెజెండ్ అనే పదాన్ని వాడడానికి ఈ మధ్య జరుగుతున్న events కూడా కొంత కారణం.

  వ్యాఖ్య ద్వారా Sriram — ఫిబ్రవరి 6, 2007 @ 5:59 సా. | స్పందించండి

 11. రాధిక గారూ,
  ‘అయొయో చేతిలొ డబ్బులు పోయెనే’ పాడింది మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు. ఇది కులగోత్రాలు సినిమాలో రేలంగి, రమణారెడ్డిల మీద చిత్రీకరించారు.
  పిబి శ్రీనివాస్ పాడిన తెలుగు పాటల్లో బహుశా ఎక్కువ ప్రాచుర్యం పొందింది “ఓహో గులాబి బాలా, అందాల ప్రేమ మాలా” అయ్యుండచ్చు.

  వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — ఫిబ్రవరి 12, 2007 @ 9:25 సా. | స్పందించండి

 12. ఏమి రామ కధ శబరీ శబరీ…, శ్రీ రఘురాం జయ రఘురాం… ఇవి అతి మధురమైన పాటలు. శ్రీనివాస్ గారి గొంతులోని మార్దవానికి ప్రతీకలు.

  ఈ లింకు చూడండి. ఆయన గురించి మరిన్ని విశేషాలు తెలుస్తాయి.

  వ్యాఖ్య ద్వారా Sriram — ఫిబ్రవరి 13, 2007 @ 5:54 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: