నవతరంగంలో (సినిమా)సంగీతానికి సంబంధించిన మొదటి వ్యాసం. నా మొదటివ్యాసం కూడా.
ఫిబ్రవరి 9, 2008
అక్టోబర్ 21, 2007
శ్రవణయంత్ర శాలల్లో శాస్త్రీయ సంగీతం…
“శ్రవణయంత్ర శాలల్లో శాస్త్రీయ సంగీతం లాగ…” అని మహాకవి వెక్కిరిస్తే వెక్కిరించాడు కానీ, ఆ ఆకాశవాణే కనక పోషించి ఉండకపోతే మన తెలుగునాట సంగీతమూ సంస్కృతీ ఈ మాత్రం కూడా నిలబడి ఉండే కావు అని నాకు అనిపిస్తుంది. ఐనా ఆ మాటకొస్తే భారతీయ సంగీతపు లోతులు తెలిసిన వాళ్ళకి దాని ముందు ఈ రేడియోలాంటివి ఏ మాత్రం గొప్ప అద్భుతాలు అనిపించక మానదు. ఈ విషయంలో ఎవరికైనా సందేహాలుంటే నాగరాజు మేస్టారుని సంప్రదించండి. అసలు అయనే ఒక వ్యాసం రాస్తే అందరికీ ఉపయోగమని నా అభిప్రాయమూ, రాయమని ప్రార్ధనాను. (ఇంకా…)
సెప్టెంబరు 19, 2007
హేపీ డేస్ - పాటల పరిచయం
తెలుగునాట మిగిలిన ఏకైక కళ సినిమా అంటూ వాపోయాడు రాకేశ్వరుడు ఈమధ్యే. ఐతే, ఈ సినిమా అనేది 64 కళల సమ్మేళనం అన్న విషయం తెలియని వాళ్ళందరూ సినిమాలు తీస్తుండడమే పెద్ద సమస్య అనిపిస్తుంది నాకు. తెలుగుసినిమా ప్రపంచంలో ప్రస్తుతం ఈ విషయాన్ని కాస్త వంటబట్టించుకున్నది శేఖర్ కమ్ముల అనిపిస్తుంది. సినిమాకి సంబంధించిన వేరే విషయాల గురించి నాకు పెద్దగా తెలియదు కానీ, సంగీతం విషయంలో మాత్రం తన ఉత్తమ అభిరుచిని శేఖర్ తన సినిమాల ద్వారా ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆనంద్, గోదావరి - ఈ రెండు సినిమాలకీ సంగీతం అందించిన రాధాకృష్ణన్ శాస్త్రీయంగా సంగీతం నేర్చుకున్నవాడు. భారతీయ సంగీతం ఆధారంగా శాస్త్రీయ సంగీతపు రాగాలని వాడి మంచి సంగీతం అందించాడు. (ఇంకా…)
సెప్టెంబరు 15, 2007
వానపాటులు
మొన్న రాత్రి మా ఊళ్ళో ఎడతెగని వర్షం. నేను ఇంటికి చేరుకున్నాకే మొదలవ్వడంతో నేను చాలా ఆస్వాదించాను. చదువరిగారు చెప్పినట్టు చీమచతురత చూసి కాదులెండి. నాకిష్టమైన వానపాటని గుర్తు చేసుకుంటూ. (ఇంకా…)
సెప్టెంబరు 3, 2007
మధురాధిపతే రఖిల మధురం…
కరారవిందేన పదారవిందం
ముఖారవిందే వినివేశయంతం
వటస్య పత్రస్య పుటేశయానం
బాలం ముకుందం మనసాస్మరామి|| (ఇంకా…)