సంగతులూ,సందర్భాలూ….

జూలై 7, 2006

విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు!

Filed under: పుస్తకాలు — Sriram @ 6:30 ఉద.

ఈ మధ్య నేను చదివిన తెలుగు పుస్తకాలలో ఒకటి ఇది. విశ్వనాధ వారి ఊహాశక్తి కి, సృజనాత్మకతకి ఇది చక్కటి తార్కాణం. అద్భుతమైన వ్యంగ్యం, కడుపుబ్బనవ్వించే హాస్యం వీటికిమించి ప్రతి ఒక్కళ్ళనీ ఆలోచింపచేసే సునిశితమైన తర్కం ఈ పుస్తకంలో కనిపిస్తాయి.మన భాష గొప్పతనాన్ని తెలియచేస్తూ, గుడ్డిగా మనం పరభాషావ్యామోహంలో ఎలా కొట్టుకుంటున్నామో చూపిస్తుంది ఈ పుస్తకం. తెలుగు భాషని అభిమానించేవాళ్ళు తప్పక చదవవలిసిన పుస్తకం.
ఈ పుస్తకాన్ని ఇక్కడ నుంచి డౌన్ లోడ్ చేసుకోచ్చు. ఈ పుస్తకాన్ని చదవడానికి  ఈ ప్లగిన్ కూడా అవసరం.
గమనిక: ఆర్కైవ్।ఆర్గ్ నుంచి సేకరించబడినది.హక్కుల విషయమైన వివాదాలు ఏమైనా ఉంటే వెంటనే తెలియపరచగలరు.

18 వ్యాఖ్యలు »

  1. Hi, The yousendit link has expired and I tried to search on http://www.archive.org, but couldnt find it. pls post the link of the file in archive.org site or mail me the link,

    Thanks,

    Bye

    వ్యాఖ్య ద్వారా Kiran — జూలై 12, 2006 @ 9:41 ఉద. | స్పందించండి

  2. Hi Kiran…i have edited the link. it should work now.

    వ్యాఖ్య ద్వారా Sriram — జూలై 12, 2006 @ 10:07 ఉద. | స్పందించండి

  3. Thank you very much. By the way do you get all these books from archive.org or some other site ??

    వ్యాఖ్య ద్వారా Kiran — జూలై 13, 2006 @ 3:44 ఉద. | స్పందించండి

  4. You are welcome! this book i downloaded from archive.org…and i dont have many telugu e-books otherwiswe…

    వ్యాఖ్య ద్వారా Sriram — జూలై 13, 2006 @ 9:45 ఉద. | స్పందించండి

  5. మాష్టారూ, విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు పుస్తకం మీద మీ అభిప్రాయం చూడంగానే ఎంతో ఆనందం కలిగింది। నేను కూడా ఈ పుస్తకాన్ని చదివాను। నా బ్లాగులో ఒక పోష్టు చేసాను కూడా ।

    http://kinnerasani.blogspot.com/2006/06/blog-post.html

    వ్యాఖ్య ద్వారా PVSS Sri Harsha — సెప్టెంబర్ 12, 2006 @ 5:59 సా. | స్పందించండి

  6. mee post choosaanandi…saamethalu baagunnayi…

    వ్యాఖ్య ద్వారా Sriram — సెప్టెంబర్ 13, 2006 @ 5:53 ఉద. | స్పందించండి

  7. HII
    LINK PANI CHEYYTLEDU.AVARAINAA NAAKU AA LINK PAMPANDI.PLSSS

    వ్యాఖ్య ద్వారా KARTHIK — డిసెంబర్ 22, 2006 @ 10:42 సా. | స్పందించండి

  8. avunu..link pani cheyadam ledu…chachinatlundi(expired)….kastha bathikidduroo………

    Dhanyavadamulu

    వ్యాఖ్య ద్వారా Sudheer — జనవరి 26, 2007 @ 8:24 ఉద. | స్పందించండి

  9. files associated with this link have expired అని వస్తోంది అండి ఆ పుస్తకం డౌన్లోడ్ చేద్దాం అనుకుంటూ ఉంటే! 😦
    ఆ ప్లగిన్ల పేజీలో నాలుగు ప్లగిన్లు ఉన్నవి. ఏది డౌన్లోడ్ చేసుకోవాలి, ఒకవేళ పుస్తకం దొరికితే?

    వ్యాఖ్య ద్వారా Sowmya — సెప్టెంబర్ 11, 2007 @ 10:37 ఉద. | స్పందించండి

  10. see here:

    విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు(మళ్ళీ…)

    also, i have mailed you the book as a pdf. hope you have received.

    వ్యాఖ్య ద్వారా Sriram — సెప్టెంబర్ 15, 2007 @ 6:05 సా. | స్పందించండి

  11. ఆర్ఖైవ్స్ నుండే ఈ పుస్తకాన్ని నేను కొంత భగం చదివాను. కంప్యూటర్లో పుస్తకాలు చదవడమంటే నాకు చాలా కష్టం. మీరు మళ్లీ గుర్తుచేశారుగనుక మామూలుగా అచ్చయిన ప్రతి దొరికితే తెప్పించుకొని చదవాలి.

