సంగతులూ,సందర్భాలూ….

జనవరి 26, 2008

ఏమి కృతజ్ఞత!

ప్రచురించిన వర్గము కబుర్లు — Sriram @ 12:45 పూర్వాహ్నం

రాజ్‌దీప్ సర్దేసాయ్ కి పద్మశ్రీ.
గుజరాత్ లో కనక నెగ్గి ఉంటే ఏకంగా భారతరత్నే ఇచ్చి ఉండేవారేమో! ఏమైతేనేం ఆంగ్ల మాధ్యమాల వాళ్ళు కాంగ్రెస్ కి చేసిన సాయం ఊరికే పోలేదు.

4 వ్యాఖ్యలు »

  1. మీ అభిప్రాయం పాక్షికసత్యమని తెలియజేసేందుకు విచారిస్తున్నాను.ప్రతి ఏటా తద్దినాల లాగా ఎవరో ఒకరికి మీడియా నుంచి ఇవ్వాలి కాబట్టి రాజ్ దీప్ కు ఇచ్చారు.మీరు చెప్పే దాని ప్రకారం యన్.డి.ఏ ప్రభుత్వం లో కూడా వారికి అనుకూలమైన వారికే ఇచ్చారని మీ భావమా?నరేంద్రమోడి గుజరాత్ లో అధికారం లోకి వచ్చేముందు ఊరూపేరూ లేని పత్రికలు ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిస్తే మీరు ఇలా రాసేవారు కాదు.అవునూ మీరు తెలుగుపత్రికలు చదవరా?

    వ్యాఖ్య ద్వారా రాజేంద్ర కుమార్ దేవరపల్లి — జనవరి 26, 2008 @ 1:06 అపరాహ్నం

  2. రాజేంద్రకుమార్ గారూ, మీ అభిప్రాయం చెప్పడానికి మీరెందుకండీ విచారించడం? అధికారంలో ఉన్నవాళ్ళ అనుకూలురుకి అవార్డులు ఇవ్వడం మామూలే కానీ, ఈ సారి కట్టగట్టుకుని రాజ్‌దీప్, బర్ఖా దత్, వినోద్ దువా లకి ఒకేసారి ఇవ్వడమే అసలు విషయం. ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలంటే జర్నలిస్టులలో చాలామందే ఉన్నారు అర్హులైన వాళ్ళు. రాజ్‌దీప్ లాంటి వాళ్ళు కేవలం వ్యాపారస్తులు.

    నేను తెలుగుపత్రికలు చదవను అని మీరెందుకు అనుకున్నారు?

    వ్యాఖ్య ద్వారా Sriram — జనవరి 26, 2008 @ 3:32 అపరాహ్నం

  3. అవునండి నరేంద్రమోడిని ఓదించడానికి రాజ్‌దీప్, బర్ఖా చెయ్యని ప్రయత్నం లేదు, వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి కదా… కాంగ్రేస్ వాళ్ళు అప్పుడే దువ్వుడు కార్యక్రమం మొదలెట్టేసారు…

    వ్యాఖ్య ద్వారా ramakrishna — జనవరి 27, 2008 @ 4:58 పూర్వాహ్నం

  4. మన రాష్ట్రంలో పార్టీలు,పత్రికల మధ్య అలరారుతున్న అన్నోన్యత మీకు ఎందుకు కనిపించలెదా అని అడిగాను.

    వ్యాఖ్య ద్వారా రాజేంద్ర కుమార్ దేవరపల్లి — జనవరి 27, 2008 @ 5:35 అపరాహ్నం

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.