చూసి, విని నవ్వుకోండి. అంతకన్నా చెయ్యగలిగినదేమీ లేదు. మొండివాడు రాజు కన్నా బలవంతుడు. ఐనా, గంతకి తగ్గ బొంత, ప్రజలకి తగ్గ పాలకులు. చదువుకున్న వాళ్ళ సభల్లోకి (విధాన మండలి) కూడా సెల్ఫోన్లు పంచిపెట్టి ఎన్నికైపోవచ్చు మనదేశంలో. లేకుంటే కులమో, మతమో లేకుంటే మరోటో ఆధారంగా కూడా.
మొత్తం మీద నాకు నఫీసా ఆలీని చూస్తే నవ్వూ, జాలీ కలిగింది. వేసుకున్న రకరకాల ఇజాల ముసుగులని సమర్ధించుకోలేక, ఒవైసీకి సమాధానం చెప్పలేక ఆవిడ పడిన ఇబ్బంది చూస్తే. ఇప్పుడు ఆవిడకి ఎమ్మెఫ్ హుస్సేన్ చేసిన పని కూడా తప్పుగా కనిపిస్తోంది. మరి అప్పట్లో ఈ అభ్యుదయ లౌకిక వాదులందరూ ఎందుకు మాట్లాడనట్టో. చివరకి ఏమీ మార్గంలేక బంగ్లాదేశీయులూ, పాకిస్తానీయులూ కూడా భారతీయులేనంటూ ఒక గంభీరమైన ప్రకటన చేసేసారు. ఔనులెండి ఆవిడకి అలా అనిపించడంలో తప్పులేదు. అందుకే కదా ఈ వామపక్షాల వాళ్ళు పశ్చిమబెంగాలులోకి బంగ్లాదేశీయులని వదిలేసి వాళ్ళందరి ఓట్లూ వేయించుకుంటూ ఉంటారు.
అన్నట్టు మన (అ)ప్రధాని గారు కూడా కంటినిండా నిద్రపోవచ్చు. మజ్లిస్ ఎమ్మెల్యేలని బెయిలు మీద వదిలిపెట్టేసారు.
మనం బాధ పడటం తప్ప, ఈ వేస్టు గాళ్ళొక్కడికి కూడా ఆ మజ్లిస్ లీడర్ల మీద ఏక్షన్ తీసుకునే దమ్ము లేదు సార్. మళ్ళీ ఎన్నికలొస్తున్నాయి. కాంగీ, మజ్లిస్ మళ్ళీ చెట్టపట్టాలేసుకు తిరగాలి కదా!
వ్యాఖ్య ద్వారా వికటకవి — ఆగష్టు 11, 2007 @ 8:19 పూర్వాహ్నం
శ్రీరామా, పైన నీ టపా చదివితే - నఫీసా అలీ మిద నువ్వు చూపించిన జాలి ఒవైసీని సమర్ధించినట్టుగా అనిపిస్తోంది. నఫీసా గారు కాన్వెంటు ఇంగిలీషు యాసతో మాట్లాడినా పెద్ద తెలివైనది కాదనీ మాట చమత్కారం లేదనీ తెలుస్తూనే ఉంది. ముసుగులు వేసుకోవటాన్ని కూడా ఖండించాల్సిందే .. కానీ బహుశా ఇటువంటి ఉద్రిక్త సందర్భం దానికి సరైన వేదిక కాదనుకుంటా
వ్యాఖ్య ద్వారా కొత్తపాళీ — ఆగష్టు 11, 2007 @ 6:35 అపరాహ్నం
[...] Filed under: Uncategorized — Sriram @ 1:20 am నేను రాసిన దాన్ని చూసి గురువుగారు ఒవైసీని [...]
పింగ్ బ్యాక్ ద్వారా తప్పెవరిది? « సంగతులూ,సందర్భాలూ…. — ఆగష్టు 12, 2007 @ 1:20 పూర్వాహ్నం
[...] సంధర్బాలు అనే బ్లాగుపై ముందుగా మీ అందరి వినోదం కోసం అని ఓ వ్యాసం వ్రాసి తరువాత దాని ఫాలో [...]
పింగ్ బ్యాక్ ద్వారా బ్లాగ్ తుఫాన్లు: | సోది sOdi — ఆగష్టు 12, 2007 @ 8:51 పూర్వాహ్నం