    వ్యాఖ్య ద్వారా రానారె — సెప్టెంబర్ 16, 2007 @ 1:33 ఉద. | స్పందించండి

  12. @రానారె:
    అచ్చు ప్రతి దొరుకుతుంది….
    మా లైబ్రరీ లో ఉందని ఇప్పుడే నేను ఈ పుస్తకం గురించి చెబితే నా స్నేహితుడు చెప్పాడు. విశాలాంధ్ర వారినో…లేకుంటే ఈ విశ్వనాథ వారి పుస్తకాలని వేసే ట్రస్టు వాళ్ళ వెబ్ సైటు నో ప్రయత్నించండి..
    http://www.vishwanathasahityapeetham.com

    వ్యాఖ్య ద్వారా vbsowmya — సెప్టెంబర్ 20, 2007 @ 11:38 సా. | స్పందించండి

  13. ఓ గంట క్రితమే చదవడం మొదలుపెట్టాను… హాస్యం, వ్యంగ్యం బాగున్నాయి…. పుస్తకం అసలు ఆపాలి అనిపించనంత సరదాగా ఉంది మొదటి పేజీల్లో అయితే. అప్పుడెప్పుడో విశ్వనాథ వారి “హాహాహూహూ” అన్న చిన్న నవల ఒకటి చదివాను… అది కూడా బాగా హాస్యం,వ్యంగ్యం కలిసి ఉంటుంది…. అది చదివారా శ్రీరాం గారూ మీరు?

    వ్యాఖ్య ద్వారా vbsowmya — సెప్టెంబర్ 20, 2007 @ 11:40 సా. | స్పందించండి

  14. పుస్తకాలు కొనుక్కునే తపన ఉన్న వారికి – విశ్వనాథ నవలలన్నీ ఒక సెట్టుగా దొరుకుతున్నాయి. చక్కని అట్టపెట్టె పేకింగ్ లో. వెల సుమారు ఐదు వేల రూపాయలు (కచ్చితంగా గుర్తు లేదు). ఇది మంఛి అవకాశం.
    ఈ నవలిక మొన్ననే చదివాను. విశ్వనాథ భాష ఇంత సరళంగా కూడ ఉంటుందా అని ఆశ్చర్యం వేసింది మొదట. దీనిగురించి చాలా వివరంగా మాట్లాడాల్సి ఉంది. త్వరలోనే బ్లాగుతాను.

    వ్యాఖ్య ద్వారా కొత్తపాళీ — సెప్టెంబర్ 21, 2007 @ 5:22 ఉద. | స్పందించండి

  15. సౌమ్యా, రానారె కి నేను పంపాలెండి పుస్తకం. నేను విశ్వనాధగారి పుస్తకం చదివింది ఇది ఒక్కటేనండీ. మీరు చెప్పిన పుస్తకం గురించి ఎప్పుడూ వినలేదు. ఈసారి దొరికితే చదవాలి.
    గురువుగారూ, ఆ సెట్టు ఎక్కడ దొరుకుతుంది? మీ సమీక్ష కోసం ఎదురుచూస్తుంటా. త్వరగా అందించండి 🙂

    వ్యాఖ్య ద్వారా Sriram — సెప్టెంబర్ 21, 2007 @ 12:22 సా. | స్పందించండి

  16. హాహాహూహూ లో ఒక కిన్నరుడు లండన్ ట్రెఫాల్గర్ స్క్వేర్లో స్పృహతప్పి పడి ఉండడంతో మొదలవుతుంది. గుర్రపు తలతో ఉన్న అతన్ని ఏదో విచిత్రమైన జంతువు అనుకుని బోనులో పెట్టి స్టడీ చెయ్యబోతారు. మెల్లగా వారిలో కొందరు ఇండోలజీ, సంస్కృత పండితులు ఇతను చాలా పాతకాలపు సంస్కృతం మాట్లాడుతున్నాడని గ్రహించి అతనితో సంభాషించడం మొదలు పెడతారు. భారతీయ పాశ్చాత్య ఆలోచనా విధాలని పక్క పక్కన పెట్టి ఒక్క వీక్షణంలో తూచడం ఇందులో ఒకభాగం. కొంత హాస్యం ఉన్నా, నాకీ కథ ఎక్కువ విషాదంగా అనిపించింది. డ్రామా కూడా బాగా ఎక్కువే. దానికంటే విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు లోతైన పుస్తకం. దీనిలో .. ఇప్పుడెందుకులే, రాస్తాను త్వరలోనే.
    ఆ సెట్టు పెద్ద పుస్తకాల షాపుల్లో ఎక్కడైనా దొరుకుతుంది. విజయవాడ నవోదయని ఈ ఎడ్రసులో సంప్రదించవచ్చు.

    vjw_booklink at yahoo.co.in

    వ్యాఖ్య ద్వారా కొత్తపాళీ — సెప్టెంబర్ 21, 2007 @ 3:47 సా. | స్పందించండి

  17. థాంక్సో! బాగానే ఊరిస్తున్నారు. ఇదివరలో ఇలా ఊరించి రాయకుండా వదిలేసినవి కొన్ని ఉన్నాయి. ఇది అలా చేయకండి 🙂

    వ్యాఖ్య ద్వారా Sriram — సెప్టెంబర్ 21, 2007 @ 4:01 సా. | స్పందించండి

  18. హాహాహూహూ నే ననుకుంటా.. ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియలించారు

    వ్యాఖ్య ద్వారా చదువరి — సెప్టెంబర్ 21, 2007 @ 4:45 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

Leave a reply to vbsowmya స్పందనను రద్దుచేయి