సంగతులూ,సందర్భాలూ….

జనవరి 23, 2007

చంద్రశేఖరా!

Filed under: తెలుగు పద్యం — Sriram @ 7:00 సా.

పద్య కవిత్వం అనగానే కొద్దిగా బాధగా ముఖం పెట్టి అది ఏమీ అర్ధం కాదనీ, పాషాణమైన సంస్కృత సమాసాలతోనూ ఏ  మాత్రం వాడుకలో లేని గ్రాంధిక పదాలతోనూ నిండి ఉంటుందని అనే వాళ్ళు తప్పక ఈ పద్యం చదావాలి.

చేరువ వాడపల్లి నరసిమ్ముడి తీరతమోయి బోగమ
మ్మోరుల ఆట జూస్తి! వారి ముంగిలి దేవుడదెంత? విద్దెలో
తీరు పయాస గంటి, ఒక తిత్తిని నేర్పున నూదువాని కా
లూరక మొక్కబుధ్ధగు! అహో యను మూఢుడు చంద్రశేఖరా!

ఈ చంద్రశేఖర శతకం రాసింది ఎవరో నాకు తెలీదు. నా దగ్గర పుస్తకం కూడా లెదు. ఎక్కడో చదివిన గుర్తే. ఒక్కసారి చదవగానే గుర్తున్న ఈ పద్య ధార అమృతప్రాయంగా అనిపిస్తుంది నాకు. కవిత్వం అంటే ఇది. రసం అంటే ఇది.

ఇదే మకుటంతొ మొత్తం శతకమంతా రాసిన ఆ కవి, మొత్తం శతకమంతా ఇదే ధారలో నడిపించాడని చెప్పుకోవడం విన్నాను. ఇంకా ఒకటి రెండు పద్యాలు తెలుసు కానీ ఇప్పుడు గుర్తుకు రావడం లేదు.

మీకెవరికైనా ఈ శతకం వివరాలు తెలిస్తే దయచేసి తెలియచేయండి.

ప్రకటనలు

3 వ్యాఖ్యలు »

  1. కొత్త శతకాన్ని పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు!

    వ్యాఖ్య ద్వారా swathi — జనవరి 24, 2007 @ 6:30 ఉద. | స్పందించండి

  2. ఈ శతకం గురించి వినలేదు.మీరు విన్నాను అంటున్నారు కాబట్టి ఎక్కడో అక్కడ పొందుపరచబడే వుంటాయి.త్వరలో వెలుగుచూస్తాయని ఆశిద్దాం.

    వ్యాఖ్య ద్వారా radhika — జనవరి 24, 2007 @ 10:57 సా. | స్పందించండి

  3. dhanyavaadaalandi…i am also hoping for that.

    వ్యాఖ్య ద్వారా Sriram — జనవరి 25, 2007 @ 8:37 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: