షేర్ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాల గురించి.
ఐనా ఇదేమైనా కొత్తగనకనా!
ఎంత తెలిసినా ఆశ చెడ్డది.
జనవరి 23, 2008
కోతుల్ని కొనే వాళ్ళుంటారు జాగ్రత్త!
అక్టోబర్ 19, 2007
గురుదక్షిణగా…
గురువుగారి అభివృద్ధి కోరుకోవడమే నిజమైన గురుదక్షిణ అని పెద్దలు చెప్పగా విన్నాను. అంత కన్నా వేరే ఇవ్వగలిగేది కూడా ఏమీ లేదనుకోండి.
రేపు తమ భరతనాట్య కౌశలాన్ని మిషిగన్ నగరంలో ప్రదర్సించబోతున్న కొత్తపాళీ గురువు గారికి శుభాభినందనలు! మీ ప్రదర్శన దిగ్విజయం కావాలని కోరుకుంటున్నాను.
సెప్టెంబరు 26, 2007
పెళ్ళి తీర్చిన సమస్య!
కొంతమందికి పెళ్ళికాక సమస్య. చాలా మందికి పెళ్ళయ్యాకా ప్రతీదీ సమస్యే. మరి పెళ్ళివల్ల సమస్య తీరడం ఏమిటి అంటారా, నేను చెప్పేది లోకకళ్యాణం కోసం జరిగిన పెళ్ళిగురించి. అదే సీతారామకళ్యాణం. (ఇంకా…)
సెప్టెంబరు 2, 2007
క్రమాలంకారం కాళ్ళు మళ్ళీ పట్టుకుని…
తాంత్రిక శాస్త్రం చదువుకునే రోజుల్లో మా కళాశాల విద్యార్ధులందరికీ గౌతమ బుద్ధుడు ఆదర్శం. నిజమైన జ్ఞానం చెట్టుకిందే లభిస్తుందని గట్టిగా నమ్మేవాళ్ళం. అందుకే ఎక్కువ సమయం కళాశాల ఆవరణలో మా విభాగపు భవనానికి ఎదురుగా ఉన్న చెట్టుకింద గడిపేవాళ్ళం. (ఇంకా…)
ఆగష్టు 14, 2007
కొత్త సమస్యలు
పులిని చూసి నక్క వాతలు పెట్టుకోడం.
కొత్తపాళీగారిని చూసి నేను పద్యాలు రాయడం.
రాసిన తర్వాత దురదకొద్దీ వాటిని బ్లాగడం.
పర్యవసానంగా ఊకదంపుడుగారు ఈ బాంబు పట్టుకొచ్చి నా బ్లాగులో పడేసారు. మిడతంభొట్లు మీ చేతిలో చిక్కేసాడండీ అని పేరు చెప్పి శరణు కోరడానికి అహం అడ్డు. ఏమిటి కర్తవ్యం?
పోరాడడం తప్ప వేరే మార్గం కనపడలేదు. తప్పదు, మీరు భరించాల్సిందే!
సమస్య:
“గర్భముదాల్చెను పురుషుడు గంగలొ మునగన్”
నా పూరణ:
కం|| గర్భాధానపు తంతును
నిర్భీతిగ శంతనుండు నీటనె నెరపెన్
గర్భము పండగ గంగకు
గర్భము దాల్చెను, పురుషుడు గంగలొ మునగన్!
(మహాభారతంలో భీష్ముడి తండ్రి శంతన మహారాజు, గంగను వివాహం చేసుకుని పిల్లల్ని కన్నాడు. వాళ్ళు కాపరం ఎక్కడ చేసారో నేను చూడలేదు కానీ, మన సంప్రదాయం ప్రకారం ఆడపిల్ల ఇంట్లోనే ఈ గర్భాధానపు తంతు జరుగుతుంది.)
(From Brown: పురుషుడు (p. 0776) [ puruṣuḍu ] purushuḍu. [Skt.] n. A man. A husband)