సంగతులూ,సందర్భాలూ….

జనవరి 31, 2007

ఏమున్నది గర్వకారణం!

Filed under: సినిమాలు — Sriram @ 6:19 సా.

ఎంతో ఆర్భాటంగా మొదలైన తెలుగు సినిమా వజ్రోత్సవాలు అభాసుగా ముగిసాయి. అయినా అది దిష్టి చుక్కట లెండి. నాకు అర్ధంకాని విషయమల్లా దిష్టి కొట్టే అంత గొప్ప స్థానంలో తెలుగు సినిమా ఎక్కడ ఉందా అని. అసలు రెండున్నర కోట్ల ఖర్చుతో ఈ ఉత్సవాలు జరపడానికి కారణం తెలుగు సినిమాకి ప్రస్తుతం లేని గుర్తింపు తేవడమేనని కదా వారు చెప్తున్నది. జాతీయ స్థాయిలో ఎక్కడ సినిమా ఉత్సవాలైనా తెలుగు సినిమాకి గుర్తింపు లభించడంలేదని కదా మన సిమిమాకీయులు వాపోతున్నది.

గుర్తింపు అంటే ఏమో అనుకునేరు, గుర్తింపు అంటే నిలువెత్తు కటౌట్లు పెట్టడం వాటికి రబ్బరు బంతుల దండలు వెయ్యడం లాంటివన్నమాట. వంశవృక్షాలు ప్రదర్శించడం అని కూడా చదువుకోవచ్చు అనుకుంటా.

ఇంతకీ ఇలా హైదరాబాదులో ఒకరికొకరు సన్మానాలు చేసుకోడం వల్ల ఇది ఎలా సాధ్యమౌతుందో నాకు చిక్కని విషయం. జాతీయ, అంతర్జాతీయ చలన చిత్ర ఉత్సవాలలో గుర్తింపు రావాలంటే మంచి కళాత్మక విలువలున్న సినిమాలు తియ్యాలి. ఇది మాత్రమే నాకు తెలిసిన విషయం. కనీసం కాస్త అర్ధవంతమైన సన్నివేశాలున్న సినిమా ఐనా తియ్యాలి. అలాంటి సినిమాలు తియ్యడానికి ప్రయత్నించే వాళ్ళని ప్రోత్సాహించాలి. వ్యక్తి పూజకి,  ముఖస్తుతికి అలవాటు పడ్డ మన కధానాయకులకి ఈ విషయాలు అర్ధం కావడం కొంచెం కస్టమేనేమో.

మేమంతా ఒక్కటే అంటూ పాటలు పాడిన వీరిలో ఒక్కరైనా గత పది సంవత్సరాల కాలంలో అంతర్జాతీయ స్థాయి కాదు కదా కనీసం జాతీయ స్థాయిలో ఉత్తమమైనది అని చెప్పుకో గలిగే ఒక్క సినిమాలో ఐనా నటించారా అని. ఈ ఆత్మావలోకనం చేసుకోకుండా నేను గొప్ప అంటే నేను గొప్ప అని అరుచుకోవడం వల్ల, తొడలు కొట్టుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం?

ఒక మంచి సినిమా ఎలా పుడుతుంది? ఒక సంస్కృతి లోంచి పుట్టచ్చు. ఒక గొప్ప సంప్రదాయంలోచి పుట్టచ్చు. ఇలాంటి కోవలోకి వచ్చేవి శంకరాభరణం, ముత్యాలముగ్గు లాంటివి. కానీ సంస్కృతీసంప్రదాయాలని, మన కళలనీ చివరకి మన భాషనీ వదిలేసి చాలా రోజులే ఐంది. ఆంగికం, వాచకం మన ఇప్పటి నటులకి తెలియని విషయాలు. వదిలేద్దాం. కనీసం సమకాలీన అంశాలతో, మంచి కధతో ఒక చిత్రాన్ని నిర్మించగల నైపుణ్యం ఐనా ఉందా? టాం హేంక్స్ నటించిన టెర్మినల్ అన్న సినిమా ఒక మంచి ఉదాహరణ. ఇలాంటి సృజనాత్మకమైన చిత్రాలైనా మనకున్నాయా కనీసం?

