సంగతులూ,సందర్భాలూ….

జులై 21, 2007

ఆకాశదేశాన ఆషాఢమాసాన…

ప్రచురించిన వర్గము కబుర్లు, పుస్తకాలు, భారతీయ సాహిత్యం — Sriram @ 12:32 అపరాహ్నం

తెలుగులో మనకి నెలల పేర్లు ఉన్నా, ఈ రోజుల్లో లౌకిక వ్యవహారాలలో వీట్లని మనం అనుసరించకపోవడం వల్ల, ఏ నెల ఎప్పుడొస్తుందో ఎప్పుడు వెళ్తుందో మనకి తెలీదు. కానీ వీటికి ఉన్న ఒక మినహాయింపు ఆషాఢమాసం. దానికి కారణం ఆషాఢమాసం పేరుతో దండిగా వ్యాపారం చేసుకునే బట్టల దుకాణాలవాళ్ళ వ్యాపార ప్రకటనలే.

ఈ సంవత్సరం ఆషాఢమాసం వచ్చిందని తెలియగానే నాకు మేఘసందేశం సినిమాలోని ఈ పాట గుర్తొచ్చింది. దానితో కాళిదాసు మేఘసందేశం గురించి తెలుసుకోవాలని ఉత్సాహం కలిగింది. ఉండబట్టలేక సాహిత్యం గూగుల్ గుంపులో అడిగేసరికి పద్మ గారు ఆ కావ్యం గురించిన వివరాలు అందచేసారు.

ఆవిడ మాటల్లో : “మేఘదూతా కావ్యానికి తెలుగులో అతి చక్కని, సరళమైన వ్యాఖ్యానం రాసింది రామవరపు శరత్ బాబు, శోంఠి శారదాపూర్ణ గార్లు. వీళ్లిద్దరూ విశ్వనాథవారికి శిష్య ప్రశిష్యులు, వరుసగా. ఈ పుస్తకంలో ప్రతి శ్లోకానికి ప్రతిపదార్థ తాత్పర్యాలే కాకుండా, పదచ్ఛేద, అన్వయాలు, “శ్రీకాళా” వ్యాఖ్య కూడా ఉంది. ఆనందలహరి, విశాఖపట్టణం వారి ప్రచురణ. ఈ పుస్తకం నేను ‘98 లో అట్లాంటాలో జరిగిన మొదటి అమెరికా తెలుగు సాహితీ సదస్సులో కొన్న గుర్తు. విశాలాంధ్రలో కూడా దొరకచ్చు.”

ఈ వివరం చూసి నేను ఆన్లైన్ గ్రంధాలయంలో వెతికితే శరత్బాబుగారి పుస్తకం దొరికేసింది.

మేఘదూతం కావ్యాన్ని చదవాలనీ, కాళిదాసు “ఉప్మా” రుచి చూడాలనీ ఆసక్తి ఉండి, సంస్కృతానికీ గ్రాంధికానికీ భయపడే నాలాంటి వాళ్ళకి గొప్ప కానుక ఈ పుస్తకం. ప్రతీ శ్లోకానికీ సరళమైన వ్యావహారిక భాషలో  అర్ధం,వ్యాఖ్యానం ఉన్నాయి. దీనివల్ల కావ్యాన్ని సంపూర్ణంగా ఆస్వాదించగలగడమే కాక, మన భాషాజ్ఞానాన్ని కూడా  పెంచుకోగలుగుతాం. ఇటువంటి పుస్తకాలు మరిన్ని రావాలని నా ఆశ.
 

అభిప్రాయములు »

  1. మంచి పుస్తకం అందించినందుకు కృతఙ్ఞతలు

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా vaagdevi — జులై 22, 2007 @ 9:53 అపరాహ్నం | జవాబు

  2. శ్రీరామ్ నువ్విచ్చిన లింకులో ఏమీ రావట్లేదు. కొంచెం చూసి సరైన లింకు ఇవ్వగలవా? ఇదే కాదు…అముక్తమాల్యద కూడా సరళ తెలుగు అర్థాలతో చదవాలని ఆశ.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా నవీన్ గార్ల — ఆగష్టు 5, 2007 @ 4:46 అపరాహ్నం | జవాబు

  3. నేనిచ్చిన లంకె సరి ఐనదేనండీ. సర్వర్ పనిచేయట్లేదు అంతే.
    ఒక పని చెయ్యండి: http://dli.iiit.ac.in/ కి వెళ్ళి Author= ramavarapu అని వెతకండి దొరుకుతుంది.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Sriram — ఆగష్టు 5, 2007 @ 11:33 అపరాహ్నం | జవాబు

  4. శ్రీరామా, మీ సమావేశపు వివరాలు ఈ తెలుగులో చాలా చక్కగా రాశావు. మీరు చర్చించిన విషయాలు ఆసక్తికరంగానూ, కార్యాచరణలో పెట్త వలసినవిగానూ అనిపించాయి. కాస్త ఓపిక చేసుకుని ఆ విషయాల గురించి ఇంకొంచెం రాస్తే బావుంటుంది.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కొత్త పాళీ — ఆగష్టు 7, 2007 @ 12:21 పూర్వాహ్నం | జవాబు

  5. గురువుగారూ తప్పకుండా. గృహిణుల గురించిన విషయంపై తెలుగుబ్లాగరుల గుంపులో రాసాను చూడడి. మిగిలిన అంశాలపై త్వరలో నాబ్లాగులోనే రాస్తాను.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Sriram — ఆగష్టు 8, 2007 @ 12:37 పూర్వాహ్నం | జవాబు

  6. sriram garu,

    plese try for cd MEGHADUTHAM released by musictoday.kalidasa slokas were sung by Hariharan and kavithakrishnamuthy and music rendered by chowrasia if Iam correct.listening it was a great experience
    SRIRAM VELAMURI

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా sriram velamuri — ఆగష్టు 8, 2007 @ 4:04 అపరాహ్నం | జవాబు

  7. Thanks sriram for this wonderful piece of information. i shall try for this CD sometime…

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Sriram — ఆగష్టు 8, 2007 @ 6:28 అపరాహ్నం | జవాబు


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.