తెలుగునాట మిగిలిన ఏకైక కళ సినిమా అంటూ వాపోయాడు రాకేశ్వరుడు ఈమధ్యే. ఐతే, ఈ సినిమా అనేది 64 కళల సమ్మేళనం అన్న విషయం తెలియని వాళ్ళందరూ సినిమాలు తీస్తుండడమే పెద్ద సమస్య అనిపిస్తుంది నాకు. తెలుగుసినిమా ప్రపంచంలో ప్రస్తుతం ఈ విషయాన్ని కాస్త వంటబట్టించుకున్నది శేఖర్ కమ్ముల అనిపిస్తుంది. సినిమాకి సంబంధించిన వేరే విషయాల గురించి నాకు పెద్దగా తెలియదు కానీ, సంగీతం విషయంలో మాత్రం తన ఉత్తమ అభిరుచిని శేఖర్ తన సినిమాల ద్వారా ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆనంద్, గోదావరి – ఈ రెండు సినిమాలకీ సంగీతం అందించిన రాధాకృష్ణన్ శాస్త్రీయంగా సంగీతం నేర్చుకున్నవాడు. భారతీయ సంగీతం ఆధారంగా శాస్త్రీయ సంగీతపు రాగాలని వాడి మంచి సంగీతం అందించాడు. (ఇంకా…)
సెప్టెంబరు 19, 2007
సెప్టెంబరు 15, 2007
వానపాటులు
మొన్న రాత్రి మా ఊళ్ళో ఎడతెగని వర్షం. నేను ఇంటికి చేరుకున్నాకే మొదలవ్వడంతో నేను చాలా ఆస్వాదించాను. చదువరిగారు చెప్పినట్టు చీమచతురత చూసి కాదులెండి. నాకిష్టమైన వానపాటని గుర్తు చేసుకుంటూ. (ఇంకా…)