ఏమి చూసి గుర్తించేస్తుంది ప్రపంచం! మన సినీ ప్రముఖుల బేంక్ బేలన్సులు చూసా? 

8 వ్యాఖ్యలు »

 1. “మంచి కళాత్మక విలువలున్న సినిమాలు తియ్యాలి”caalaa baaga cepparu.

  వ్యాఖ్య ద్వారా radhika — ఫిబ్రవరి 1, 2007 @ 12:47 ఉద. | స్పందించు

 2. మీరన్నట్లు ఇప్పుడు తెలుగు సినిమా దిష్టి తగిలే స్థాయిలో చస్తే లేదు. ఒకప్పుడు మాత్రం ఉండేది. మనకి జాతీయ స్థాయి అవార్డులు రాక పోవటానికి కొంత కారణం రాజకీయాలు, తెలుగు సినిమా లో లోపించిన కళాత్మక విలువలు. ఈ రోజుల్లో ఉన్న మన రకరకాల స్టార్లకు అసలు కొన్ని పాత్రలు చేసే ధైర్యం అయినా ఉందా? ఉమ్రావ్ జాన్లో అభిషేక్ చేసినది, స్వదేశ్ లో షారుక్ చేసిన వంటివి. మెగా, మైక్రో, పవర్, యూత్ అంటూ రకరకాల స్టార్ లను తమిళ సినీ రంగం నుంచి అప్పు తెచ్చుకుని అదే వజ్రపు తళుకు అని మురిసిపోతున్నారు కదా మన సినిమా జనం. ఇంకెక్కడి విలువలు.

  వ్యాఖ్య ద్వారా Savvy? — ఫిబ్రవరి 1, 2007 @ 5:36 ఉద. | స్పందించు

 3. మొహమాటం లేకుండా చెప్పేశారు.
  మణి రత్నం లా జాతీయ సమస్య లో, విశ్వనాధ్ లా కళాత్మకంగానో, బాపూ లా అందం గానో, జంధ్యాల లా హాస్యం, తెలుగుతనం తోనో…
  ఇప్పుడు తెలుగు లో ఎవరు తీస్తున్నారు.
  ఇప్పటి సినిమాల్లో
  నాయకుడంటే తలలు నరకాలి అనేది ఒక లక్షణం
  కధానాయిక అంటే ఎవ్వరికి గౌరవం కలగకూడదు అనేది ఒక లక్షణం
  హాస్యం లో వెకిలితనం ఉండటం ముచ్చటగా మూడో లక్షణం.
  అబ్బో చెప్పాలంటే ఇలాంటి అవలక్షణాలన్నీ మన సినిమా లో పెట్టుకుని ఎన్ని ప్రయత్నాలు చేసి ఏం లాభం.

  వ్యాఖ్య ద్వారా swathi — ఫిబ్రవరి 1, 2007 @ 6:35 ఉద. | స్పందించు

 4. తప్పంతా సినిమా తీసేవాళ్ళ మీదే నెట్టెయ్యకండి. చూసేవాళ్ళా మీదా బోలెడంత వుంది.
  కె.విశ్వనాధ్ ఇప్పుడు ఎందుకు సినిమాలు చేయటం లేదు? ఆయన ఎంతో కళాత్మకంగా తీస్తాడూ కానీ ఏదీ ఈ ప్రజలకు నచ్చద్దూ! కళ కోసమే సినిమా తీస్తే లాభాలు రానప్పుడు వాళ్ళెవరికోసం చేతులు కాల్చుకోవాలి? వైవిద్యభరితంగా ఒక “రోజా”, “బొంబాయి”, “బొమ్మరిల్లు”, “గోదావరి” లాంటివి తీస్తే తీసేవాళ్ళకు అవి ఆడతాయో లేదో తెలియదు. కానీ ఒక రేప్ సీను, కత్తులతో పాశవికంగా నరుక్కొనే ఒక సీను, నల్లగా పొట్టిగా వుండే వాన్ని అసహ్యకరంగా చీదరించుకునే సన్నివేశము (ఇది మనకు హాస్యమట!) లేదా లావుగా వున్న పెళ్ళికూతురు మీద జోకులు ఇలా తీస్తే మటుకు ఖచ్చితంగా ఆడుతుందని నిర్మాతలు బల్ల గుద్ది చెబుతారు. నష్టమైతే రాదు.
  “యధా రాజా తధా ప్రజా” అనేది రాజుల కాలం మాట. “యధా ప్రజా తధా రాజా” అనేది ప్రజా కాలం మాట.
  –ప్రసాద్
  http://blog.charasala.com

  వ్యాఖ్య ద్వారా Prasad Charasala — ఫిబ్రవరి 1, 2007 @ 2:07 సా. | స్పందించు

 5. నేను మీమాటతో వందశాతం ఏకీభవిస్తున్నాను. “ఇది ఢిల్లీదాకా సౌండివ్వాలి” అని నా అభిమాన మెగాస్టార్ అన్నారు. గొంతుచించుకుంటే సౌండిస్తుందా? మలయాళం సినిమాలు ఇలాంటి ఆర్భాటాలేమీ లేకుండానే ఢిల్లీ దాటి “సౌండిస్తున్నాయే”. “వాళ్లక్కావలసింది చిన్న ఎంటర్‌టెయిన్‌మెంట్. అదివాళ్లకిద్దాం.” అదిచ్చేసి బయటకుపంపేస్తే ఢిల్లీదాక ఎలావెళ్తుంది మన సినీమహిమ? అజీర్తి కలిగించని సన్నివేశాలున్న ఏ సినిమా అయినా జనం చూస్తారు. శేఖర్ కమ్ముల సినిమాలే ఇందుకు తాజా ఉదాహరణ. మంచి సంగీతం, కొద్దిమేరకైనా విలువలున్న సాహిత్యం విని, చూసి ఆనందించలేని అథమ స్థితిలో జనంలేరని కొన్ని కొన్ని సినిమాలింకా నిరూపిస్తూనే వున్నాయి. మీరన్నట్లు వ్యక్తిపూజ, ముఖస్తుతులు ముఖ్యమైనంతకాలం సౌండు మనం ఇవ్వాల్సిందేగానీ మన సినిమాలివ్వవు. మంచి నటసామర్థ్యం కలవాళ్లకుగాక కథానాయకునివేషం వేసినవానికి గుర్తింపు, గౌరవం, భజన జరిగినంతకాలం ఇంతే. ఇది మన ప్రజల్లో రావలసిన చిన్నమార్పు.

  వ్యాఖ్య ద్వారా రానారె — ఫిబ్రవరి 1, 2007 @ 2:39 సా. | స్పందించు

 6. రాధిక గారూ, కృతజ్ఞతలు.
  సుధాకర్ గారు,స్వాతి గారు, రానారె గారు… మీ అభిప్రాయలు తెలిపినందుకు ధన్యవాదాలండీ…
  ప్రసాద్ గారూ, మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. నా జవాబు కోసం తరువాతి పోస్ట్ చూడండి….

  వ్యాఖ్య ద్వారా Sriram — ఫిబ్రవరి 1, 2007 @ 4:59 సా. | స్పందించు

 7. మీరు సరిగ్గా చెప్పార్లెండి…లేక్ పోతే మనకి కనీసం “గురు” లాంటి సినిమా కూడా లేదు… అదేమంటే రేపు ఏ టాగూర్ తోనో పోల్చేస్తారు చూడండి. గురు ఏదో పిస్తా అని కాదు నేను చెప్తుంది… అందులొ ఒక వ్యక్తిత్వాన్ని పొగిడితే మనవాళ్ళు వ్యక్తులను పొగుడుతారు సినిమాలో. హీరో టాలెంటెడ్/స్టార్ అని ఓపెనింగులలో కనిపిస్తే చాలు రా బాబు అంటే సరిపొతుంది…కానీ వెళ్ళు సినిమా నిండా చెత్త ఫైటులు పెట్టి చివ్వరికి స్టార్ ని చేస్తారు.. విడ్డూరం కాకపోతే ఎంటి?

  వ్యాఖ్య ద్వారా మధు — ఫిబ్రవరి 1, 2007 @ 7:47 సా. | స్పందించు

 8. మధు గారూ, మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

  వ్యాఖ్య ద్వారా Sriram — ఫిబ్రవరి 2, 2007 @ 6:04 ఉద. | స్పందించు


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: