సంగతులూ,సందర్భాలూ….

ఫిబ్రవరి 2, 2007

ఉక్కు – భారతీయుల హక్కు!

Filed under: భారతదేశం — Sriram @ 11:25 ఉద.

“మీరేకనక ఉక్కు తయారు చెయ్యగలిగితే నేను ఆ ఉక్కు ప్రతీ పౌండు తింటాను”

బ్రిటీషు రైల్‌వే అధికారి సర్ ఫ్రెడ్రిక్ ఆప్కాట్, భారతీయుడైనందుకు జంషెట్జీ టాటా ని ఈసడిస్తూ అన్నమాటలవి (లింకు). 1900 ప్రాంతంలో జంషెట్జీ టాటా భారతదేశంలో ఉక్కు కర్మాగారం నెలకొల్పడానికి ప్రయత్నించినప్పుడు ఆయన ఎన్నో ఇలాంటి ఆటంకాలు ఎదుర్కోవలసి వచ్చింది.  ఈనాడు అదే టాటా కంపెనీ బ్రిటీషు కంపెనీ ఐన కోరస్ స్టీల్ ని కొనుగోలు చేసింది. నిజంగా అద్భుతమైన విషయం.

అసలు ఉక్కు పరిశ్రమ భారతీయుల సొత్తు. అనాది కాలం నుంచీ మన దేశం లోహ పరిజ్ఞానం, సాంకేతికతలలో ముందు ఉంది. క్రీ||పూ|| 3వ శతాబ్దంలోనే అలెగ్జాండర్ తిరిగి వెళుతూ మన దేశం నుండి 100 మంది లోహ నిపుణలని తీసుకెళ్ళాడని చరిత్ర చెప్తోంది.

15వ శతాబ్దం వరకూ మన దేశం ప్రపంచంలోనే అతి ఉత్తమమైన ఉక్కు ని తయారు చేసేది. పైగా ఈ పరిశ్రమ మన ఆంధ్ర, కర్నాటక ప్రదేశాలలో విస్తరించి ఉండేది.ఈ ఉక్కుని చైనా, అరేబియా, పర్షియా, యూరోపులకు యెగుమతి చేసేవారు. దీనినే వాళ్ళు ఊట్జ్ అని పిలిచేవారు. ఇది ఉక్కు పదంయొక్క రూపాంతరమే. ఈ ఉక్కుని ఉపయోగించి వాళ్ళు డమాస్కస్ అనే పేరుగల కత్తులు,  ఆయుధాలు తయారు చేసుకునేవారు. అంటే మన దగ్గర కొన్న ఉక్కుతో మనపైనే దండెత్తి వచ్చారన్నమాట!  

అరబ్బుల, యూరోపియనుల దండయాత్రలు, ఆక్రమణల తరువాత మన దేశ పరిశ్రమలన్నింటినీ వారు నాశనం చెయ్యడంలో భాగంగా ఈ పరిశ్రమ కూడా నామ రూపాలు లేకుండా పోయింది. మనం కేవలం ముడి సరుకు ఎగుమతిదారులుగా మిగిలిపోయాం.

ఈ విషయం మీరెవరైనా స్కూలు పుస్తకాలలో, హిస్టరీ టెక్స్ట్ బుక్స్‌లో చదువుకున్నారా? నాకైతే తెలీదు. ఇలాంటి మన వారసత్వం మీద మనకి గౌరవం కలిగించే విషయాలు మనకి బోధించరు.

ఏమైతేనేం, ఇప్పుడైనా తెలిసినందుకు ఆనందించా. ఆసక్తి ఉన్నవారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వారి వెబ్‌సైట్లో ఈ లింకు చూడచ్చు. 

http://en.wikipedia.org/wiki/Wootz_steel – వికీ లింకు

ప్రకటనలు

8 వ్యాఖ్యలు »

 1. నిజంగా ఇది చాలా గొప్ప విశయం !!

  చాలా మంచి లింక్స్ ఇచ్చారు థాంక్యు !!

