సంగతులూ,సందర్భాలూ….

మే 4, 2007

నేను సైతం…(55 పదాల్లో)

ప్రచురించిన వర్గము కబుర్లు — Sriram @ 12:27 అపరాహ్నం

“పురుషాహంకారం! నాకు ఇష్టం లేదంటే వినరేం?”

“అది తప్పనిపిస్తోంది…భర్త మాట వినడం ధర్మం అనుకో కనీసం…”

“ఈ ధర్మపన్నాలు నాకు చెప్పకండి.రాముడు సుఖపడ్డాడా…రావణుడు సుఖపడ్డాడా? ఎందుకొచ్చిన ధర్మం?”

“ఇప్పుడు ఈ చర్చ అవసరమా?”

“సర్లెండి. అక్కడ హాల్లో పిల్లలు గోల చేస్తున్నారేమిటో చూడండొకసారి..”

“ఏముందీ…బుజ్జిగాడు వాళ్ళక్క దగ్గర చాక్లేట్ లాక్కున్నాడుట. అది ఏడుస్తోంది…”

“మీరు చేసిందే…మగ పిల్లాడు కదా అని గారం. తప్పురా అని చెప్పి రెండు తగిలించరు ఎప్పుడూ…”

అభిప్రాయములు »

  1. బలే బలే .. నీకింకా ఈ 55 పురుగు కుట్టలేదేమా అని చూస్తున్నా. కథలో కొంచెం మిష్టరీ అన్న మాట .. ఇంతకీ ఒర్జినల్ గా ఆ దంపతులు ఎందుకు కీచులాడుకుంటున్నట్టో!

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కొత్త పాళీ — మే 4, 2007 @ 5:04 అపరాహ్నం | జవాబు

  2. డౌటు డిటో. కథలో కొంత అసహజత్వం. నాన్న కూతురు పక్షం, అమ్మ కొడుకు పక్షం ఉండడం సహజం.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా సత్యసాయి — మే 4, 2007 @ 7:08 అపరాహ్నం | జవాబు

  3. కొత్తపాళీ గారూ…గురువు గారి అనుజ్ఞ మరి… :)
    “ఇంతకీ ఒర్జినల్ గా ఆ దంపతులు ఎందుకు కీచులాడుకుంటున్నట్టో!”
    ఏమోనండి మరీ…ఐనా దంపతులు కీచులాడుకోడానికి కారణాలుంటాయని అనుభవజ్ఞులు అనుకోవడం చూస్తే కాస్త ఆశావహంగానే ఉంది…. :)

    సత్యసాయి గారూ…మన్నించాలి. నేను నా భావం సరిగ్గా తెలియపరచలేకపోయినట్టున్నా…

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Sriram — మే 4, 2007 @ 10:28 అపరాహ్నం | జవాబు

  4. i read the 55words stuff in english… its good to read such thing in telugu! did it already start? can u give me the link?
    nice one… but having gone thru ur posts can say- cud have been even better…

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా joshmybench — మే 7, 2007 @ 1:41 పూర్వాహ్నం | జవాబు

  5. deepthi, i dunno what u meant by “did it already start?” but you can check these links:
    http://mynoice.blogspot.com/ (2nd post)
    http://krishnadevarayalu.blogspot.com/
    http://satyasodhana.blogspot.com/

    and regarding this story, well, i wanted this to be a little cryptic as it coould get a little controversial. i just tried to portray the hypocrisy among the so called progressive ppl. looks like i dint succeed much…

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Sriram — మే 7, 2007 @ 5:31 అపరాహ్నం | జవాబు

  6. In English, someone actually organized a single blog with all the entires for the 55-word stories. That is the link I posted in the telugu blog group. I think that’s what deepti is referring to.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కొత్త పాళీ — మే 8, 2007 @ 2:45 పూర్వాహ్నం | జవాబు

  7. yes i was referring about the 55-words in english..its a seperate blog… thanx for the links…may be u can write the grandpa-grandson story of science and vedas in 55 words! it wud be of gr8 subject to create some tempo..

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా joshmybench — మే 8, 2007 @ 6:23 పూర్వాహ్నం | జవాబు

  8. kottapali gaaru, i will check telugu blog group for the link, thanks for the info.

    hmm…deepthi…thanks for the suggestion. but looking at the response to my first attempt, i am a little hesitant. may be ppl like u can take the lead… :)

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Sriram — మే 8, 2007 @ 10:11 పూర్వాహ్నం | జవాబు

  9. Hello Sriram garu,

    Came to this blog from your photo-blog. akkadiki rasikas ninchi ochaanu :-)

    Wanted to say hello.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా chetana — మే 8, 2007 @ 11:09 అపరాహ్నం | జవాబు

  10. Hello Chetana garu…svaagatam. Keep visiting :)

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Sriram — మే 8, 2007 @ 11:58 అపరాహ్నం | జవాబు

  11. “ఇష్టం లేదు, ఎందుకొచ్చిన ధర్మం, మీరు చేసిందే … ” ఈ మాటలతో ఆ పాత్ర అసహనం కనబడుతోంది. ఆలోచన తక్కువైన ఆమెతో భర్తపాత్ర ఏం మాట్లాడినా నిష్ప్రయోజనమే. ఇంకొంచెం సమయం తీసుకొనుంటే ఈ కథను మరింత అర్థవంతంగా చెప్పగలిగేవారేమో.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా రానారె — మే 9, 2007 @ 4:37 పూర్వాహ్నం | జవాబు

  12. రానారె గారూ…మీ సూచనలకి కృతజ్ఞతలు. నేను ఆ రకమైన సంభాషణలు కావాలనే రాసాను. కానీ నేను వ్యక్తీకరిద్దామనుకున్న భావం సరిగ్గా అందిచలేకపోయినట్టుంది…

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Sriram — మే 9, 2007 @ 10:28 పూర్వాహ్నం | జవాబు

  13. రానారె గారు, మరేమనుకోవద్దు- మీరు కాస్త థియారిటికల్‍గా ఆలోచించి కామెంటు వ్రాసారు. శ్రీరాంగారు వ్రాసినది ప్రాక్టికల్‍గా ఉందనిపిస్తోంది. మీరింకా పరకాయప్రవేశపూర్వపు శంకరులే.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా సత్యసాయి — మే 9, 2007 @ 12:14 అపరాహ్నం | జవాబు

  14. సాయిగారూ…నేనూ రానారె స్థితిలోని వాడినేనండీ. కానీ మీ అనుభవపూర్వకమైన వ్యాఖ్య నా ఊహకి బలాన్నిస్తోంది…ధన్యవాదాలు! :)

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Sriram — మే 9, 2007 @ 12:27 అపరాహ్నం | జవాబు


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.