  వ్యాఖ్య ద్వారా Krishh — ఫిబ్రవరి 2, 2007 @ 2:10 సా. | స్పందించండి

 2. అవును. ఇది మనం గర్వించదగ్గ విషయం.
  –ప్రసాద్
  http;//blog.charasala.com

  వ్యాఖ్య ద్వారా Prasad Charasala — ఫిబ్రవరి 2, 2007 @ 4:05 సా. | స్పందించండి

 3. తెల్లగా వెలుగులు చిమ్ముతూ ప్రవహించిన ఇనుము ఘనీభవించి ఉక్కైనపుడు, బహుశా ఆ బ్రిటిషు అధికారి అవాక్కై ఉంటాడు. తానన్న మాటలను మింగి, నీళ్ళు నమిలి ఉంటాడు బతికి ఉండుంటే! ఉత్తేజాన్ని కలిగించే వార్తను చెప్పారు, థాంక్సు శ్రీరామ్ గారు.

  ఇక.. రాహుల్ సాంకృత్యాయన్ రాసిన “వోల్గా నుండి గంగ దాకా” పుస్తకంలో మనవారి లోహ నైపుణ్యానికి “బయటినుండొచ్చిన” ఆర్యులు అబ్బురపడినట్లుగా రాసారనుకుంటా – ఓసారి సరిచూసుకోవాలీ విషయాన్ని. (అసలు ఆర్యుల దండయాత్ర సిద్ధాంతంపైనే భిన్నాభిప్రాయాలున్నాయనుకోండి.)

  వ్యాఖ్య ద్వారా చదువరి — ఫిబ్రవరి 2, 2007 @ 6:33 సా. | స్పందించండి

 4. చాలా మంచి విషయాలు చెప్పరు. ఎక్కడో చదివాను …మనదేశం లో ఈమద్య చాలా సంవత్సరాల క్రితపు కత్తులు లభించాయట.అవి ఇప్పటికి తుప్పు పట్టకుండా,చెక్కు చెదరకుండా వున్నాయట.అవి ఉక్కు కత్తులని భావిస్తున్నారు.ఉక్కు మరియు ఇతర పదార్ధాలను ఏ ఏ నిష్పత్తులో కలిపి తయారు చేసారో అని ఇప్పుడు పరిశోధనలు చేస్తున్నారట.

  వ్యాఖ్య ద్వారా radhika — ఫిబ్రవరి 2, 2007 @ 6:50 సా. | స్పందించండి

 5. ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు కావడమంటే ఇదే.

  మన ప్రతిభా ఇప్పుడు అందరి కళ్ళ ముందు కనపడుతోంది.
  ఉక్కు పరిశ్రమల్లో-ఇప్పుడు ప్రపంచ పోటీ ఇద్దరు భారతీయుల మధ్యే జరుగుతోంది. టాటా మరియు మిట్టల్ ల మధ్య. ఇదిద్ చాలు మన గురించి చెప్పడానికి.

  విహారి
  http://vihaari.blogspot.com

  వ్యాఖ్య ద్వారా విహారి — ఫిబ్రవరి 2, 2007 @ 11:08 సా. | స్పందించండి

 6. చక్కని విషయం సరైన సమయంలో చెప్పారు. ధన్యవాదాలు

  వ్యాఖ్య ద్వారా Dil — ఫిబ్రవరి 3, 2007 @ 7:54 ఉద. | స్పందించండి

 7. క్రిష్ గారు, ప్రసాద్ గారు….ధన్యవాదాలు.
  చదువరిగారూ, స్వాగతం. ఈ ఆర్యుల సిధ్ధాంతం అంతా బూటకం అని నాకు అనిపిస్తుంది. దానిని గురించి ఎప్పుడైనా చర్చిద్దాం.
  రాధిక గారూ, మీరు విన్నది నిజమే నండీ…మన ప్రాచీన ఉక్కు ఫార్ములా ఇప్పటికీ మిస్టరీనేట.
  విహారి గారూ, ఇది చాలా ఆనందకరమైన విషయం.

  వ్యాఖ్య ద్వారా Sriram — ఫిబ్రవరి 3, 2007 @ 10:02 ఉద. | స్పందించండి

 8. Dilgaaru…Thanks!

  వ్యాఖ్య ద్వారా Sriram — ఫిబ్రవరి 3, 2007 @ 4:30 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: